Home Cinema M. M. Keeravani : చావు భయంతో నిద్రలేని రాత్రులు.. భయంతో అభిమానులు..

M. M. Keeravani : చావు భయంతో నిద్రలేని రాత్రులు.. భయంతో అభిమానులు..

m-m-keeravani-comments-on-social-media-about-characters-in-chandramukhi-2-movie

M. M. Keeravani : ఈరోజుల్లో హర్రర్ సినిమాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే.. హర్రర్, త్రిల్లింగ్ ఉన్న సినిమాలు మినిమమ్ హిట్ కొడుతున్నాయి. అందులోను ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన కొద్ది హర్రర్ సినిమా అనగానే విపరీతమైన మాయా గ్రాఫిక్స్ ని వాడుతున్నారు. అందువలన ఇంకా భయంకరంగా అనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి గ్రాఫిక్స్ గాని ఇంత టెక్నాలజీ గాని రాకముందు కూడా కొన్ని ( M. M. Keeravani comments on Chandramukhi 2 ) భయంకరమైన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలాంటి సినిమాల్లో చూసుకుంటే టాప్ టెన్ పొజిషన్లో ముఖ్యంగా చంద్రముఖి సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్ లేవు. కేవలం కథ, నటన, నటీనటుల, దర్శకుడు ప్రతిభ కారణంగానే కేవలం సినిమా అంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

m-m-keeravani-comments-on-social-media-about-characters-in-chandramukhi-2-movie

చంద్రముఖి సినిమా లో రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రలో నటించగా.. ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండు క్రియేట్ చేసింది. అప్పటినుంచి హర్రర్ సినిమాలకి సినిమా రంగంలో ఒక పెద్ద పీఠం ఏర్పడింది. ఇప్పటికీ ఆ సినిమానే ఎవరు మర్చిపోలేదు. భయంకరమైన సినిమా అంటే ఆ సినిమాని గుర్తు తెచ్చుకుంటారు. అందుకే ( M. M. Keeravani comments on Chandramukhi 2 ) ఇంచుమించుగా 18 ఏళ్ల కంప్లీట్ అవుతున్న తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తీస్తున్నట్టు ప్రకటించారు. చంద్రముఖి సినిమాని పి. వాసు దర్శకత్వం వహించారు. ఇప్పుడు మళ్ళీ ఆయనే చంద్రముఖి సీక్వెల్ తీస్తున్నారని ప్రకటించారు. రజినీకాంత్ ప్లేస్ లో రాఘవ లారెన్స్ ని పెట్టగా, జ్యోతిక బదులుగా కంగనా రనౌత్ నటిస్తున్నారని తెలుస్తుంది.

See also  RashmikasVijay: రష్మిక మనసులో విజయ్ ఎప్పటికీ.. అందుకే మర్చిపోలేకపోతున్న అంటూ భహిరంగంగా నువ్వే బెస్ట్ అంటూ కామెంట్స్..

m-m-keeravani-comments-on-social-media-about-characters-in-chandramukhi-2-movie

ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వినాయక చవితి రిలీజ్ చేయాలని సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే చంద్రముఖి 2 సినిమా తీస్తున్నారని సంగతి చాలా మందికి తెలియదు. ఇది పెద్దగా ప్రమోషన్ కూడా అవలేదు కానీ.. ఇప్పుడు ఎం ఎం కీరవాణి చేసిన ఒక ట్వీట్ ( M. M. Keeravani comments on Chandramukhi 2 ) ద్వారా ఈ సినిమా విపరీతంగా పాపులర్ అయింది. చంద్రముఖి 2 సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ సినిమా జరుపుకుంటుండగా.. ఈ సినిమా గురించి ట్విట్టర్లో ఒక పోస్ట్ కీరవాణి పెట్టారు. అది చూసిన దగ్గర నుంచి నెటిజనులు ఆ పోస్ట్ ని వైరల్ చేస్తున్నారు.

See also  Allu Arjun: కావాలని ఆ హీరోయిన్ తో అల్లు అర్జున్ అలాంటి పని చేయబోతున్నాడా.? తేడా కొడితే పరువు గంగలోనేనా.?

m-m-keeravani-comments-on-social-media-about-characters-in-chandramukhi-2-movie

ఎంఎం కీరవాణి ఈ సినిమా గురించి చేసిన కామెంట్ చూస్తే ఆ సినిమాపై భార్య అంచనాలు నెలకొంటున్నాయి. ఇక ఎప్పుడు ఎప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుందా.. చూసి భయపడి పోదామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక ఎం ఎం కీరవాణి ఆయన ట్విట్టర్ లో.. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న చంద్రముఖి 2 సినిమా ఇప్పుడే చూశాను. ఈ సినిమాలోని పాత్రలు మరణ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతాయి. ఇక సన్నివేశాలకు నా మనసుకు హత్తుకునేలా సంగీతంతో జీవం పోయాలని నాకు రెండు నెలల సమయం పట్టింది. నేను కూడా రెండు నెలలు నిద్రపోలేదు. గురు కిరణ్, నా స్నేహితుడు విద్యాసాగర్ దయచేసి నాకు శుభాకాంక్షలు తెలపండి అంటూ కీరవాణి ట్వీట్ చేశారు. అంతే ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన అంత గొప్ప సంగీత దర్శకుడు ఈ సినిమా గురించి అంత గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చేసరికి.. మరణ భయంతో నిద్రలేని రాత్రులు గడిపిన ఆ సినిమాని చూసేందుకు ఆసక్తిగా ఉన్నా.. మరోపక్క అది ఎంత భయపెడుతుందో అని సినీ అభిమానులు భయపడుతున్నారు కూడా..