Krishnam Raju wife asked one help from Prabhas: వర్షం సినిమాతో అందరిలో మంచి ట్యాలంట్ ఉన్న యంగ్ హీరో అని పేరు తెచ్చుకున్న ప్రభాస్, నిమ్మదిగా బాహుబలి సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ప్రభాస్ సినిమా అంటే భారీ స్థాయిలో ఊహిస్తున్నారు. మరి అంత స్థాయిలో సక్సెస్ రాకపోతే నిర్మాతలు పరిస్థితి తెలియదు కానీ, ప్రభాస్ స్టార్ డమ్ మాత్రం అక్కడికి వెళ్ళిపోయింది. ప్రభాస్ సినిమా కెరియర్ ఇప్పటివరకు ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. కొన్ని భారీ హిట్స్ ని తెలుగు ఇండస్ట్రీ కి ఇచ్చింది. రాజమౌళి తో తాను చేసిన ప్రతీ సినిమా సూపర్ డూపర్ హిట్ ని సొంతం చేసుకుంది. అలాగే కొరటాలతో చేసిన మిర్చి సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే ప్రభాస్ కెరియర్ లో సూపర్ సక్సెస్ అయినట్టే. కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఇంకా బ్యాచిలర్ గానే ఉండిపోయాడు.
ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? అనుష్కానే చేసుకుంటాడా? లేదా? లవ్ మ్యారేజ్ చేసుకుంటాడా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటాడా? ఇలా ఎన్నో అనుమానాలు ఎప్పటిపకపుడు ప్రభాస్ అభిమానుల నుంచి వస్తూనే ఉంటాయి. అయితే ఇటీవల ప్రభాస్ మాత్రం తాను అప్పుడే పేళ్ళి చేసుకోవడం అవ్వదని, తనకు సినిమాలతో చాలా బిజీగా ఉన్నానని చెప్పాడు. దీనితో ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నించం కొంత బ్రేక్ ఇచ్చారు. అయితే ఇప్పడు గురించి మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే.. ప్రభాస్ ని కృష్ణంరాజు భార్య ఒక కోరిక కోరుతుందట. కానీ ప్రభాస్ మాత్రం ఆమె కోరికని తీర్చడం లేదంట. పెద్దమ్మ కోరికను తీర్చు అని ప్రభాస్ తల్లి చెబుతున్నా కూడా ప్రభాస్ నో అంటున్నాడట.
ప్రభాస్ కి వాళ్ళ పెద్దనాన్న కృష్ణంరాజు అంటే చాలా గౌరవం. అయినా కూడా వాళ్ళ పెద్దమ్మ ( Krishnam Raju wife asked one help from Prabhas) మాట ఏమి వినడం లేదో తెలుసుకుందాం. కృష్ణం రాజుకి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. చెల్లెళ్ళ ముగ్గురు పెళ్లిళ్లు అయ్యేవరకు ప్రభాస్ పెళ్లి చేసుకోకూడదని ప్రభాస్ నిర్ణయించుకున్నాడట. కానీ కృష్ణం రాజు భార్య శ్యామలాదేవి మాత్రం ప్రభాస్ తో.. నువ్వు ముందు పెళ్లి చేసుకుని, నువ్వు నీ భార్య కలసి సి చెల్లళ్ళకు కన్యాదానం చెయ్యండి అని అంటుందట. ఆ మాటకు ప్రభాస్ తల్లి కూడా నిజమే పెద్దమ్మ చెప్పినట్టు విను అంటున్నారట. కానీ ప్రభాస్ మాత్రం తన చెల్లెళ్ళ ముగ్గురి పెళ్లిళ్లు అయ్యేవరకు తాను పెళ్లి చేసుకోనని అంటున్నాడట.
ఇంతకాలం ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో ఇప్పుడు అర్ధం అవుతుందంటూ నెటిజనులు ఈ వార్తని వైరల్ చేస్తున్నారు. కృష్ణంరాజు మీద ప్రభాస్ కి ఉన్న అభిమానం ఇలా చూపిస్తున్నాడన్న మాట. ఏదైనా ప్రభాస్ లో ఇంత కృతజ్ఞత భావం, బాధ్యత, చెల్లెళ్ళ పై ప్రేమ ఇవన్నీ తెలిసి, ప్రభాస్ అభిమానులు ఎంతగానో పొంగిపోతున్నారు.