Home Cinema JackPot Laya: పాన్ ఇండియా చిత్రం లో జాక్ పాట్ ఆఫర్ ను కొట్టేసి రీ...

JackPot Laya: పాన్ ఇండియా చిత్రం లో జాక్ పాట్ ఆఫర్ ను కొట్టేసి రీ ఎంట్రీ కి రెడీ అయిన లయ.

JackPot Laya: ఇప్పుడు ఇదే ట్రెండ్ లా ఇండస్ర్టీలో కొనసాగుతుంది. మరి ఆ ట్రెండ్ ఏంటి.. ఏముంది అండీ ఒకానొకప్పుడు స్టార్ లు ఇండస్ర్టీలో మంచి మంచి పాత్రలను పోషించి సినీ కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్ళి చేసుకుని మంచిగా సెటిల్ అయ్యారు. ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కని వాళ్ళు కాసింత పెద్దయ్యాక మళ్ళీ సినీమా రంగంలో నటించాలనే మక్కువ ఎక్కువై అవకాశాల కోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. తాజాగా.! ఇదే లీస్ట్ లోకి చేరిపోయింది అలనాటి అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ (JackPot Laya) లయ. ఇప్పుడున్న కుర్రాళ్ళకు సరిగా పరిచయం లేకపోవచ్చు ఈమె. లయ అంటే ఎవరా అని కాస్త సందేహ పడొచ్చు. ఇక అప్పట్లో కుందనపు కొమ్మకు చీర కడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ భామ.

See also  Rajamouli: 45 సెకండ్స్ యాడ్ కోసం 3 కోట్లు.. రాజమౌళికి దరిదాపుల్లో కూడా లేని స్టార్ హీరోలు..

laya-is-ready-to-re-enter-after-winning-the-jackpot-offer-in-the-film-pan-india

అప్పట్లో ఎంత పద్దతిగా ఉంటూ అలాంటి పాత్రలలో మాత్రమే పోషిస్తుండేది. చాలా పద్దతిగా చీర కట్టుకుని.. తల నిండుగా పూలు పెట్టుకుని.. ముఖానికి పసుపు రాసుకుని.. పెద్దగా బొట్టు పెట్టుకుని.. చూడ చక్కగా కనిపిస్తూ.. మెడలో అలంకరణ.. నడుమునకు వడ్డానం.. జడగంటలు జడకు పెట్టుకుని అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించేది. ఇంత పద్దతిగా నిండుగా కనిపిస్తుంటే ఎవరైనా ఆకర్షితులు కాకుండా ఉంటారా చెప్పండి. ఆమెను ఇష్టపడకుండా ఉండలేరు ఖచ్చితంగా ఆమెను ఇష్టబడుతూ అభిమానిస్తుంటారు. ఇక సినిమాలలో అవకాశాలు తగ్గు ముఖం పట్టడంతో కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడేఖ.. వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది ఈ తార లయ.

See also  విధ్వంసం సృష్టించిన వీరసింహారెడ్డి. బాలయ్య చరిత్రలో అరుదైన రికార్డు.

laya-is-ready-to-re-enter-after-winning-the-jackpot-offer-in-the-film-pan-india

ఇక ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా మళ్ళీ పాపులారిటీ సంపాదించుకుని ఇప్పుడిప్పుడే మళ్ళీ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించడమే కాక అవకాశాలు సైతం వరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా లయ ఇస్టాలో చేస్తున్న రీల్స్ వైరల్ అవ్వడంతో ఆమెకు మరింత గుర్తింపు దక్కింది. ఇక ఇటీవలీ కాలంలో లయ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వూ ఇచ్చింది. ఆ ఇంటర్వూలో భాగంగా లయ మాటలకు ఫిదా అయిన ఓ డైరెక్టర్ ఆమెకు ఫోన్ చేసి విసిగించి ఆమెను తను తీసే తన తదుపరి చిత్రంలో పెట్టుకోబోతున్నాడని తెలుస్తుంది. అవును.! ఇప్పుడు ఇదే వార్త వైరల్ గా మారింది నెట్టింట.

See also  Vishwaksen: విశ్వక్ సేన్ మనసు దోచేసిన యాంకర్.. హీరోయిన్ కంటే తక్కువ ఏం కాదంటూ కామెంట్స్..

laya-is-ready-to-re-enter-after-winning-the-jackpot-offer-in-the-film-pan-india

దాంతో ఒక్కసారిగా లయ ఏంట్రీ ఇవ్వబోతున్న సినిమా ఏంటనేది ఒక్కసారిగా ఇండస్ర్టీలో వైరల్ అవ్వసాగాయి. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి చిత్రంలో లయ ప్రధాన పాత్రలో అటు హీరోయిన్ కాదు ఇటు హీరో కు తల్లిగా కూడా కాదు. సినిమాలోకి కథను ఓ మలుపు తిప్పే క్యారెక్టర్లో నటించనున్నదట. కాగా ఈ చిత్రం మొత్తం స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కబోతున్న చిత్రమని మనందరికీ తెలుసు. ఇక లయ కూడా రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో రా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఈ సినిమాకు సై అంటూ సైన్ చేసిందట. మరి ఈ చిత్రం విడుదలయ్యేది ఎప్పుడో అఫీషియల్ గా డేట్ ఫిక్స్ అవ్వనుంది.