
Chiranjeevi Dance : చిరంజీవి అంటే తెలుగు సినీ అభిమానులకి ఎంత ఇష్టమో కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేద. వయసు పెరుగుతున్న కొద్ది మెగాస్టార్ చిరంజీవిలో ఇంకా హుషారు, ఉత్సాహం పెరుగుతూనే ఉంది. నేటి ( Chiranjeevi dances with rapper RajaKumari ) యువతరంతో పోటీపడుతూ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఏడు పదుల వయసు దగ్గరికి వస్తున్నప్పటికీ ఇప్పటికీ కుర్రాడిలా స్టెప్పులు వేస్తూనే ఉన్నారు. అయితే ఒక్కొక్కసారి చిరంజీవి సినిమాలు కూడా కొన్ని ఫెయిలవుతూ ఉంటాయి. ఆ ఫ్లాప్స్ చూసినప్పుడు కొంతవరకు నిరుత్సాహం వస్తూ ఉంటుంది. ఇక చిరంజీవి ఓల్డ్ అయిపోయాడా అనే ఫీలింగ్ కలుగుతుంది.
గాడ్ ఫాదర్, బోలా శంకర్ వంటి సినిమాలు చూసినప్పుడు చిరంజీవి ఇంక ఏం సినిమాలు చేస్తాడు? ఇక సినిమాలకు దూరం అయితే బెస్ట్.. రిటైర్ అయిపోతే బాగున్ను అని ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. కానీ అదే జనం వాల్తేరు వీరయ్య లాంటి సినిమా వస్తే మెగాస్టార్ చిరంజీవి కేక అంటూ రచ్చ రంబోలా చేస్తారు. చిరంజీవి ఇంకా సూపర్ డూపర్ సినిమాలు చేయాలని ఆశపడతారు. అంటే చిరంజీవి ఎప్పుడూ తన వంతు శ్రమ తాను పడుతూనే ( Chiranjeevi dances with rapper RajaKumari ) ఉన్నాడు. వయసుతో ఎప్పుడూ కూడా ఆయన ఆగిపోలేదు. కానీ ఆయన్ని చూపించగలిగే విధానం, ఆయన సినిమాలో డాన్స్,ఫైట్స్ , స్టోరీ అన్నీ కూడా ఒక సమపాల్లో చక్కగా తీయగలిగే ట్యాలెంట్ దర్శకుడు ఉండాలి. దర్శకుడు కి చిరంజీవిని ఎలా చూపించాలో తెలిస్తే.. ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరిస్తారు అన్న విషయం అర్థమవుతుంది.
చిరంజీవి ఇంట్లో ఈ సంవత్సరం దీపావళి ఎంతో వేడుకగా చేసుకున్నారు. సెలబ్రిటీస్ ని సినిమా వాళ్ళందరిని పిలిచి చిరంజీవి ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేయడం జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనలకు క్లీన్ కార పుట్టిన తర్వాత ప్రతి పండుగను వాళ్ళు ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతకుముందు ( Chiranjeevi dances with rapper RajaKumari ) కూడా చేసుకున్నారు కానీ.. క్లింకార పుట్టిన తర్వాత కొంచెం ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కుటుంబానికి, కుటుంబంతో కలిసి నలుగురైదురు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోనూ, చుట్టాలతోనూ కలిసి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా అలా ఎంజాయ్ చేయాలని వాళ్ళ ఆలోచన మాత్రం నిజంగా గొప్పనే చెప్పుకోవాలి. అలాంటి కలయికల వలన అందరూ మనసులు ఆహ్లాదంగా ఉంటాయి.
దీపావళి సందర్భంగా చిరంజీవి ఇంట్లో ర్యాపర్ రాజ కుమారి సందడి చేసింది. ఈ మధ్య జవాన్ టైటిల్ ట్రాక్ టైటిల్ ట్రాక్, ర్యాప్‌తో బాగా ట్రేండింగ్ లోకి వచ్చింది. అయితే చిరంజీవి కూడా ఆమెతో కలిసి సందడి చేశాడు. ఆమె ర్యాప్‌తో చిరంజీవి వేసిన స్టెప్పులు ఆమెతో కలిసి చేసిన డ్యాన్సు ఇప్పుడు జనాలందరికీ విపరీతంగా నచ్చుతుంది. చిరంజీవి ఈ ఏజ్ లో కూడా అంత హుషారుగా వేసిన స్టెప్స్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆఫ్ స్క్రీన్ లోనే చిరంజీవి ఇంత అదరగొడుతున్నాడు అంటే ఆన్ స్క్రీన్ లో ఇంకెంత బాగా చేయగలడు.. చిరంజీవికి తగ్గ డాన్స్ కంపోజ్ ఇటీవల చేయడం మానేశారు. అందరూ ఎప్పుడూ ఉండే ఆ సింపుల్ స్టెప్స్ ని చూపిస్తున్నారు. చిరంజీవి ఎంత హుషారుగా ఎంత బాగా చేశాడో అని అనుకుంటున్నారు. పైగా చిరంజీవిగా ఎంకరేజ్మెంట్ లాక్కుని వచ్చి.. డాన్స్ చేయమని వదిలి రామ్ చరణ్ తండ్రితో స్టెప్పులు వేయించి.. అందరితో రచ్చ రచ్చ చేయించడం.. నిజంగా తండ్రి కొడుకుల అనుబంధం చూసినా కూడా ఎంతో ఆనందంగా ఉందని అభిమానులు పొంగిపోతున్నారు.