Mahesh Babu – Rana : సూపర్ స్టార్ మహేష్ బాబు వలన రానా దగ్గుబాటి వందల కోట్లు నష్టపోయాడంటూ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మహేష్ బాబు వలన నష్టపోవడం ఏంటని వార్త వైరల్ గా మారింది. అసలు వీళ్ళిద్దరూ కలిసి ఏమైనా వ్యాపారం చేశారా లేదా మహేష్ బాబు నమ్మి రానా ( Mahesh Babu and Rana ) ఏమైనా ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చాడా లేదా ఇంకేమైనా వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా సినిమా కొందామనుకున్నారా ఇలా ఎన్నో ఎన్నెన్నో అనుమానాలు ఊహాగానాలు సోషల్ మీడియాలో ఒకరితో పాటు ఇంకొకరు ప్రశ్నిస్తూ.. సమాధానాలు చెప్తూ ఇలా ఎంతో ఆసక్తిగా కరంగా ఈ వార్తపై వివరాల కోసం వెతుకులాడుతున్నారు.
అయితే అసలు సంగతి ఏమిటంటే.. మహేష్ బాబు చేసిన ఒక పని వలన రానా వందల కోట్లు నష్టపోయాడంట. మురుగదాస్ దర్శకత్వంలో గజినీ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సూర్య హీరోగా ( Mahesh Babu and Rana ) నటించిన ఈ సినిమా ఇన్నేళ్లయినా కూడా ఇంకా మరువలేని సినిమా అది. గజనీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత అదే సినిమాని హిందీలో అమీర్ ఖాన్ కూడా చేయడం జరిగింది. హిందీలో కూడా ఈ సినిమా విపరీతమైన ఆదరణ పొందడం పొందింది కానీ.. ఇది రీమేక్ కాబట్టి.. మొదట సూర్య సినిమా కి ఆ పేరు,క్రేజ్ ఇంకా పెరిగింది. అయితే ఈ సినిమాకి సూర్యని మొదట హీరోగా అనుకోలేదట.
ఈ సినిమా కథను తీసుకొని వచ్చి మురుగదాస్ ప్రొడ్యూసర్ సురేష్ బాబుని మొదట కలిశారట. అతని కథ మొత్తం విని కథ చాలా బాగుంది కానీ తెలుగు హీరోలు ఎవరూ దీన్ని నటించరు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు వాళ్ళ హీరోని ఇలా ఆదరించరు. అందుకని కష్టమని సురేష్ బాబు చెప్పాడంట. పైగా రానా అని పెట్టి సినిమా తీద్దామంటే ( Mahesh Babu and Rana ) అప్పటికి రానా ఇంకా సినిమాల్లో ఎంటర్ కాలేదంట. కొత్త హీరోతో ఈ కాన్సెప్ట్ వర్కౌట్ కాదని.. అందుకని సురేష్ బాబు నో చెప్పాడంట. అప్పుడు ఈ కథ విన్న రానా ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే బాగా నప్పుతాడని.. అతను ఇప్పటికే కొన్ని సినిమాలు నిజం, నాని ఇలాంటి సినిమాలు ప్రయోగాత్మకంగా చేసే మెంటాలిటీ ఉన్న మనిషిని.. ఈ కథకి చాలా బాగా సూట్ అవుతాడని రానా మురుగుదాస్ కి చెప్పాడంట.
రానా చెప్పిన మాటలు విని మురుగదాస్ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళీ గజనీ కథ మొత్తం చెప్పాడంట. మహేష్ బాబుకి కథ అయితే చాలా నచ్చిందట గాని.. ఇలాంటి కథతో తెలుగు హీరోలని, తెలుగు ప్రేక్షకులని ఆదరించాలని.. అందుకని ఈ కథకి తాను చేయడం కష్టమని సింపుల్ గా నో చెప్పేసాడంట. ఆ తర్వాత మురుగదాసు సూర్య ని పట్టుకొని సూర్య అయితే ఇటు తెలుగులో కూడా ఫేమస్ కాబట్టి.. సినిమా తీయడం జరిగిందంట. ఆ తర్వాత ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయింది అనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగులో బిజినెస్ ఇమ్మని రానా అడిగితే.. మహేష్ బాబు నో అని అన్నాడన్న కారణంగా.. వీళ్ళు ఎవరికీ ఇవ్వకుండా ఆ సినిమాని అల్లు అరవింద్ కి ఇవ్వడం జరిగింది అంట. ఆయన కనీసం వంద కోట్లు పైగా ఈ సినిమాపై లాభం సంపాదించుకున్నాడని.. మహేష్ బాబు వలన రానా ఇన్ని కోట్లు నష్టపోయాడని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.