Allu Arjun: అవును.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే రచ్చ కొనసాగుతుంది. ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ పై మెగా (Mega fans serious) అభిమానులే కాకుండా నెటిజెన్లు తీవ్ర స్థాయిలో భగ్గుమంటున్నారు. అసలు విషయానికి వస్తే.. చిరంజీవి గారి అండ చూసుకొని మెగా కుటుంబం నుండి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. అయితే గత కొంతకాలంగా అల్లు అర్జున్ మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడనే వార్తలు మనకు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు మెగా హీరోగా, మెగా కుటుంబంలోని ఒకరుగా ఉన్న ఇమేజ్ ను పక్కన పెట్టేసి అల్లు హీరోగా తనను తానే ప్రచారం చేసుకుంటు.. మెగా హీరోలకు తనకు ఏం సంబంధం లేనట్టుగా ఉంటున్నాడు.
అప్పట్లో నీకు మీ నాన్న ఎక్కువ ఇష్టమా.. మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కువ ఇష్టమా.. అంటే చిరంజీవి గారని అర క్షణం ఆలోచించకుండా బదిలు ఇచ్చే అల్లు అర్జున్ ప్రస్తుతం మాత్రం నేను ఈ స్థాయిలోకి రావడానికి కారణం మాత్రం అల్లు రామలింగయ్య గారిని చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు. ఇలాంటి కారణాల దృశ్య మెగా కుటుంబంతో అల్లు అర్జున్ కి పడటం లేదనే విషయాలు ఇండస్ట్రీ వర్గాల్లో పరుగులు పెడుతున్నాయి. దానికి కారణం తీసిపోలేదు.. ఎందుకంటే ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 37వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చెర్రీ బర్త్ డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఎందరో ప్రముఖులు ఈ పుట్టినరోజు వేడుకకు వచ్చారు. కానీ అల్లు అర్జున్ మాత్రం రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకకు రాకపోగా.. కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా చరణ్ కు విషెస్ కూడా చెప్పలేదు. కానీ, ఆ తర్వాతి రోజు అల్లు అర్జున్ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన ఇరవై ఏళ్ల జర్నీ ఉద్దేశిస్తూ ఒక పోస్ట్ పెట్టాడు.. దీంతో ఇవన్నీ నీకు గుర్తుంటాయి.. కానీ, చరణ్ పుట్టిన రోజు నీకు గుర్తుకు లేదా అంటూ అల్లు అర్జున్ పై మెగా అభిమానులు ఫైర్ (Mega fans serious) అవుతున్నారు. అయితే ఇక్కడ మరొక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది..
అదేంటంటే.! అల్లు అర్జున్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి ఓ స్వీట్ ట్వీట్ చేశారు. నువ్వు అప్పుడే ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నువ్వు పాన్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్ నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను.. అంటూ చిరు పోస్ట్ చేశాడు. దీంతో సంస్కారం అంటే ఇది.. బన్నీ నువ్వు కూడా చూసి నేర్చుకో.. అంటూ అల్లు అర్జున్ పై నెటిజన్లు మండిపడ్డారు. రెండు మూడు సినిమాలు హిట్లు, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రాగానే నీ కళ్ళు నెత్తికెక్కినయా అంటూ బన్నీని ఎక్కిస్తున్నారు నెటిజన్స్..