Lavanya Tripathi Finally Opens: తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలకు ఇంకా పెళ్లిళ్లు కాలేదు. ఈ యువహీరోల పెళ్లి విషయమై ప్రతిరోజు ఏదో ఒక వార్త నెట్ లో చక్కర్లు కొడుతూనే ఉంది. అలాంటి వార్తల్లో కెక్కే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మెగా వారసుడిగా.. తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన వరుణ్ తేజ్ మొదటి సినిమా తో సూపర్ హిట్ విజయం సాధించి తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా కూల్ క్లాసిక్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. వరుణ్ తేజ్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో తన నటన ద్వారా మెప్పిస్తూ సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ వరుసగా ఆఫర్లు అందిపుచ్చుకొని ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇకపోతే హీరోయిన్లకు సంబంధించిన పెళ్లిళ్ల విషయం కూడా నిత్యం హాట్ టాపిక్ గా న్యూస్ లో ఏదో ఒక రూపంలో వైరల్ అవుతూనే ఉంది. మూడు పదులు దాటుతున్న భామలు కూడా ఇంకా పెళ్లిళ్ల ఊసే ఎత్తడం లేదు. కానీ వీరి గురించి నెటిజెన్లు మరోవైపు అభిమానులు కూడా కంగారు పడుతున్నాడు. ఇలాంటి క్రమంలోనే రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. అలా ఆ పుకార్లలో పుట్టుకొచ్చిన పెళ్లి వార్తల్లో లావణ్య త్రిపాఠి పేరు కూడా వచ్చింది. ఈ బామ్మ మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉందని గతంలో ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. ఇద్దరు కలిసి మిస్టర్ అనే సినిమాలో కలిసి నటించారు. అయితే ఆ సినిమా సమయంలోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారని ఇటీవల మధ్యకాలంలో ఓ షోకు వచ్చిన లావణ్య త్రిపాఠి..
హ్యాండ్సమ్ హీరో ఎవరని షోలో అడగ్గా వరుణ్ తేజ్ అని టక్కున చెప్పింది ఈ చిన్నది. దాంతో ఈ ప్రేమ రూమర్స్ కు మరింత బలం చేకూర్చినట్టు అయ్యింది.. ఇదే కాక మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఏకంగా పెళ్లి చేసుకుంటున్నారని న్యూస్ వైరల్ గా మారింది. రీసెంట్గా ఇదే విషయంపై లావణ్య త్రిపాటి స్పందించింది. ఆమె నటించిన వెబ్ సిరీస్ పులిమేక రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇదే క్రమంలో ఇంటర్వ్యూ కి వెళ్లిన లావణ్య పెళ్లిపై పలు ప్రశ్నలు వేయగా దీనిపై వ్యంగంగా ఆమె స్పందిస్తూ.. లావణ్య కౌంటర్ వేసింది.
మీ దృష్టిలో ఇండస్ట్రీకి వచ్చిన 10 ఏళ్లలో హీరోయిన్ పెళ్లి చేసుకోవాలి, అంతేనా నేను ఆ టైప్ కాదు ఇండస్ట్రీలో సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. నా కాన్సంట్రేషన్ అంతా సినిమాలపైనే.. ఇప్పటిలో పెళ్లి గిల్లి లొల్లి అనేది ఏమీ లేదు. అలాంటి దాని గురించి ఆలోచించడానికి ఒక్క మాటలో కొట్టి పడేసింది. (Lavanya Tripathi Finally Opens) దాంతో పెళ్ళంటు వస్తున్న వార్తల పై లావణ్య త్రిపాఠి ఘాటుగానే కౌంటర్ వేసింది. మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంటి అబ్బాయి తో పెళ్లి అనే రూమర్లు వచ్చిన లావణ్య త్రిపాటి కొట్టి పడేయడాన్ని మెగా హీరోని ఇన్సల్ట్ చేసిందంటూ నెటిజన్ అలాగే ఇటు వరుణ్ తేజ్ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరొకసారి సోషల్ మీడియా లో లావణ్య త్రిపాఠి గురించి న్యూస్ చెక్కర్లు కొడుతూ వైరల్ అయింది.