Home Cinema Chiranjeevi: చిరంజీవి గ్యారేజ్ లోకి మరో కొత్త కారు. నెంబర్ కోసమే 5 లక్షలు. మరి...

Chiranjeevi: చిరంజీవి గ్యారేజ్ లోకి మరో కొత్త కారు. నెంబర్ కోసమే 5 లక్షలు. మరి కారు ధర ఎంతో తెలుసా.??

Megastar Chiranjeevi New Luxury Car: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ స్వయంకృషితో, పట్టుదలతో తానేంటో నిరూపించుకొని ఇప్పటివరకు కుర్ర హీరోలకు దీటుగా సూపర్ హిట్ సినిమాలు తీస్తూ తానెంటో నిరూపించుకుని తన సత్తా చాటుతున్నాడు. ఆరు పదుల వయసు దాటినప్పటికీ కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. అందుకే ఇప్పటికి చిరంజీవి సినిమాలు అంటే మెగా ఫ్యాన్స్ కి పూనకాలే.. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక వాల్తేరు వీరయ్య తో బాక్సాఫీస్ బద్దలు కొట్టాడని చెప్పొచ్చు..

megastar-chiranjeevi-buys-another-new-luxury-car-here-are-full-details

ఇక ప్రస్తుతం చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో చాలా బిజీ బిజీగా ఉన్నాడు. తన తదుపరి చిత్రం బోళాశంకర్..ఈ చిత్రంలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్న జోడీగా నటిస్తుండగా.. మహానటి కీర్తి సురేష్ చెల్లెలుగా కనిపించబోతోంది. ఇక మన టాపిక్ విషయానికి వస్తే.. ఇప్పటికే చిరంజీవి గ్యారేజ్ లో ఎన్నో కోట్ల రూపాయల విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి. అవి రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్ వోగ్, టయోటా ల్యాండ్ క్రూజర్ మొదలగునవి.. ప్రస్తుతం చిరు మరో లగ్జరీ కారు కొన్నాడు. అది టయోటా వెల్ఫేర్. పూర్తి బ్లాక్ కలర్ తో కన్నుల విందుగా కనిపిస్తున్న ఈ వాహనాన్ని ఆర్టిఓ అధికారులు 1111 నెంబర్ గా కేటాయించారు.

See also  Samantha : ఆ అనారోగ్యంతో సమంత నటనకు గుడ్ బాయ్ చెబుతూ.. కన్నీటితో ఒక్కసారి..

megastar-chiranjeevi-buys-another-new-luxury-car-here-are-full-details

TS 09 GB 1111 ఈ నెంబర్ ను చిరు 4.70 వేలు ఇచ్చి తను కైవసం చేసుకున్నాడు. ఈ కార్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం మంగళవారం ఖైరతాబాద్ ఆర్టిఏ కార్యాలయానికి చిరంజీవి వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇకపోతే చిరు కొన్న (Megastar Chiranjeevi New Luxury Car) కారు ధర దాని ప్రత్యేకతలు తెలిస్తే మీరు అవ్వాక్కవ్వడం ఖాయం. టయోటా సంస్థ ఇటీవల విడుదల చేసిన ఈ కారులో అత్యాధునికమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఫ్యూచర్ తో పాటు ఎన్నో సెక్యూరిటీ విషయాలు ఉన్నాయి. మూడు వరుసల్లో మొత్తం ఏడుగురు హ్యాపీగా కూర్చునే సౌలభ్యం ఉన్న ఇందులో రెండు సన్ రూఫ్ లు ఉన్నాయి.

See also  Chiranjeevi: ఇప్పటి వరకు చిరంజీవి కూడా పెట్టిన ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవడం ఖాయం..

megastar-chiranjeevi-buys-another-new-luxury-car-here-are-full-details

13 అంగుళాల ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ తో పాటు మూడు జోన్ల కంప్లీట్ క్లైమేట్ కంట్రోల్ అలాగే ఎలక్ట్రికల్ కంట్రోల్ స్లైడింగ్ డోర్లు దీని ప్రత్యేకతలు.. ఇక భద్రత విషయంలో దీనికి ఇదే సాటి.. అలాగే దీనిలో ఏడు ఎయిర్ బ్యాగ్స్, ముందుగా హెచ్చరించేందుకు బెల్స్, విజిల్స్ ఇందులో కలవు. ఈ లగ్జరీ కారు ఎంపీవి 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు రెండు విద్యుత్ మోటార్లను కలిగి ఉంది. ఇక ఇది గరిష్టంగా లీటర్ కు 16.35 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. మొత్తంగా చిరంజీవి గారి ఈ కారు కొనడానికి సుమారు 1.9 కోట్లు వెచ్చించారని తెలుస్తుంది.. సెలబ్రిటీలకు కారు కొనడం ఎంత ముఖ్యమో కారు నెంబరు అంతకన్నా ముఖ్యం. వాళ్ళు కావాలి అనుకున్న నెంబర్ రావడానికి ఎంతైనా ఖర్చు పెడతారు.