Home Cinema Skanda: స్కంద సినిమా పై ఇలాంటి టాక్ మొదలయ్యింది..

Skanda: స్కంద సినిమా పై ఇలాంటి టాక్ మొదలయ్యింది..

latest-talk-about-ram-movie-skanda-after-release-trailer

Skanda: రామ్ పోతినేని హీరోగా, శ్రీలీల హీరోయిన్గా, బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే రామ్ ( Ram movie Skanda talk ) అభిమానులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సినిమా మాస్ యాక్షన్ గా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ యాక్షన్ సినిమా అంటే ఎంత అదరగొడతాడు మనందరికీ అనుభవమే. ఇక రామ్ ని ఎలా తీర్చిదిద్దుతాడు? ఎంత బాగా చూపిస్తాడు అనేది సినిమాలో చూడాలని అభిమానులు అనుకునేవారు.

Skanda-Ram-trailer

అయితే ఈ సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చిన సందర్భంగా ప్రీ రిలీజ్ ముందు ట్రైలర్ ని విడుదల చేశారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత అందరిలోని అంచనాల మరింత బాగా పెరిగిపోయాయి. బోయపాటి శ్రీను తనదైన శైలిలో మాస్ యాక్షన్ ( Ram movie Skanda talk ) చాలా బాగా అద్భుతంగా చూపించాడని.. ఇక రామ్ లో ఉన్న ఎనర్జీని మొత్తం వాడేసాడని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీలీలతో రామ్ రొమాన్స్ కూడా అదిరిపోయేలా ఉందని.. కామెడీ కూడా బాగున్నట్టే ఉందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కేవలం ఫైట్స్ చాలా అద్భుతంగా తీసినట్టు అనిపిస్తుంది.

See also  Sreeleela: శ్రీ లీలకు రోజు కాల్స్ చేస్తూ తన ఫోన్ కి ఏకంగా ఆ వీడియోలే పంపిస్తున్న స్టార్ హీరో.. ఎవరంటే..??

Skanda-Ram-trailer-latest

నేను తలకాయ తీసేటప్పుడు తల ఎక్కడ ఉందని చూస్తాను కానీ వాడు వెనక ఎవరున్నారు అన్నది నేను చూడను అనే డైలాగ్ సినిమా లెవెల్ నేను చూపిస్తుంది. బోయపాటి శ్రీను బాలకృష్ణతో సినిమా తీస్తే ఎంత బాగా డైలాగ్స్ ని చెప్పిస్తాడో రామ్ తో కూడా అలాగే చెప్పిస్తున్నాడని అనిపించింది. ఈ సినిమాలో రాజకీయాలకు రిలేటెడ్ గా ( Ram movie Skanda talk ) కూడా కొన్ని అంశాలు ఉన్నాయని, వాటిపై చాలా గట్టి డైలాగ్స్ ఉంటాయని అనిపిస్తుంది. ప్రతి సినిమాలో రామ్ డైలాగ్స్ లాజికల్ గా, స్మూత్ గా చాలా లెన్తీ గా ఉంటాయి గాని.. ఈ సినిమాలో రామ్ డైలాగ్స్ చాలా స్ట్రాంగ్ గా, ఎనర్జిటిక్ గా, పవర్ ఫుల్ గా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎలాగైనా ఈసారి రామ్ మాత్రం చాలా పెద్ద హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

See also  Pawan Kalyan: రికార్డుల మోత మోగిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్..

Skanda-Ram-latest-talk

ఈ సినిమాలో శ్రీలీల, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని నిర్మించే క్రమంలో నిర్మాతలు ఎక్కడ రాజీ పడలేదని.. ప్రొడక్షన్ వాల్యూ క్రమంలో చాలా గట్టిగా సపోర్ట్ ఇచ్చారని అనిపిస్తుంది. అలాగే సినిమా రిలీజ్ కి కరెక్ట్ గా మూడు రోజులు ముందు రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ చూస్తే సినిమా ఓపెనింగ్స్ ని గట్టిగా సంపాదించుకోవడానికి చేసినట్టున్నారని తెలుస్తుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందరిలో ఈ సినిమాపై కొంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దానివల్ల గురు,శుక్ర,శని, ఆది.. ఈ నాలుగు రోజుల వ్యాపారాన్ని గట్టిగా లాగడం కోసమే ఈ ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లో అయితే సత్తా బానే ఉంది మరి సినిమా చూసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి..