Home Cinema Samantha – Lavanya : లావణ్య కూడా సమంత లానే చేసిందట..

Samantha – Lavanya : లావణ్య కూడా సమంత లానే చేసిందట..

lavanya-tripathi-also-did-the-same-as-samantha-in-her-marriage

( Samantha and Lavanya ): సాధారణంగా సెలబ్రిటీస్ పెళ్లిళ్లు అంటే అందరికీ చాలా ఇష్టం. అందులోని ముఖ్యంగా సినిమా హీరో, హీరోయిన్స్ పెళ్లిళ్లు అంటే ఇంకా ఇష్టం. దాని గురించి అనేక రకాల వార్తలు ఎప్పటికప్పుడు ఎంతో ( Samantha and Lavanya ) హుషారుగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా సినిమా రంగంలో హీరో అదే సినిమా రంగంలో ఉన్న హీరోయిన్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ జంట అంటే ఇంకా ఇష్టంగా ఉంటుంది అభిమానులకి. ఎందుకంటే ఇటు హీరో అభిమానులు, అటు హీరోయిన్ అభిమానులు కూడా వాళ్ళిద్దర్నీ ఎంతగానో ఇష్టపడతారు.. ఆ క్రమంలో ఆ జంటను చూసి ఆనందంతో పొంగిపోతుంటారు.

Samantha-varun-tej-lavanya-tripathi

ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే .మెగా కుటుంబం మొత్తం ఈ పెళ్లిని ఎంతో ఘనంగా, సంప్రదాయపద్ధంగా ఇటలీలో జరుపుకొని.. హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. నవంబర్ 5వ తేదీన ( Samantha and Lavanya ) ఎంతో ఘనంగా హైదరాబాదులో రిసెప్షన్ చేయడం జరిగింది. ఈ రిసెప్షన్ కి అనేకమంది సెలబ్రిటీసు, సినిమా రంగం వాళ్ళు, రాజకీయ రంగం వాళ్ళు హాజరయ్యారు. ఎంతో అంగరంగ వైభవంగా, సాంప్రదాయంగా, ఎంతో చక్కగా రిసెప్షన్ జరిగింది. అయితే ఈ రిసెప్షన్ కి నాగచైతన్య కూడా రావడం జరిగిన ఫొటోస్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

See also  Sreeleela : ఐటెం సాంగ్ లో శ్రీలీల.. ఏ హీరోతో అంటే..

varun-tej-lavanya-tripathi-marriage

ఇదిలా ఉంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లిని.. నాగచైతన్య, సమంత పెళ్లితో అందరూ పోలుస్తున్నారు. ఎందుకంటే.. వాళ్ళిద్దరూ కూడా సినిమా రంగంలోనే ఉంటూ.. ఒకరిని ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకోగా.. వీళ్ళిద్దరూ కూడా సినిమా రంగంలోనే ఉంటూ ఒకరినొకరు కొంతకాలంగా ప్రేమించి, పెద్దలను ఒప్పించి వాళ్ళ లాగా ( Samantha and Lavanya ) పెళ్లి చేసుకున్నారు. అయితే లావణ్య త్రిపాఠి.. సమంతాలానే ఒక పని చేసింది అంట పెళ్లిలో. అదేంటంటే.. లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర ఎంతో చక్కగా ఉంది. అందులో లావణ్య త్రిపాఠి చూడముచ్చటగా ఉంది. అయితే ఈ చీర చివరన #వరులవ్ అంటూ ముద్రించి అది జీవితాంతం గుర్తుండిపోయేలా పెట్టుకుందట లావణ్య త్రిపాఠి.

See also  Gopi Chand: ప్రభాస్ తాగిన తర్వాత అలా చేస్తాడన్న సీక్రెట్ బయటపెట్టిన గోపీచంద్..

varun-tej-lavanya-naga-chaitanya

అలాగే నాగచైతన్య, సమంత పెళ్ళిలో కూడా సమంత కూడా తన పెళ్లి చేరమీద చై-సామ్ అని ఇన్ఫినిటీ సింబల్ ను ముద్రించిందంట. సమంత లానే లావణ్య త్రిపాఠి కూడా పెళ్లి చీర మీద వాళ్ళ ప్రేమకి గుర్తుగా ముద్రించుకోవడం సేమ్ సమంతాలనే ఫాలో అయిందంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి వాటిలో సమంతని ఫాలో అయిన పర్లేదు గాని.. భర్తను వదిలేసే దాంట్లో ఫాలో అయితే మాత్రం కష్టమే అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక మెగా అభిమానులైతే.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జీవితంలో అలాంటి సమస్య రాదని.. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా, ఆనందంగా కచ్చితంగా బ్రతుకుతూ మంచి జీవనాన్ని చూపిస్తారని అందరూ అంటున్నారు. ఏదేమైనా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి అందరూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు.