Home Cinema Sreeja : శ్రీజ మళ్ళీ చిరంజీవికి షాక్ ఇవ్వబోతుందా?

Sreeja : శ్రీజ మళ్ళీ చిరంజీవికి షాక్ ఇవ్వబోతుందా?

mega-star-chiranjeevi-daughter-sreeja-latest-news-viral

Sreeja : ఈరోజుల్లో ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, నచ్చకపోతే వెంటనే విడిపోవడం అన్నీ చాలా సర్వసాధారణమైపోయాయి. ఇక సెలబ్రెటీస్ సినిమా రంగంలో చూస్తే ఇవి మరింత ఫాస్ట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సినిమా రంగంలో ( Chiranjeevi daughter Sreeja ) నటీనటులు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం.. బాగానే ఉంటె ఆ బంధం ఎంతో అద్భుతంగా నిలబడటం లేదా విడిపోవడం అనేవి సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాం. కానీ కొంతమంది నటీనటుల వాళ్ళ పిల్లలు కూడా అదే బాటలో నడవడం దురదృష్టకరం. మెగా కుటుంబంలో ఈ బాధ ఆడపిల్లల రూపంలో కనిపిస్తుంది.

Mega-star-chiranjeevi-daughter-sreeja-with

చిరంజీవి కూతురు శ్రీజ తన మొదటి పెళ్లి ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా కూడా వాళ్లకి చెప్పకుండా మీడియా సహాయం తీసుకొని చిరంజీవి పరువు, ప్రతిష్టలను గురించి కూడా ఆలోచించకుండా ధైర్యంగా ( Chiranjeevi daughter Sreeja ) పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లితో అప్పుడు మెగా కుటుంబం చాలా సమస్యలు ఎదుర్కొంది. ఆ తర్వాత అతన్ని శ్రీజ వదిలేయడం జరిగింది. విడాకులు తీసుకున్న కూతుర్ని ఒంటరిగా వదలలేక.. పైగా కూతురు ఒక బిడ్డతో ఉన్నందున ఇద్దరినీ ఇంటికి తెచ్చుకొని చిరంజీవి చేరదీయడం జరిగింది. ఆ తర్వాత కూతురు మనసు నెమ్మదిగా కుదుటపడిన తర్వాత.. వాళ్లకు తెలిసిన అబ్బాయి కళ్యాణ్ దేవ్ తో ఎంతో వైభవంగా శ్రీజా కి రెండో పెళ్లి చేశారు.

See also  Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆ హీరోయిన్ పై చెయ్యి వెయ్యకూడని ప్రదేశంలో వేసి సారీ చెప్పాడట.

Mega-star-chiranjeevi-daughter-sreeja-divorce

శ్రీజ తన రెండవ భర్తతో ఎంతో అన్యోన్యంగా కొంతకాలం బాగానే ఉంది. అలాగే శ్రీజ, కళ్యాణ్ దేవ్ కలిసి ఒక ఆడబిడ్డను మళ్ళీ కన్నది. కొంతకాలానికి వీళ్ళిద్దరి మధ్య ఏ సమస్య వచ్చిందో తెలియదు గానీ.. వీళ్ళిద్దరూ కూడా దూరంగా ఉన్నారని అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. వీళ్ళిద్దరూ విడాకులు కచ్చితంగా తీసుకుంటారని ప్రజెంట్ ( Chiranjeevi daughter Sreeja ) ఉన్న టాక్. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక దగ్గర ఉండడం లేదు. అలాగే ఇటీవల వరుణ్ తేజ్ పెళ్లికి కూడా కళ్యాణ్ దేవ్ రాలేదు. కేవలం శ్రీజ మాత్రమే తన కూతురితో ఎంజాయ్ చేసింది. అప్పుడు అనేక విమర్శల్ని ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే దీపావళి సందర్భంగా కళ్యాణ్ దేవ్, శ్రీజ ల పాపని.. కళ్యాణ్ దేవ్ దగ్గరకు పంపించడం జరిగింది. కళ్యాణ్ దేవ్తన కూతురితో దీపావళి జరుపుకుంటూ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా జరిగింది.

See also  NTR : ఎన్టీఆర్ శతజయంతికి తారక్ రాకపోవడానికి అసలు కారణం అదా?

Mega-star-chiranjeevi-daughter-sreeja-family

అలాగే కళ్యాణ్ దేవ్- శ్రీజ పాపని కొన్ని రోజులు శ్రీజా దగ్గర ఉంటే.. కొన్ని రోజులు కళ్యాణ్ దేవ్ దగ్గరికి పంపిస్తారంట. అలాగే వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూస్తున్న కూడా నెటిజన్లకు ఒక అనుమానం పుడుతుంది. బహుశా కళ్యాణ్ దేవ్ , శ్రీజ కచ్చితంగా కలిసిపోతారని.. వాళ్ళిద్దరూ విడాకులు రద్దు చేసుకుంటారని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య బంధం బాగానే ఉందని కొంతమంది నమ్మకం. అలాగే శ్రీజ మొదటి కూతురుని కూడా కళ్యాణ్ దేవ్ చాలా బాగా చూసుకుంటాడు అంట. వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్న ఎన్నో ఫోటోలు కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం జరిగింది. ఎంతో చక్కగా ఇద్దరు కూతుర్లతో వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండడం ఎన్నోసార్లు కనిపించారు. ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటే పక్కకు నెట్టి.. ఇద్దరు మళ్ళి కలిసిపోయే అవకాశం ఉందని కచ్చితంగా కలిసిపోతారని టాక్ వినిపిస్తుంది. విడాకులు అయితే క్యాన్సల్ చేసుకున్నారన్నట్టు టాక్ వినిపిస్తుంది. ఒకవేళ శ్రీజ ఇదే నిర్ణయం తీసుకుంటే చిరంజీవికి ఎప్పటికప్పుడు శ్రీజ షాక్ ఇస్తున్నట్టే లెక్క. పోనీ ఈసారి ఈ షాక్ మాత్రం నిజంగా మంచి షాక్ అని అభిమానులను ఆశపడుతున్నారు.