
Chiranjeevi : మెగాస్టార్ ఇంట్లో మెగా మనవరాలు ఈరోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో జన్మించిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా అపోలో హాస్పిటల్ కాంతి వెలుగులతో.. హాస్పిటల్ లా కాకుండా ఒక సినిమా హాల్ లాగా మెరిసిపోతుంది. ఎప్పుడైతే మెగా ప్రిన్సెస్ పుట్టిందని తెలిసిందో.. వెంటనే అభిమానులందరూ ( Chiranjeevi speech about his Granddaughter ) అక్కడ చేరి ఆత్రంగా ఎదురు చూడటం మొదలుపెట్టారు. చిరంజీవి రాక కోసం, ఆయన మాటల కోసం, ఆయన నోటితో చెప్తుంటే వినాలని, ఆనందం కోసం అభిమానులు అక్కడ వేచి వేచి నిలబడి చూస్తూ ఉన్నారు. అలాగే చిరంజీవి రావడం అభిమానులకు ఆనందం కలిగేలా పలు మాటలు మాట్లాడటం కూడా జరిగింది.
చిరంజీవి రావడమే మెగా ప్రిన్సెస్ ఆడపిల్ల పుట్టినందుకు చాలా ఆనందంగా ఉందని.. ఇది మాకు ఎంతో అపురూపమని చెప్పారు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా మేము రామ్ చరణ్ ఉపాసనని తల్లిదండ్రులు కావాలని.. పండంటి బిడ్డని కని మా చేతిలో పెట్టాలని.. ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ కల ఈరోజు నెరవేరిందని.. అందుకే ఆ ( Chiranjeevi speech about his Granddaughter ) అమ్మాయి మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. మనవరాలు పుట్టిన ఆనందం చిరంజీవి ముఖంలో ఆనంద భాష్పాలు వచ్చేంతగా కనిపిస్తుంది. అభిమానులు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఇంకా ప్రెస్ వాళ్ళు అనేక ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు.
ఉపాసన డెలివరీ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారని విన్నాము తీసుకున్నారా అని అడిగితే.. అవును మొత్తం అంతా కూడా ఎక్కడ ఒక్క చిన్న రిస్క్ కూడా తీసుకోకుండా అన్ని రకాల మెడికల్ స్పెషల్ కేర్ తీసుకున్నామని చెప్పారు. బేబీ బర్త్ అంతా ప్లాన్డ్ గా ఆ టైం చేయించారా? అని అడగగా.. ఇవన్నీ ప్లాన్ ప్రకారం జరగవు.. అవి జరిగేటప్పుడు అలా ( Chiranjeevi speech about his Granddaughter ) జరుగుతూ ఉంటాయి అని చెప్పారు. మంగళవారం మీకు మనవరాలు పుట్టినందుకు మీకు ఏమనిపిస్తుంది అని అడగ్గా.. మంగళవారం మా కుటుంబం మొత్తం ఆంజనేయస్వామి నమ్ముకున్న కుటుంబం. ఆంజనేయస్వామి ఈరోజు మా ఇంటికి మహాలక్ష్మిని పంపించాలని అనుకుంటున్నామని చెప్పారు.
ఇంకా అనేక ప్రశ్నలు అడుగుతూ.. మంగళవారం ఆడపిల్ల పుట్టినందుకు మీ ఫీలింగ్ ఏమిటి? మీకు కలిసి వస్తుందని అనుకుంటున్నారా? అని అడగ్గా.. కచ్చితంగా ఆడపిల్లంటేనే లక్ష్మీదేవి.. పైగా మంగళవారం మహాలక్ష్మి లా మా ఇంట్లో అడుగుపెట్టింది అన్నారు చిరంజీవి. అయినా పుట్టాక ఎలా ఉంటాదెంటి? తను పుట్టడానికి ముందు నుంచి కూడా.. తాను ఎంత అదృష్టవంతురాలో సూచనలు చూపిస్తూనే ఉంది. చరణ్ కెరీర్ పరంగా చూసుకున్నా.. సక్సెస్ పరంగా చూసిన తన కడుపున పడిన దగ్గర్నుంచి ఎంతో బాగా ముందుకు వెళ్లాడు. అలాగే ఇటీవల మా ఇంట్లో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇలా మా కుటుంబంలో ఎన్నో పండుగలు, వేడుకలు, ఆనందాలని సాక్ష్యాలుగా ముందే సూచన ఇచ్చింది. నింపింది మా మెగా ప్రిన్సెస్ అనే మెగాస్టార్ చాలా గర్వంగా ఆనందంగా చెప్పు చెప్పారు తాను కడుపులో ఉండగానే మాకు ఈ సూచనలన్నీ ఇచ్చిందని చిరంజీవి గర్వంగా చెప్పారు.