Mohan Babu: మోహన్ బాబు తనుయుడు మనోజ్ టాలీవుడ్ లో యంగ్ హీరోల్లో ఒకరని మనకు తెలుసు. ఇటీవలే మంచు మనోజ్ కి రెండవ పెళ్లి జరిగిన సంగతి మనందరికీ తెలిసినదే. మంచు మనోజ్ కి మొదట ఒక పెళ్లి ( Mohan Babu comments on manoj and mounika marriage ) జరిగింది. కానీ మొదటి భార్యతో కొన్ని మనస్పర్థలు రావడం వలన ఇద్దరూ విడిపోయారు. ఆ తరవాత కొంతకాలం అలానే సింగల్ గా ఉండిపోయారు. మంచు మనోజ్ కి మొదటి భార్యతో పిల్లలు కూడా కలగలేదు. ఆ తరవాత చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన భూమా వారి కుటుంబం నుంచి మౌనిక భూమా ని ప్రేమించాడు. మౌనిక భూమా రెడ్డి కి కూడా ముందు ఒక పెళ్లి జరిగింది. ఒక కొడుకు కూడా పుట్టాకా, ఆ భార్యాభర్తలు ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మౌనిక మనోజ్ లు స్నేహం కాస్తా కొంచెం ముందుకు వెళ్లి ప్రేమగా మారింది.
ఆ ప్రేమ కాస్త స్ట్రాంగ్ అని ఒకరికి ఒకరు అనుకున్న తరవాత పెళ్లి చేసుకోవడం జరిగింది. మనోజ్ మౌనిక ల పెళ్లి మొత్తం మంచు లక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. దీనితో అందరూ మనోజ్ మౌనిక ల పెళ్లి మోహన్ బాబుకి ఇష్టం లేదని, అందుకే మంచు లక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతుందని అనేక వార్తలు విన్నాము. అలాగే మౌనిక కి ముందు భర్తతో ఒక కొడుకు ఉండటం వలన మోహన్ బాబుకి అసలు ఇష్టం లేదని, పైగా ఆ పిల్లాడిని మంచు కుటుంబానికి వారసుడిని చెయ్యడం ఇష్టం లేక ఆ పెళ్లి ( Mohan Babu comments on Manoj and Mounika marriage ) ఒప్పుకోవడం లేదని, అసలు మనోజ్, మౌనికల పెళ్లికి మోహన్ బాబు హాజరు కాడని ఎన్నో వార్తలు ఆ టైం లో వైరల్ అయ్యాయి. కానీ అందులో ఎన్ని నిజాలు ఉన్నాయో, ఎన్ని గాలి వార్తలు ఉన్నాయో ఎవ్వరికీ తెలీదు.
అయితే ఇటీవల మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన మాట్లాడిన మాటలతో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అసలు మనోజ్ పెళ్లి పై మోహన్ బాబు అభిప్రాయం ఏమిటి? కొడుకుతో అతను ఎలా మాట్లాడతాడు? ఎలా ప్రవర్తిస్తాడు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనే అన్ని విషయాలు అందరికీ అర్ధమవుతాయి. మోహన్ బాబు ముక్కు సూటిగా మాట్లాడే మనిషే గాని, మనసు మంచిదని పేరు ఉంది. ఈ విషయం తెలిసాకా అది నిజమే అనిపిస్తాది. మోహన్ బాబుని ఇంటర్వ్యూ చేసినప్పుడు.. మనోజ్ పెళ్లి పై మీ అభిప్రాయం ఏమిటి? మనోజ్ మౌనికను చేసుకోవడం మీకు ఇష్టమేనా అని అడగ్గా, మోహన్ బాబు ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఒకరోజు మనోజ్ నా దగ్గరికి వచ్చి, డాడీ నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడు అన్నాడు.
దానికి నేను ఒకసారి ఆలోచించుకోమని సూచించాను.. మనోజ్ లేదు డాడీ నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని భావిస్తున్నాను అన్నాడు. దానితో నేను.. ఇంకేముంది చేసుకో బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను అని మోహన్ బాబు చెప్పారు. కొడుకు నిర్ణయాన్ని ఒక్క సెకనులో అర్ధం చేసుకుని, గౌరవించిన మోహన్ బాబు ఆలోచన విధానానికి, సమయస్ఫూర్తికి, మంచి మనసుకి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు..