Home Cinema Prabhas – Raviteja : రవితేజ మిస్ చేసుకున్న ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ ఏమిటో...

Prabhas – Raviteja : రవితేజ మిస్ చేసుకున్న ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ ఏమిటో తెలిస్తే అయ్యయ్యో అంటారు..

Prabhas – Raviteja : ఏ సినిమా ఎవరికి ఎలాంటి ప్రాప్తాన్ని కలిగిస్తుందో, ఎప్పుడూ చెప్పలేం. కొన్ని సినిమాలు కథ వినగానే అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనిపిస్తుంది. కానీ డిజాస్టర్ గా మిగులుతాయి. కొన్ని సినిమాల కథలు ( Prabhas and Raviteja blockbuster movie ) వినగానే నో అనుకుంటే అది బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయా అవకాశం ఉంది. ఏది ఏమైనా ఆ సమయాన్ని బట్టి, ప్రేక్షకుడి ఇష్టాన్ని బట్టి, సినిమా వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఆధారపడి ఉంటుంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఒక సినిమాని రవితేజ మిస్ చేసుకున్నాడంట. ఇంతకీ అది ఏ సినిమా అనేది తెలుసుకుందాం.

See also  Mahesh Babu: మీకు ఎవ్వరికీ తెలియని మహేష్ బాబు దర్శకత్వం వహించిన అయన బ్లాక్ బస్టర్ చిత్రం ఎదో తెలుసా.?

Prabhas-movie-Raviteja

ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మిర్చి. ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాని 2013లో ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చి ( Prabhas and Raviteja blockbuster movie ) సూపర్ హిట్ చేశాడు కొరటాల శివ. కొరటాల శివ దర్శకుడుగా సినిమా రంగానికి పరిచయమైన తొలి సినిమా ఇదే. తొలి సినిమాతోనే కొరటాల శివ భారీ సక్సెస్ ని సాధించాడు . ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా రిచా గంగోపాధ్యాయ నటించిగా.. ఇక ప్రభాస్ – అనుష్కల జంటకి ఈ సినిమాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది.

Prabhas-movie-Raviteja-missed-movie

అయితే రవితేజ హీరోగా నటించిన భద్రా సినిమాకి కొరటాల శివ మాటలు అందించాడు. భద్ర సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భద్ర సినిమాలో మాటలు అందించేటప్పుడు రవితేజ తో కలిగిన పరిచయం వలన, కొరటాల శివ ( Prabhas and Raviteja blockbuster movie ) రవితేజ దగ్గరికి మిర్చి కథని తీసుకుని వెళ్ళాడంట. మిర్చి కథ వినిపించిన తర్వాత రవితేజ కథని రిజెక్ట్ చేశాడంట. రవితేజ చేయడు అని తెలిసిన తర్వాత ఆ కథను పట్టుకొని ప్రభాస్ దగ్గరికి వెళ్ళాడంట కొరటాల శివ. ప్రభాస్ కి ఆ సినిమా చాలా నచ్చిందట కానీ.. ఒక చిన్న సమస్య వలన కథ చాలా బాగా నచ్చింది కానీ సినిమా ఎలా చేయాలో అర్థం కావడం లేదు అని అన్నాడంట.

See also  లేటెస్ట్ హట్ అందాలతో మురిపిస్తున్న మృణాల్ ఠాకూర్.

Prabhas-movie-Raviteja-blockbuster

 

ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. అప్పటికే ప్రభాస్ బాహుబలి సినిమా రాజమౌళితో అగ్రి అయిపోయాడు. దానికి ఇప్పుడు మిర్చి చేయడానికి రాజమౌళి తో మాట్లాడాలి అని రాజమౌళిని రిక్వెస్ట్ చేసుకోగా.. రాజమౌళి ఒప్పుకున్నాడట. దానితో ఆరు నెలల్లో మిర్చి సినిమాని పూర్తి చేసేసాడు కొరటాల శివ. ఆరు నెలల్లో ఆ సినిమాను పూర్తి చేసి మిర్చి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా సినిమా ఇండస్ట్రీకి ఇచ్చాడు కొరటాల శివ. బాహుబలి సినిమా ముందు ప్రభాస్ కి ఈ సినిమా చాలా పెద్ద బూస్టప్ అయ్యింది. అలా మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని మాస్ మహారాజు రవితేజ మిస్ చేసుకున్నాడని నెటిజనులు అంటున్నారు.