Mahesh Babu : వివాదాలకు అత్యంత దూరంగా ఉంటూ.. తన అభిమానుల అభిమానాన్నే కాకుండా సినీ అభిమానుల అభిమానాన్ని కలిగిని హీరో మన సూపర్ స్టార్ మహేష్ బాబు. తాను ఎంచుకునే సినిమాలు కూడా దేనికి అదే డిఫరెంట్ గా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ లో అతితక్కువ మందికి ఉన్న మంచి పేరు ఏంటంటే సహజంగా ( Mahesh Babu also like other heroes ) హీరో చేయాల్సిన పని సెట్లోకి వచ్చాక డైరెక్టర్ ఏంచెబితే అది చేసుకుని పోవడం, తన స్టార్ డమ్ ని దృష్టిలో పెట్టుకుని .. డైరెక్టర్ కి పెద్ద అనుభవం లేదనే కారణంగానో.. లేక మాకు అన్నీ అందరికంటే బాగా తెలుసు అనే ఇగో ఫీలింగ్స్ తోనో చాల మంది పెద్ద హీరోలు చేసే పనేంటంటే..
నటించడం మానేసి సినిమాని డైరెక్ట్ చేస్తారు. సినిమాని పెంట పెంట చేసి పెడతారు. కానీ మన మహేష్ బాబు ఒకసారి సినిమా ఒప్పుకున్న తరువాత డైరెక్టర్ ఏంచెబితే అది చేసుకుని పోతాడు అంట. అనేక సినిమాల్లో చాల మంది పెద్ద ( Mahesh Babu also like other heroes ) హీరోలు తమ సినిమాల్లో తాము ఒక పాట పాడటం , అభిమానులని ఉర్రూతలూ ఊగించడం ఆనవాయితీగా వస్తోంది. మహేష్ బాబు ని కూడా అనేక మంది డైరెక్టర్స్ తమ సినిమాల్లో పాడమని అనేకసార్లు ఒత్తిడి తెచ్చిన కూడా ఏనాడు మహేష్ బాబు టెంప్ట్ అవకుండా , నేను అందుకు సూట్ కాను అని సున్నితంగా తిరస్కరించే వాడు అంట.
అయితే ఒక డిఫరెంట్ కాన్స్పెట్ , డిఫరెంట్ ట్రీట్మెంట్ తో వచ్చిన బిజినెస్ మేన్(Business Man ) లో డైనమిక్ డైరెక్టర్ పూరి ఈ సినిమాలో నువ్వు తప్పక పాడావల్సిందే అని పట్టుబట్టడంతో చాల ట్రై చేశాడు అంట! Aamchi Mumbai apna adda సాంగ్ పాడమని , ఆ సినిమాలో సందర్భాను సారం వచ్చే సాంగ్ కావడం హీరోని ఒక రేంజిలో ( Mahesh Babu also like other heroes ) ఎలివేట్ చేసేందుకు వచ్చే సాంగ్ కాబట్టీ ప్రిన్స్ మహేష్ బాబు స్వయంగా పాడితే ఇంకా బాగా వర్క్ అవుట్ అవుతుందని పూరి భావించాడు అంట. మిగతా యూనిట్ సభ్యులు అందరూ అవును సార్ మీరు ఈపాట సినిమాకే హైలెట్ అవుతుంది పాడమని ఒత్తిడి తేవడంతో.. రికార్డింగ్ థియేటర్ లోకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పూరి తో కలసి అడుగుపెట్టిన మహేష్ బాబు ఆపాట పాడటానికి చాలా ట్రై చేశాడు అంట.
తెలుసు కదా! మహేష్ బాబు కి ఎంత సిగ్గో.. మొత్తానికి అదే కారణంతో పాట పడటం విరమించుకున్నాడు అంట! అయితే పాట మధ్యలో పాటలో కలసిపోయేటట్టు కొన్ని డైలాగ్స్ మాత్రం పూరి పట్టుబట్టి చెప్పించుకున్నాడు అంట. ఏదేమైనా ప్రిన్స్ మహేష్ బాబు కెరియర్లో బిజినెస్ మేన్ ఒక సూపర్ డూపర్ సినిమా అనే చెప్పుకోవాలి. ఈ మధ్య రీ రిలీజ్ చేయడంతో కనీ వినని ఎరుగని కలక్షన్ల సునామీ సృష్టించింది. అయితే మహేష్ బాబు అభిమానులు కాలర్ ఎగరేసే పని ఈ సినిమా నిర్మాత చేయడం ఇంకొ ఎత్తు. సినిమా కలక్షన్లలో థియేటర్ ఖర్చులు మినహాయించి మిగతా మొత్తం మహేష్ బాబు చిన్న పిల్లల గుండె ఆపరేషన్ సహాయ నిధికి పూర్తిగా విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే కొన్ని వేల మంది చిన్న పిల్లలకి ప్రాణ దానం చేసిన మహేష్ బాబు రియల్ లైఫ్ లో రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.