
Manchu Lakshmi : మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి హీరోయిన్ స్థాయిలో కాకపోయినా తనకంటూ సినిమా రంగంలో అభిమానుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకొని.. మంచి మంచి పాత్రలు చేస్తూ అందరి ( Manchu Lakshmi lost money ) మనసుల్లో స్థానం సంపాదించుకుంది. మంచు లక్ష్మి తొలి చిత్రంలో విలన్ గా నటించి.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి అక్కడ నుంచి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో చేస్తూ వచ్చింది. ఆమె నటించిన ఏ సినిమాలోనైనా ఆమె పాత్రకి ఆమె చక్కగా న్యాయం చేస్తుంది. సినిమా అవకాశాలు వచ్చినప్పుడు వదులుకోకుండా వాటిని చేసుకుంటూ.. టీవీ టాక్ షోస్ లో తనకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంది.
మామూలుగానే మోహన్ బాబు మంచి వాక్ చాతుర్యం ఉన్నవాడిని మనందరికీ తెలుసు. ఆయన కూతురు కూడా చక్కని మాటకారగా నిరూపించుకుంది. మంచు లక్ష్మి మాటలతో ఎలాంటి ప్రోగ్రాం నైనా చక్కగా ముందుకు తీసుకెళ్లగలదు. అందుకే టాక్ షోస్ లో ఆమెకు మంచి ప్రాధాన్యత వచ్చింది. టాక్ షోస్ లో ఆమె ( Manchu Lakshmi lost money ) పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని కూర్చోబెట్టి చాలా చక్కగా మాట్లాడుతూ.. వాళ్ళని ప్రశ్నిస్తూ ప్రేక్షకులకు ఎంతో ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చింది. అయితే మంచు లక్ష్మి ని అనుష్క చాలా నష్టపరిచిందని.. అనుష్క వలన మంచు లక్ష్మి మూడు కోట్ల వరకు డబ్బును నష్టపోయిందని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాక్ షోస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలని, లేదంటే నష్టాలను చవిచూడాల్సివస్తాదని చెప్పింది. ఒకసారి అనుష్క శెట్టి ని తన టాక్ షో ప్రోగ్రాం కి రమ్మని పిలిస్తే.. ఆమె మొదట వస్తానని చెప్పింది. దాని వలన మేము అన్ని సిద్ధం చేసుకుని ఉండగా ఆమె ( Manchu Lakshmi lost money ) భాగమతి షూటింగ్ పడటం వలన అనుకోకుండా రాలేకపోతున్నానని రాలేదు. దానివల్ల అప్పటికే ప్రోగ్రామ్ కోసం మూడు కోట్ల వరకు ఖర్చు చేసాం. ఆమె రాకపోవడంతో ఆ డబ్బు నష్టపోయాం అని చెప్పింది.ఏది ఏమైనా అనుష్క వలన మంచు లక్ష్మి మూడు కోట్లు నష్టపోవడం అంటే బాధాకరమనే చెప్పుకోవాలి.
అయితే ఇలాంటివి ఏ రంగంలోనైనా జరగక తప్పదు. సినిమా వాళ్ళు, రాజకీయవేత్తలు, సెలబ్రిటీస్ ఎప్పుడు ఎలా బిజీ అవుతారో ఎప్పుడు దేనికి వెళ్ళగలరో, ఏం జరుగుతాదో అనే విషయాన్ని ఎవరు గెస్ చేయలేరు. మంచు లక్ష్మి సినిమాలు, టాక్ షోస్ మాత్రమే కాకుండా.. కుకింగ్ ప్రోగ్రామ్స్ లో కూడా హోస్ట్ గా చేస్తుంది. అటు కెరియర్ పరంగా బిజీగా ఉంటూ కూడా.. పర్సనల్ లైఫ్ లో కూడా అందరితో అనుబంధాలను ఉంచుకుంటూ.. తన బాధ్యతలను తాను నిర్వర్తించుకుంటుంది. ఇటీవల మంచు మనోజ్ పెళ్లి పనులు అన్ని స్వయంగా మంచులక్ష్మీ చూసుకోవడమే కాకుండా పెళ్లి తన ఇంట్లోనే చేసిన విషయం మనందరికీ తెలిసినదే. మంచు లక్ష్మి ప్రస్తుతం తన కెరియర్ తానూ చాలా బిజీగా ఉంటుంది.