Home Cinema Lavanya Tripathi: అందాల రాక్షసి అమ్మోరులా మారి అందరికీ అదిరిపోయే షాక్ ఇచ్చింది గా…

Lavanya Tripathi: అందాల రాక్షసి అమ్మోరులా మారి అందరికీ అదిరిపోయే షాక్ ఇచ్చింది గా…

Lavanya Tripathi New Look:  అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. తన తొలి సినిమాతోనే తెలుగులో మంచి స్పందన లభించింది. ఇంకా తెలుగులో కాకుండా హిందీ,తమిళ చిత్రాల్లో కూడా లావణ్య త్రిపాఠి నటించింది. పుట్టింది ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో, పెరిగింది ఉత్తరఖండ్లోని డెహ్రాడూన్ లో.. ఉన్నత చదువులకై వెళ్ళింది ముంబైకి ఆ తర్వాత మోడలింగ్ లో ప్రవేశించింది.

lavanya-tripathis-new-web-series-puli-meka-is-coming-on-zee5

2006లో మిస్ ఉత్తరకాండ కిరీటం గెలుచుకుంది లావణ్య త్రిపాఠి. ఈ మధ్య జి ఫైవ్ వారు ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరిస్తున్న సిరీస్ లో నటించింది. తను నటించిన మొట్టమొదటి వెబ్ సిరీస్ ఇది, కే.చక్రవర్తి రెడ్డి తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ పేరు పులిమేక ఇందులో లావణ్య త్రిపాఠి పూర్తి యాక్షన్ రోల్ (Lavanya Tripathi New Look) చేయనున్నది అంతేకాదు, పూర్తిగా ముఖానికి పసుపు రాసుకుని అమ్మోరు అవతారం ఎత్తింది అదే కాక తొలిసారిగా ఆమె పోలీస్ అవతారం ఎత్తింది.

See also  Rekha: ఇరవై ఏళ్ల క్రితం ఒక్క చిత్రంతో ఇండస్ట్రీ ని ఊపేసింది. కానీ ఆ తర్వాత

lavanya-tripathis-new-web-series-puli-meka-is-coming-on-zee5

లావణ్య త్రిపాఠి నటిగా తనను తాను కొత్తగా పరీక్షించుకుంటున్న విషయమే ఈ పులిమేక. తాను కూడా డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టి యాక్షన్ బాట పట్టింది. అయితే ఖాఖీ పాత్రలో బోనాలు సమయంలో ఓ సన్నివేశంలో ఈ దర్శనమిచ్చింది ఇలా ఎన్నో కొత్త అవతారాలతో ఈ సిరీస్ లో లావణ్య కనపడబోతుంది. త్వరలో జి ఫైవ్ లో స్రీమింగ్ కాబోతుంది. ఎప్పటికప్పుడు లావణ్య తన ఫిట్నెస్ ని కాపాడుకుంటూ ఇంకా హీరోయిన్గా అవకాశాలు పొందుతూనే ఉంది. ఆమెకి అవకాశాలు లేవు అనుకున్న ప్రతిసారి మన ముందుకు కొత్త అవతారంతో కనిపిస్తుంది.

See also  Ram Pothineni: ఏంటి.? ఆ స్టార్ హీరో భార్య వల్లే రామ్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉంటున్నాడా.?

lavanya-tripathis-new-web-series-puli-meka-is-coming-on-zee5

ఇకపోతే ఫిబ్రవరి 24న పులిమేక జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పులివేక టీజర్ ను విడుదల చేశాడు దీనికి అద్భుతమైన స్పందన లభించింది. అదేవిధంగా ఈ జోష్ తగ్గకముందుకే మహాశివరాత్రి సందర్భంగా లావణ్య త్రిపాఠి పాత్రలోని హీరోయిన్ యాంగిల్ కనబడేలా స్పెషల్ గ్లింప్స్ ను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడుదల చేశారు. ఆది సాయి కుమార్ ఇందులో ఫోరేన్సిన్ ఆఫీసర్ గా పని చేసాడు.