Home Cinema Mahesh – NTR : మహేష్ కు బాగా నచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏమిటో...

Mahesh – NTR : మహేష్ కు బాగా నచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏమిటో తెలుసా?

mahesh-babu-likes-aadi-movie-out-of-all-the-movies-done-by-junior-ntr

Mahesh – NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న ప్రాముఖ్యత గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. నందమూరి వంశానికి వారసుడుగా వచ్చి తనదైన శైలిలో తాను కష్టపడి.. తనకంటూ ఒక ( Mahesh Babu and NTR ) ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తో నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా సినిమా రంగంలో హీరోలు కూడా ఎందరో ఆయనతో చాలా సన్నిహితంగా ముడిపడి ఉంటారు. దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ మనస్తత్వమే. ఎప్పుడు నవ్వుతూ అందరికీ మర్యాద ఇస్తూ మన్నన పొందుతూ ఉంటారు.

Mahesh-babu-jr-ntr-movies-likes

అలాగే జూనియర్, ఎన్టీఆర్ మహేష్ బాబు మధ్య మంచి రిలేషన్ ఉంది. వీళ్లిద్దరూ పోటీపడే హీరోల్లా కాకుండా ఒకరికొకరు అన్నదమ్ముల్లా ఎంతో చక్కగా ఉంటారు. ఇద్దరు ఒకరితో ఒకరు చక్కగా చిరునవ్వుతో పలకరించుకుంటూ ఆప్యాయంగా ( Mahesh Babu and NTR ) మాట్లాడుకుంటారు.ఏ ఈవెంట్లో ఎక్కడ కలిసినా కూడా.. వీళ్ళ బంధం చాలా చక్కగా కనిపిస్తుంది.మహేష్ బాబు కి జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఒక సినిమా అంటే చాలా ఇష్టం అంట. సాధారణంగా ప్రతి హీరోకి వాళ్ళ ఫ్యాన్స్ గుండెల్లో ఒక ఇష్టమైన సినిమా అంటూ ఉండిపోతుంది. వాళ్ళ హీరో ఏ సినిమా నటించినా వాళ్లకు ఇష్టంగానే ఉంటుంది కానీ.. ఏదో ఒక సినిమా మాత్రం చాలా గట్టిగా నాటుకుపోతుంది.

See also  Naga Chaitanya: చైతు మామూలోడు కాదుగా.. ఇంత మందితో ఎఫైర్ పెట్టుకున్నడా.? పెద్ద లిస్తే ఉందిగా..

Mahesh-babu-jr-ntr-movies-out-of-all

అలాగే మహేష్ బాబుకి కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఒక సినిమా అంటే చాలా ఇష్టమంట. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని తప్పితే.. మరి ఏ హీరో చేసినా కూడా అంత బాగా రాదని అన్నాడు. ఇంతకీ అది ఏం సినిమా అంటే.. ఆది.. వీ. వి వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఫ్యాక్షన్ తెలుగు సినిమాగా రూపొందిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఊహించని తారాస్థాయికి ఈ సినిమా చేరుకుంది. అందుకే ( Mahesh Babu and NTR ) ఈ సినిమా అంటే మహేష్ బాబుకి చాలా ఇష్టమంట. ఈ సినిమాలో ఆ పాత్రను జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే బాగుంటాడని ఇంకా ఏ హీరో చేస్తే ఎలా ఉంటుందని ఊహించను కూడా ఊహించలేనని మహేష్ బాబు చెప్పాడు. ఇంతకీ మహేష్ బాబు ఈ మాట ఎప్పుడు చెప్పాడో తెలుసుకుందాం..

See also  Andrea Jeremiah: ప్రేమలో రెండుసార్లు ఆ ఇద్దరితో మోసపోయ్యా.. నటి ఆండ్రియా కామెంట్స్ వైరల్

Mahesh-babu-jr-ntr-movies-likes-Aadi

జూనియర్ ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరికి ప్రోగ్రాం కి హోస్ట్ గా ఉండేవాడు. ఆ ప్రోగ్రాం కి మహేష్ బాబు కూడా వెళ్లడం జరిగింది. వీళ్ళిద్దరూ ఆ ప్రోగ్రాం లో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్.. మహేష్ బాబుని ప్రశ్న అడిగే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో మహేష్ బాబుకి ఇష్టమైన సినిమా ఏది అని అడగడం జరిగింది. అప్పుడు మహేష్ బాబు తనకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఆది సినిమా అంటే చాలా ఇష్టమని.. ఆ సినిమాలో మిమ్మల్ని తప్పితే ఇంకెవరిని ఊహించుకొని కూడా లేనని చెప్పడం జరిగింది. మహేష్ బాబు అప్పుడు చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దీన్ని నెమరు వేసుకుంటున్నారు.