Home Cinema Eagle Teaser Review : రవితేజ సినిమా ఈగల్ టీజర్ రివ్యూ..

Eagle Teaser Review : రవితేజ సినిమా ఈగల్ టీజర్ రివ్యూ..

mass-maharaj-raviteja-movie-eagle-teaser-review

Eagle Teaser Review: మాస్ మహారాజ్ రవితేజ సినిమా అంటే తెలుగు సినీ అభిమానులందరికీ ఎంతో ఉత్సాహంగా ఉంటాది. ఎందుకంటే.. రవితేజ వయసు పెరిగే కొద్దీ కూడా ఇంకా యాక్టివ్గా, ఇంకా అందరిని ఆకట్టుకునే విధంగా ( Eagle Teaser Review ) నటిస్తూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు ఒక కొత్త కోణంతో ప్రేక్షకులు ముందుకు వచ్చి పలకరిస్తూ ఉంటాడు. ఇటీవల రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరావు రిలీజ్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. దసరా సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా రవితేజ అభిమానులు ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ సినిమా ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు.

Ravi-teja-eagle

కానీ అనుకున్నట్టుగా హిట్ ని సాధించలేకపోయింది. ఇక జనవరి 13వ తేదీ పండగ కానుకగా రవితేజ ది మరో సినిమా ఎంటర్ అవుతుంది. అదే ఈగల్ రవితేజ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, కావ్య ధాపర్ హీరోయిన్స్ గా ఈ సినిమాలో ( Eagle Teaser Review ) నటిస్తున్నారు. ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో మధుబాల, నవదీప్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ కు కావలసిన అన్ని పనులను సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలో సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ ఎలా ఉందో తెలుసుకుందాం.

See also  Sai Pallavi: అలా చేసినా రేప్ తో సమానమేనని కొత్త నినాదంతో ముందుకొచ్చిన సాయి పల్లవి.. మరి దీనికి సపోర్ట్ చేసేదెవరు?

Ravi-teja-eagle-teaser-review

టీజర్ మొదలే విధ్వంసం కనిపిస్తుంది. ఎక్కడ ఉంటాడు అని అడిగితే అడవిలో ఉంటాడు నీడై ఉంటాడు కనిపించడు కానీ వ్యాపించి ఉంటాడు అని అనుపమ పరమేశ్వరునికి ఒక ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. రవితేజ కళ్ళను చూపిస్తారు. ఇది విధ్వంసం మాత్రమే, తర్వాత చూడబోయేది విశ్వరూపం అని నవదీప్ చెప్పిన డైలాగు ( Eagle Teaser Review ) రవితేజ గురించి అని తెలుస్తుంది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా రూపుదిద్దుకుంటుంది. ప్రజలకు కట్టు కథ, ప్రభుత్వాలు కప్పెట్టిన కథ అని డైలాగ్స్ వస్తాయి. అంటే రవితేజ ఫ్లాష్ బ్యాక్ లో ఏదో జరిగిన ఒక సంఘటన ప్రభుత్వాలు సైతం ఇన్వాల్వ్ అయ్యి, దాన్ని కప్పెట్టినట్టు అర్థమవుతుంది.

See also  Manchu Manoj: భూమా మౌనిక వీపుపై సీక్రెట్ టాటూ.. ఆగ్రహంతో మంచు మనోజ్.?

Ravi-teja-eagle-teaser-mass-maharaj

టీజర్ లో ఇక రవితేజ ఎంట్రన్స్ చూస్తే.. ఈ సినిమాలో ఇంతవరకు రవితేజ ఒక లెక్క ఇక్కడి నుంచి ఒక లెక్క అన్నట్టు ఉన్నాడు. రవితేజ హెయిర్ స్టైల్ గాని, ముఖం మీద ఒక ఘాటు, గన్స్ పట్టుకొని.. లుంగీ ఎత్తితి కట్టి ఫైట్ చేసే విధానం అంతా కూడా ఎక్సలెంట్ గా తీశారు. ఒక ఇంగ్లీష్ హీరో హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో అలా పెట్టి.. ఒక అచ్చ తెలుగు నాటు మాస్ మహారాజు లుంగీ ఎలా కడతాడో చూపించి.. రెండిటిని మిక్స్ చేసి రవితేజ క్యారెక్టర్ లో చూపించి.. అదరగొడుతున్నారని విషయం అర్థమవుతుంది. ఈ సినిమా టీజర్ చూస్తే కచ్చితంగా రవితేజని ఎలా చూస్తే ఆయన అభిమానులు ఇష్టపడతారో అంతకంటే సూపర్ గా చూపించే విధంగా దర్శకుడు తీశాడు అని తెలుస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని పండగల్లో మంచి సూపర్ హిట్ సినిమాగా కలెక్షన్స్ అదరగొడుతుందని టీజర్ చూస్తే అందరూ అనుకుంటున్నారు.