Mahesh – Namrata : తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్ని ఎంతో మందిని చూశాం. అందులో కొందరు సక్సెస్ అయితే.. కొందరు ఫెయిలవుతుంటారు. సక్సెస్ అయ్యి వాళ్ళ కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకెళుతున్న మంచి జంటల్లో మహేష్ బాబు, నమ్రత ఒక జంట. మహేష్ బాబు, నమ్రత ప్రేమించి ( Mahesh and Namrata planning for Sitara ) పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. నమ్రత మహేష్ బాబుని ప్రేమించేటప్పటికీ.. ఆమె కూడా స్టార్ హీరోయిన్. అయినా కూడా పెళ్లయిన తర్వాత ఆమె సినిమాల్ని వదిలేసింది. మొదట వీళ్ళిద్దరి పెళ్ళికి వాళ్ళ కుటుంబాలు ఒప్పుకోలేదు. అయినా కూడా వాళ్ళ ప్రేమను వదులుకోకుండా పెద్దలను నెమ్మదిగా ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు.
మహేష్ బాబు, నమ్రతల పెళ్లి చాలా సింపుల్గా జరిగింది. కానీ వాళ్ళ జీవితం మాత్రం చాలా సాఫీగా వెళుతుంది. వీళ్లిద్దరికీ బంగారం లాంటి బాబు, పాప పుట్టారు. మహేష్ బాబు కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని నమ్రతయే స్వయంగా చూసుకుంటుందని టాక్. అయితే మహేష్ బాబు కేవలం కష్టపడి సంపాదించడం.. ఆ సంపాదించిన ( Mahesh and Namrata planning for Sitara ) తీసుకెళ్లి నమ్రత చేతిలో పెట్టడమే అని అందరూ అంటారు. దాన్ని నమ్రత చాలా ప్లాన్డ్ గా ఎవరికి ఏం ఇవ్వాలి. దేని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి.. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి.. పిల్లల్ని ఎలా చూసుకోవాలి.. మహేష్ కుటుంబాన్ని ఎంతవరకు చూడాలి.. అన్నీ కూడా ఆమె చూసుకుని వస్తుందని అంటారు. నిజంగా ఆమె ఎంత బాగా చూసుకుంటుందంటే.. మహేష్ బాబు ఇంకా ఇంత యంగ్ గా ఉండడానికి కారణం.. ఎలాంటి మెంటల్ ప్రేజర్స్ లేకుండా భార్య చూసుకోవడం వలనే అనిపిస్తుంది.
రీసెంట్గా మహేష్ బాబు కూతురు ఒక జ్యువెలరీ యాడ్లో నటించి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆమె యాడ్ రావడం మహేష్ బాబు ఎంతో ఆనందంగా ట్విట్టర్లో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ యాడ్లో సితార కోటి రూపాయలు సంపాదించిందని అంటున్నారు. నిజంగా 10 ఏళ్ల వయసులో కోటి రూపాయలు రెమ్యునిరేషన్ ( Mahesh and Namrata planning for Sitara ) తీసుకోవడం అంటే మహేష్ బాబు వంశంలో ఎవ్వరూ కూడా ఆ ఏజ్ లో అంత రెమ్యూనరేషన్ తీసుకోని ఉండరు. అలాంటిది తన కూతురు సాధించిన విజయానికి మహేష్ బాబు చాలా సంతోషించాడు. కానీ ఈ విజయాలన్నీటికి మూలకారకరాలు నమ్రతానే. ఎప్పుడైతే సితార యాడ్లో నటించి కోటి రూపాయలు సంపాదించిందని అన్నారో.. అప్పటినుంచి అభిమానులు అందరూ సితార కూడా హీరోయిన్ అవుతుందని అనుకుంటున్నారు.
అయితే ఇప్పుడు మరో వార్త హల్చల్ చేస్తుంది. సితారని టాలీవుడ్ హీరోయిన్ ని చేయాలని అనుకోవడం లేదంట. నమ్రత పక్కా ప్లాన్ గా సితారను జాగ్రత్తగా ట్రైనింగ్ ఇప్పించి.. మిస్ ఇండియా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కి పంపాలని అనుకుంటుందంట. అలా ముందు తన కూతుర్ని మిస్ ఇండియా, మిస్ వరల్డ్ లెవల్ కి తీసుకువెళ్లి.. ఆ తర్వాత హాలీవుడ్ లెవెల్ లో కూతుర్ని సెటిల్ చేయాలనుకుంటుందంట. ఈ లెక్కన చూస్తే ఇక మహేష్ బాబు పిల్లలు ఎదిగేసరికి హాలీవుడ్ దగ్గరికి వెళ్లిపోయి తన చివరి దశ అక్కడే వాళ్లతోనే ఎంజాయ్ చేస్తూ ఉండిపోతాడేమో.. ఇక టాలీవుడ్ కి దూరం అవుతాడేమో అని అభిమానులు అనుకుంటున్నారు. ఏదేమైనా నిజంగా నమ్రతకి హ్యాట్సాఫ్ చెప్పచ్చు.. పిల్లల భవిష్యత్తును ఎంత బాగా ముందుగానే ప్లాన్ వేసుకుని, సక్సెస్ఫుల్గా తీసుకుని వెళ్తుంది. వాళ్ళ కుటుంబం బాగుండాలని, ఆవిడ ప్లాన్ ప్రకారం అన్ని జరగాలని మనస్పూర్తిగా కోరుకుందాం.