Miss Shetty Mr Polishetty : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుష్కకి ఎంత క్రేజ్ ఉందనేది మనందరికీ తెలిసిందే. స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతూ.. అందరు హీరోలు సరసన టాప్ హీరోయిన్గా నటించడమే కాకుండా.. లేడీ ( Miss Shetty Mr Polishetty first review ) ఓరియంటెడ్ సినిమాలతో తనకంటూ ఒక స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ అనుష్క. అయితే బాహుబలి తర్వాత అనుష్కకి అంత సూపర్ హిట్ ఇచ్చిన సినిమాలు అయితే కనిపించలేదు. అంతేకాకుండా గత కొంతకాలంగా హిట్ అనే రిజల్ట్ కూడా ఎక్కడ కనిపించలేదు. 2020 సంవత్సరంలో నిశ్శబ్దం అనే సినిమా ఆఖరి సినిమా ఓటీటీ లో రిలీజ్ అయింది. అయినా కూడా అనుకున్న స్థాయిలో ఎటువంటి మంచి రిజల్ట్ తీసుకురాలేకపోయింది.
అయితే అప్పటినుంచి అనుష్క సినిమా కోసం ఆమె అభిమానుల ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయినా కూడా తొందరపడకుండా ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ( Miss Shetty Mr Polishetty first review ) సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై సామాన్య ప్రేక్షకులకి పెద్దగా అంచనాలైతే లేవు.ఎందుకంటే ఒకపక్క అనుష్కా లాంటి స్టార్ హీరోయిన్.. ఈ సినిమాలో ఒక చిన్న హీరోతో నటించడం చాలామందికి పెద్దగా ఎక్కడం లేదు. అయితే అనుష్క అభిమానులు మాత్రం ఈ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని అనుకుంటున్నారు.
అయితే ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ చేయడానికి ముందుగా.. ఈ సినిమా ప్రసాద్ ల్యాబ్ లో స్పెషల్ షో ఒకటి రివ్యూ కోసం వేశారని అంటున్నారు. ఈ షో ప్రకారం ఈ సినిమాపై రివ్యూ బయటికి వచ్చింది. ఈ సినిమా ఏ లెవెల్ లో ఉండబోతుంది? ఎలాంటి సక్సెస్ ని అందుకోబోతుంది అనేది ఈ సినిమా చూసిన వాళ్ళ రివ్యూ ని బట్టి తెలుస్తుంది. ఈ షో తర్వాత వస్తున్న వార్తలను బట్టి ఈ సినిమాలో కామెడీ మాత్రం సూపర్ గా ( Miss Shetty Mr Polishetty first review ) ఉంటుందని అంటున్నారు. నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో చాలా అద్భుతంగా కామెడీ పండించాడని అంటున్నారు. అలాగే దర్శకుడు ఈ సినిమాలో అనుష్కని చాలా అద్భుతంగా చిత్రీకరించాడని.. ఆమె పాత్ర చాలా బాగుంటుందని.. చాలా బాగా నటించిందని.. అయినా అందులో చెప్పుకోవాల్సిన పనిలేదు, అనుష్కకి ఏ పాత్ర ఇచ్చిన ఇరగదీస్తది అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇక్కడ వరకు ఈ సినిమాపై అన్ని పాజిటివ్ టాకే వినిపిస్తున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ అయినా అవ్వకపోయినా కూడా హిట్టు మాత్రం ఖచ్చితంగా కొడుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కథ ప్రకారం.. పెళ్లి, భార్యాభర్తల బంధం పై నమ్మకం లేని హీరోయిన్ పెళ్లి కాకుండానే తల్లి కావాలని కోరుకోవడం.. అలాంటి కోరిక ఉన్న ఆమెను.. అర్థం చేసుకోలేక హీరో సతమతమవడం.. ఈ సీన్స్ లో కామెడీని చాలా బాగా పండించడం ఉంటుందని అంటున్నారు. అయితే పెళ్లి కాకుండా తల్లి కావాలని హీరోయిన్ కోరికని.. మన తెలుగు ఆడియన్స్ ఎంత వరకు కనెక్ట్ అవుతారు? ఈ పాయింట్ అనేది మాత్రం ఎక్కడో ఒక మూల డౌట్ గానే ఉంది. అయినా కూడా ఒకవేళ సినిమా ఆడియన్స్ మనసుని హత్తుకుంటే.. ఖచ్చితంగా మంచి హిట్టు కొట్టే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా సినిమా సెప్టెంబర్ 7వ తేదీన.. సామాన్య ప్రేక్షకులు చూసి రిజల్ట్ చెప్పిన తర్వాతే సరైన రిజల్ట్ బయటకు వస్తుంది..