Mahesh – Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ పై పై స్థాయిలో కొందరు హీరోలు ముందంజలో ఉన్నారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నారు. మహేష్ బాబుకి, రామ్ చరణ్ కి ( Mahesh Babu and Ram Charan ) అభిమానులు ఎంతగా ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్లకి గట్టిగానే ఉంది. ఆ హీరో సినిమా హిట్ అవ్వాలని వాళ్ళ ఫాన్స్ విపరీతంగా కోరుకుంటారు. అయితే సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు.. ముఖ్యమైన పండుగ రోజుల్లో, సెలవలు టైంలో ఒకేసారి రిలీజ్ అయితే.. వాళ్ళిద్దరి మధ్యన పోటీ అనేది నిలబడుతుంది. బయట వీళ్లంతా ఫ్రెండ్స్ లా ఉంటారు కానీ.. సినిమా పరంగా ఎదో ఒక ఇద్దరి మధ్య పోటీ నడవక తప్పదు.
అలా మహేష్ బాబు, రామ్ చరణ్ పోటీపడ్డ సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. 2013 వ సంవత్సరంలో సంక్రాంతి పండుగకి మహేష్ బాబు, రామ్ చరణ్ పోటీపడ్డారు. మహేష్ బాబు సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ అయింది. ఈ సినిమాలో ( Mahesh Babu and Ram Charan ) మహేష్ బాబు వెంకటేష్ నటించగా.. రామ్ చరణ్ సినిమా నాయక్ కూడా అదే టైంలో రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు ఆ పండక్కి పోటీ పడగా.. రామ్ చరణ్ సినిమా నాయక్ పెద్ద హిట్టుగా నిలిచింది. గోదావరి జిల్లాలో మాత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు భారీ స్థాయిలో కలెక్షన్ రాబట్టింది. 2014లో మళ్లీ రామ్ చరణ్ , మహేష్ బాబు మధ్య పోటీ వచ్చింది.
రామ్ చరణ్ సినిమా ఎవడు రిలీజ్ అయింది. మహేష్ బాబు సినిమా నేనొక్కడినే అనే సినిమా రిలీజ్ అయింది. ఈ రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడగా.. ఎవడు సినిమాకే కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి. మళ్లీ రామ్ చరణ్ ఆ కాంపిటీషన్లో గెలిచాడు. ఆ తర్వాత అదే ఏడాది మళ్లీ.. గోవిందుడు అందరివాడే రామ్ చరణ్ సినిమా రాగా.. మహేష్ బాబుది ( Mahesh Babu and Ram Charan ) ఆగడు సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాల్లో రామ్ చరణ్ సినిమా గోవిందుడు అందరివాడే హిట్ అయింది. అక్కడ కూడా రామ్ చరణ్ గెలిచాడు. అలాగే భరత్ అనే నేను మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే రంగస్థలం సినిమా 20 రోజులు తరవాత రాంచరణ్ సినిమా విడుదల అయింది. అయితే ఈ రెండు సినిమాలు భారీగానే విజయాన్ని అందుకున్నాయి.
ఇలా ఎన్నిసార్లు పోటీ పడితే అందులో ఎక్కువ సార్లు గెలిచింది రామ్ చరణ్ మాత్రమే. సోషల్ మీడియాలో ఇప్పుడు వీళ్ళిద్దరి పోటీలో వచ్చిన సినిమాల్లో ఎవరు గెలిచారు అనేదానిపై ఇలా చర్చించుకుంటున్నారు. ఇకపోతే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందు రావడానికి శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉన్నాడనే సంగతి మన అందరికి తెలిసిందే. అలాగే రాంచరణ్ నెక్స్ట్ సినిమా గేమ్ చేజర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఈ రెండు సినిమాలు పై కూడా ఇద్దరు అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. మరి చూడాలి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతాది, ఎలా సక్సెస్ అందుకుంటాది అనేది చూడాలి.