Home Cinema Mahesh – Namrata: మహేష్ మాటకు ఎదురు తిరిగుతున్న నమ్రత.. బంగారం లాంటి జంట ఇలాంటి...

Mahesh – Namrata: మహేష్ మాటకు ఎదురు తిరిగుతున్న నమ్రత.. బంగారం లాంటి జంట ఇలాంటి నిర్ణయం ఎవరికోసం?

Mahesh – Namrata: మహేష్ నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసినదే. వీళ్లిద్దరూ కలసి సినిమా చేస్తుండగా మంచి స్నేహం ఏర్పడిందంట. ఆ తరవాత ఒకరినొకరు ఇష్టపడటం, ప్రేమించుకోవడం జరిగింది. నమ్రత మహేష్ కంటే వయసులో కొంచెం పెద్దదే అయినా వీళ్లిద్దరి జంట ( Mahesh and Namrata take a big decision ) చాలా బాగుంటాది. మొదట వీళ్ళ పెళ్లికి మహేష్ బాబు కుటుంబం ఒప్పుకోలేదు. తరువాత వాళ్ళను నిమ్మదిగా ఒప్పించి, పెళ్లి కూడా చాలా సింపుల్ గా మహేష్ బాబు చేసుకున్నాడు. పెద్దవాళ్లకు ఇష్టం లేకపోయినా కూడా వీళ్ళిద్దరూ ఒకే మాట మీద నిలబడి, మొత్తానికి సాధించుకున్నారు. ప్రేమంటే సినిమాల్లో నటించేది కాదు, నిజ జీవతంలో జీవించేది, సాధించుకునేది అని నిరూపించిన జంట మహేష్ బాబు మరియు నమ్రత.

mahesh-and-namrata-take-a-big-decision

ఇప్పుడు ఈ జంట గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే.. మహేష్ బాబు, నమ్రత ఇద్దరు పెళ్ళికి ముందు మంచి స్టార్స్.. మహేష్ బాబు పెళ్లి తరవాత ఇంకా సూపర్ స్టార్ అయ్యాడు కానీ, నమ్రత మాత్రం పెళ్లి తరవాత సినిమాల్లో నటించడం పూర్తిగా వదిలేసింది. దానికి కారణం లేకపోలేదు, మహేష్ బాబు పెళ్ళికి ముందే నమ్రత ని పెళ్లి తరవాత ఇంక సినిమాల్లో నటించవద్దని చెప్పాడంట. దానికి నమ్రత కూడా ఒప్పుకుందట. అలాగే వారి జీవితం అక్కడ నుంచి ఆనందానికి అవదులు లేకుండా ఇద్దరు పిల్లల్ని కనీ.. వాళ్ళతో జీవితం చాలా హ్యాపీ గా గడుపుతున్నారు. మహేష్ బాబు ఎంత సూపర్ స్టార్ అయినప్పటికీ, ఇంటిని వాళ్ళ బిజినెస్ ని అన్నిటినీ నమ్రతానే చక్కదిద్దుకుంటాదంట.

See also  Varun Tej : లావణ్య కంటే ముందే వరుణ్ తేజ్ ఆ హీరోయిన్ లో అది నచ్చి లవ్ లో పడ్డాడంట!

mahesh-and-namrata-take-a-big-decision

నమ్రత లాంటి బాధ్యత కలిగిన భార్య దొరకడం నిజంగా మహేష్ బాబు అదృష్టమే ( Mahesh and Namrata take a big decision ) అనుకోవాలి. అలాగే ఇప్పటి జనరేషన్ కి వీళ్ళు ఆదర్శమని చెప్పాలి. ప్రేంమించుకోవడం, పెళ్లి చేసుకోవడం అతి తొందరగానే విడిపోవడం ఇప్పుడు చాలా వరకు జంటలు చేస్తున్న పని. కానీ మహేష్ నమ్రత మాత్రం ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండటమే కాకుండా, కుటుంబానికి మంచి పేరు తెచ్చే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి కారణం వీళ్ళిద్దరూ ఒకరి మాటకు ఒకరు గౌరవం ఇచ్చుకునే జంట. అలాంటిది ఇప్పుడు నమ్రత మహేష్ బాబుకి ఇచ్చిన మాట తప్పుతుందంట. పెళ్లి తరవాత సినిమాలలో నటించను అని చెప్పిన నమ్రత, ఇప్పుడు మహేష్ రాజమౌళి తో చేస్తున్న సినిమాలో రెండు నిముషాలు పాటు ఒక కీలకమైన పాత్రలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.

See also  90's Web Series: అన్న చెల్లెళ్ళు గా నటించిన వీళ్ళు లవ్ లో పడ్డారు ఏంట్రా.? ఇదెక్కడి దరిద్రం అంటున్న నెటిజన్స్..

mahesh-and-namrata-take-a-big-decision

ఇన్నేళ్లు మహేష్ కు ఇచ్చిన మాటకు నిలబడిన నమ్రత మహేష్ అభిమానులు ఎప్పటి నుంచొ నమ్రతని స్క్రీన్ పై చూడాలని కోరుతుండగా .. వారి కోరిక తీర్చడం కోసం అంటే మహేష్ ఫాన్స్ కోసం ఒప్పుకుందట. అలాగే రాజమౌళితో మహేష్ సినిమా అంటే.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు తరవాత అది వరల్డ్ వైడ్ మూవీ అవుతాదని అందరి అంచనా. అలాంటి ప్రాజెక్ట్ లో ఎక్కడో ఒక చోట తన అర్ధాంగి ఉండటం తనకి ఆనందమని మహేష్ కూడా ఈ నిర్ణయానికి ఒకే అన్నాడంట. బంగారం లాంటి ఈ జంట ఒకరి కోసం ఒకరు వారి నిర్ణయాన్ని అధికమించారు గాని, స్వార్ధం కోసం కాదని నెటిజనులు కామెంట్ చేసుకుంటున్నారు. అసలు ఈ వార్తలో ఎంత నిజం ఉందొ ఆ సినిమా రిలీజ్ అయ్యాక నమ్రత అందులో కనిపిస్తే అర్ధమవుతాది.