Home Cinema Prabhas : శివుడిగా ప్రభాస్ పక్కన పార్వతిగా ఎవరున్నారో చూడండి..

Prabhas : శివుడిగా ప్రభాస్ పక్కన పార్వతిగా ఎవరున్నారో చూడండి..

lord-shiva-looks-for-prabhas-in-bhakta-kannappa-movie

Prabhas : పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ అంటే ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ జాతీయ, అంతర్జాతీయ లెవెల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాంటి ప్రభాస్ కి గత కొంతకాలంగా ( Lord Shiva looks for Prabhas ) వరుస డిజాస్టర్స్ వస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉండి ఉండవచ్చు కానీ వాటిని ఎదుర్కొక తప్పడం లేదు. అయినా కూడా ప్రభాస్ కి ఎటువంటి క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికి ప్రభాస్ చేతిలో ఉన్న ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాలే. ఇలాంటి ప్రాజెక్టులతో ముందుకు దూసుకుపోతున్న ప్రభాస్ కి ఎక్కడ కూడా బ్రేక్ అనేది కనిపించడం లేదు. ఇక అతను ఎక్కడో చోట ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టగానే మళ్ళీ ఏ స్థాయికి వెళ్తాడో కూడా ఊహించేది లేదు.

See also  Deepika Padukone: ఆస్కార్ అవార్డ్స్ లో అనౌన్సమెంట్ చేస్తూ దీపికా పడుకోణె ఫీలింగ్స్ చూసి మీ కామెంట్ ఏమిటి?

Prabhas-Lord-Shiva-movie

ఇదిలా ఉంటే మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు కన్నప్ప సినిమాలో శివుడు పాత్ర గురించి ఎప్పటినుంచో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మంచి విష్ణు సినిమాలో శివుడు పాత్రని ప్రభాస్ చేస్తాడు అని ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ( Lord Shiva looks for Prabhas ) అధికారికంగా ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు గానీ.. కచ్చితంగా వస్తుందని.. శివుడుగా ప్రభాసే చేస్తాడని అంటున్నారు. ఈ సినిమాని 100 కోట్లతో అత్యంత భారీ బడ్జెట్లో తీయాలని డిసైడ్ అయ్యారు అంట. ఈ సినిమాలో ప్రతి పాత్రని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాయానికి కావాల్సిన అన్ని సన్నాహాలు చేసుకుంటున్నారు అంట. సినిమా షూటింగ్ ఎక్కువగా న్యూజిలాండ్లో చేస్తారంట.

Prabhas-Lord-Shiva-movie-bhaktha-kannappa

అయితే ఈ సినిమాలో శివుడుగా ప్రభాస్ గాని చేస్తే నిజంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వకపోయినప్పటికీ.. రాముడిగా ప్రభాస్ లుక్కు మాత్రం చాలా బాగుంది. అలాగే శివుడుగా మరింత అదరగొడతాడు అన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే.. ప్రభాస్ ( Lord Shiva looks for Prabhas ) ఫేసు శివుడు గా చాలా బాగా సెట్ అవుతుంది. అయితే అభిమానులు ఊరికే కూర్చోవడం లేదు. ప్రభాస్ శివుడు గా ఎలా ఉంటాడో టెక్నాలజీ సాయంతో శివుడు రూపంలో ప్రభాస్ పోస్టర్లను డిజైన్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఆ ఫోటోలను చూస్తే ప్రభాస్ అంటే వాళ్ళకి ఎంత ప్రాణమో తెలుస్తుంది.

See also  Chiranjeevi: అప్పట్లో కుర్రాలని హీట్ ఎక్కించిన పవన్ భూమిక సీన్ రిపీట్ చేయనున్న చిరు శ్రీముఖి

Prabhas-Lord-Shiva-Parathi-Nayanatara

కన్నప్ప సినిమాలో ప్రభాస్ ని శివుడుగా అనుకుంటే.. ఇక పార్వతిగా ఎవరిని అనుకుంటున్నారు అనేదే చర్చ. ఇప్పటికే పార్వతి దేవిగా నయనతారను తీసుకుంటారని అంటున్నారు. నయనతార ఇప్పటికే ఎన్నో డెవోషనల్ సినిమాల్లో దేవతల పాత్ర వేసి.. ఎంతో అద్భుతంగా నటించి.. మంచి పేరు సంపాదించుకుంది. అందుకని నయనతారయితేనే బాగా సూట్ అవుతుందని అనుకుంటున్నారు. అలాగే ప్రభాస్ అభిమానులు ప్రభాస్ ని సింగల్ శివుడుగా డిజైన్ చేయడమే కాకుండా.. పక్కన పార్వతీదేవిగా నయనతారను కూడా టెక్నాలజీ సహాయంతో డిజైన్ చేసి.. ఆ ఇమేజ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడు లుక్ లో ఎలా ఉంటాడో అభిమానులు ముందుగానే చూపించారు ఇక సినిమా వాళ్లు ఎలా చూపిస్తారో చూడాలి.