Lavanya Tripati : మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది.. గత కొన్ని సంవత్సరాలుగా మిస్టర్ సినిమా నుంచి వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ఒకరితో ఒకరి పరిచయమై.. అక్కడ నుంచి మంచి స్నేహితులుగా మారి పెళ్లి ( Lavanya Tripathi and Chiranjeevi ) వరకు రీచ్ అవుతున్నారు.ఇదిలా ఉంటే జూన్ 9వ తేదీన వీళ్ళకి జరిగిన ఎంగేజ్మెంట్ లో మెగా అభిమానులు అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇద్దరు తారులు ప్రేమించి పెళ్లి చేసుకుంటే అందరికీ నచుతుంది కానీ.. కొన్ని జంటలు నిలబడతాయి కొన్ని జంటలు విడిపోతాయి. అలా కాకూడదని.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మాత్రం కలిసి ఆనందంగా జీవితం గడుపుతున్న కొన్ని జంటల మాదిరిగానే వీళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకొని, అన్యోన్యంగా బ్రతకాలని అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఏదైనా ఒక సంఘటన జరిగింది అంటే ఆ సంఘటనకు రిలేటెడ్ ఎప్పుడో, ఎక్కడో, ఎవరో ఏదో మాట్లాడిన విషయాలను మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకొని దాని గురించి మాట్లాడుకోవడం నేటిజనులకు చాలా కామన్ గా ఉండే అలవాటు. అలాగే లావణ్య త్రిపాఠీ సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన దగ్గరనుంచి ఆమెకు ఒక పేరు వచ్చింది.. ఆమెది ఐరన్ లెగ్ అని.. ఎందుకంటే.. సినిమా రంగంలోకి వచ్చి ఇన్నేళ్ళైనప్పటికీ.. ఏదో సాదాసీదా ( Lavanya Tripathi and Chiranjeevi ) హీరోయిన్ గానే నడిపిస్తుంది గాని.. ఆమె ఒక స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. ఆమె నటించిన ప్రతి సినిమా పెద్దగా సక్సెస్ సాధించవు.. ఒకవేళ సక్సెస్ అయినా కూడా అందులో హీరోయిన్గా ఆమెకు ఎలాంటి పేరు రాదు. అందుకే లావణ్య ని ఐరన్ లెగ్ లేడీ అని కొందరు అనుకుంటున్నారు.
అయితే లావణ్య త్రిపాఠి.. నిఖిల్ తో కలిసి అర్జున్ సురవరం సినిమా నటించడం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కి సుమ యాంకర్ గా చేసింది. అయితే సుమ అప్పట్లో లావణ్య త్రిపాఠిని ఒక ప్రశ్న అడిగింది. మీకు నిఖిల్, పవన్ కళ్యాణ్, చిరంజీవి ఈ ముగ్గురు హీరోలుగా మీతో నటించే అవకాశం దొరికితే.. మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని అడిగింది. అప్పుడు లావణ్య త్రిపాఠి నేను చిరంజీవి గారిని ( Lavanya Tripathi and Chiranjeevi ) సెలెక్ట్ చేసుకుంటాను అని అన్నది. ఎందుకని ఆయన వయసు కొంచెం పెద్దది కదా వీళ్ల ముగ్గురిలోని అని అడిగిగా.. అయినా కూడా ఆయన సీనియర్ హీరో కదా ఆయన సరసన నటించడం నాకిష్టం అన్నది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసి నెటిజనులు కామెంట్లు చేయడం మొదలు పెట్టారు.
లావణ్య త్రిపాఠి ఐరన్ లెగ్ వేసుకొని మా మెగాస్టార్ చిరంజీవితో నటించేసి.. చిరంజీవి సినిమా అట్టర్ ఫ్లాప్ చేసేసి.. ఐరన్ లెగ్ మొత్తం మా హీరోకి అంటిద్దాం అనుకున్నావా ? అందుకే మా మెగాస్టార్ ఏం చేశాడంటే.. మెగా ఫ్యామిలీలోకి నిన్ను కోడలుగా తీసుకొచ్చి.. ఇకమీదట సినిమా నటించకూడదనే కండిషన్ పెట్టించి.. నీ ఐరన్ కాలనీ గట్టిగా పెళ్లి అనే తాళితో కట్టేస్తున్నారు. మా మెగా స్టార్ చిరంజీవి మీద నువ్వు కన్నేస్తే.. మా మెగా కుటుంబం మొత్తం నీకు ఇచ్చిన రియాక్షన్ ఎలా ఉందో చూసావా? ఎంత మంచోళ్ళు అంటే నీ వల్ల వాళ్ళకి హాని కలగకుండా చూసుకోవడమే కాకుండా.. నీ జీవితానికి మంచి అందమైన వరుణ్ణి ఇచ్చి.. గొప్ప కుటుంబానికి కోడల్ని చేసి.. నీకు న్యాయం చేసి వాళ్లకు న్యాయం చేసుకుని.. నీకు మాంచి అదిరిపోయే రియాక్షన్ ఇచ్చారు కదా.. అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.