Home Cinema Lavanya Tripathi : విజయకచవితి పండుగలో పెళ్లి కాకుండానే నిహారికని బాధపెట్టిన లావణ్య త్రిపాఠి.. నిజమా?

Lavanya Tripathi : విజయకచవితి పండుగలో పెళ్లి కాకుండానే నిహారికని బాధపెట్టిన లావణ్య త్రిపాఠి.. నిజమా?

lavanya-tripathi-celebrated-ganesh-chathurthi-with-varun-tej-at-nagababu-house

Lavanya Tripathi : అతి తొందరలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుక అవుతుందని అందరికీ తెలిసిందే. అసలు వీళ్ళ పెళ్లి ఆగస్టులోనే జరుగుతుందని అనుకుంటే.. కొన్ని కారణాల వలన ఆగస్టులో జరగలేదని, నవంబర్ లో గానీ డిశంబర్ లో గాని వీళ్ళ పెళ్లి జరుగుతుందని అనేక వార్తలు సోషల్ మీడియాలో ( Lavanya Tripathi Ganesh Chathurthi ) వింటూనే ఉన్నాం. అయితే ఆగస్టులో పెళ్లి జరగకపోవడానికి కారణం నిహారిక విడాకులు విషయం బయటకు వచ్చిన వెంటనే.. పెళ్లి చేయడం బాగోదని నాగబాబు ఆపినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రోజు అందరూ ఎంతో వైభవంగా, ఆనందంగా భగవంతుని పూజించుకునే పండుగ రోజు వినాయక చవితి.

Lavanya-tripathi-ganesh-puja-varuntej

వినాయక చవితి నాడు ఆ గణేషుడిని పూజించుకొని.. ఆయన కథ చదువుకొని.. అక్షింతలు తల మీద వేసుకుంటే నీలాపనినిందలు రాకుండా ఉండేందుకు ఆ భగవంతున్ని పూజించుకునే క్రమంలో.. పేదవాడి నుంచి సెలబ్రిటీ వరకు అందరూ కూడా ఈ పూజని వాళ్ళ శక్తి కొద్దీ.. భక్తితో ఎంతో బాగా చేసుకుంటారు. అలాగే నాగబాబు ఇంట్లో కూడా వినాయక చవితిని చక్కగా సాంప్రదాయపద్ధంగా ఎంతో ఆనందంగా చేసుకున్నారు. నాగబాబు, ఆయన భార్య, వరుణ్ తేజ్తో పాటు లావణ్య త్రిపాఠి కూడా వీళ్ళ ఇంటికి వచ్చి వినాయక చవితి ( Lavanya Tripathi Ganesh Chathurthi ) చేసుకోవడం విశేషం. అసలు పెళ్లయ్యే వరకు అత్తారింట్లో అడుగుపెట్టకుండా.. జాగ్రత్తగా పెళ్లయిన తర్వాత అడుగుపెట్టి పూజలు అవి స్టార్ట్ చేయడం అనేది కొందరి ఆనవాయి అయితే.. నాగబాబు ఇంట్లో పెళ్ళికి ముందే చక్కగా తీసుకొచ్చి వినాయక చవితిని చేసుకున్నారు. ఇక తండ్రి కొడుకులు ఇద్దరు అయితే భార్యల్ని కూర్చోబెట్టి.. వాళ్ళు నుంచొని చక్కగా ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

See also  RRR: షాకింగ్.. ఆర్ఆర్ఆర్‌ కు ఆస్కార్ అవార్డు రావడానికి కారకుడైన ఈ తెరవెనుక హీరో ఆత్మహత్య అంచులవరకు వెళ్లాడా!

Lavanya-Tripathi-Ganesh-Chathurthi

లావణ్య త్రిపాటి సాంప్రదాయపరంగా చీర కట్టుకొని.. అత్తగారి దగ్గర వినయంగా పక్కనే కూర్చొని.. ఆ గణేశుని పూజిస్తూ ఫొటోలను పెట్టింది. అలాగే నాగబాబు కూడా కొడుకు, కోడలు కళ్ళకు కనిపిస్తుంటే.. ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా, బాధ్యతగా పుత్రోత్సాహంతో పొంగిపోతూ ఆ ఫోటోలో కనిపించారు. చక్కటి కుటుంబం ఎంతో చక్కగా ఉంది అని అందరూ అనుకుంటున్నారు. ఇలాగే ఎప్పుడూ ఆనందంగా పెళ్లి తర్వాత కూడా కలిసి ఉండి.. ఇలా ( Lavanya Tripathi Ganesh Chathurthi ) ఆనందంగా అన్ని పండుగలు చేసుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఎవరి దిష్టి తగలకూడదని.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎప్పుడు కలిసే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఫోటోలు చూడగానే నెటిజనులు.. ఇదేంటి ఇంత పండుగ చేసుకున్నారు కుటుంబం అంతా కలిసి.. ఇందులో నిహారిక లేదేంటి అని కొందరు అంటుంటే.. మరికొందరు నిహారిక బహుశా అక్కడ లేదేమో అందుకే ఫొటోల్లో లేదని మరికొందరు అంటున్నారు.

See also  Telugu Film Industry: తెలుగు సినిమా రంగంలో అత్యంత ధనిక హీరో ఎవరో తెలుసా.? మీలో ఎంత మంది చెప్పగలరు..

Lavanya-Tripathi-Nagababu-varuntej

ఏదేమైనా ఇంకా పెళ్లి కాకముందే లావణ్య త్రిపాఠి ఇలా ఇంటికి వచ్చి అత్తగారింట్లో భర్తతో కలిసి ఇలా కలకలలాడుతూ పూజలు చేసుకుంటూ ఫోటోలు షేర్ చేస్తుంటే.. పాపం నిహారిక మనసు ఎంత చివుక్కుమంటాది. తన అత్తారింటిని, భర్తని అన్నిటినీ వదులుకొని విడాకులు తీసుకుని ఒంటరిగా ఉండడంతో ఆమె ఇవన్నీ చూసి హర్ట్ అవుతుందా అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా లావణ్య త్రిపాఠి మరీ ఫాస్ట్. తొందరగానే అత్తారింట్లో అడుగుపెట్టి అన్ని ముచ్చట్లు చేస్తూ నిహారికని బాధ పెట్టాలా ఆమెను అవమానించాలా? కొద్ది రోజులు ఆగితే నిహారిక కూడా కొంచెం మూడు బాగుంటే ఆమెకు కూడా రెండవ పెళ్లి చేసేగలిగితే.. అప్పుడు ఆమె కూడా ఆనందంగా ఉంటుందిగా అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఫ్యామిలీ అన్నాక అందరూ కలిసిమెలిసి హాయిగా అలా పండుగ చేసుకోవడం అనేది అభిమానులకు అయితే ఆనందంగానే ఉంది..