Kovai Sarala: రాను రాను సినిమా ఇండస్ట్రీలోని పరిస్థితులు మారుతూ వస్తూ ఉన్నాయి.. ఎందుకంటే సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కొదవలేదు వస్తూ ఉన్నారు. కానీ అప్పట్లో సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉండేవాళ్లు అయినప్పటికీ కమెడియన్లు లేకుండా ఏ సినిమా కూడా ఉండేది కాదు. ఇక మనందరికీ తెలుసు అప్పట్లో బ్రహ్మానందం, బాబు మోహన్, వేణు మాధవ్, సునీల్, ఎంఎస్ నారాయణ ఇలాంటి స్టార్ కమెడియన్ లందరూ విడుదలయ్యే ప్రతి ఒక్క చిత్రంలో కచ్చితంగా మనకు కనిపించేవారు. ఇక అలాంటి వాళ్ళలో లేడీ కమెడియన్ కోవై సరల కూడా ఒకరు. కోవై సరళ ఎక్కువగా బ్రహ్మానందం భార్య పాత్రలలో నటించి సొంత భార్యలా మైమరిపించేంతలా తన నటన ప్రతిభ తో కోట్లాది ప్రేక్షకులను ఆకట్టుకుని అలరించేది.
ఇక అలాంటి కోవై సరళ జీవితంలో ఎన్నో విశాదాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె వయసు అరవై ఒక్క సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోలేదు. వయసు లో ఉన్నప్పుడు తాను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తం తన చెల్లెల్ల పెళ్లిళ్లకు చదువులకే వాళ్ల జీతాన్ని సెటిల్ చేయడానికి ఉపయోగించిందట. కానీ అంత చేసినప్పటికీ కూడా చెల్లెలి ఇంకా ఆశ వస్తుందని కేసు వేసిన సంగతి అప్పట్లో సంచలనమే సృష్టించింది.
ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే మన మేటర్ లోకి ఎంటర్ అవుతాం అయితే కోవై సరళ ఆరో తరగతి లోనే ఆ హీరో కోసం అలాంటి పని చేసిందట. మరేంటి సంగతి ఆ వివరాలు ఏంటో చూద్దాం. కోవై సరళ ఆరో తరగతి చదువుతున్న సమయంలో ఎంజీఆర్ అంటే చచ్చిపోయేంత పిచ్చి ప్రేమ. ఇక ఈ హీరో ఓ రోజు కోయంబత్తూర్ ఓ హోటల్ కి వస్తున్నారని తెలిసి హోటల్ బయట చాలాసేపు ఎదురు చూసిందట కానీ చివరి వరకు కూడా ఎంజీఆర్ ని చూడలేకపోయానని గుక్క పెట్టి మరి ఏం చేసిందట..
ఇక ఈ విషయం తెలుసుకున్న ఎంజీఆర్ కోవై సరళ (Kovai Sarala) ను ఇంటికి పిలిచి మరి ఆమె విషయాలన్నీ ఆరా తీశారట. కానీ కోవై సరళ కు మాత్రం ఎందుకు నాకు డీటెయిల్స్ అడుగుతున్నారని భయంతో ఏం చేయ్యాలో తెలియక అన్ని చెప్పిందట. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక సరిగ్గా నెల రోజులకే స్కూల్ ఫీజు కట్టినట్టు తెలిసింది. దాంతో అప్పటి నుండి ఎంజీఆర్ ని తన ఆరాధ్య దైవంగా కోవై సరళ భావించిందట ఆయనలో ఆ దేవుని కొలుచుకునేదట.ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక సరిగ్గా నెల రోజులకే స్కూల్ ఫీజు కట్టినట్టు తెలిసింది. దాంతో అప్పటి నుండి ఎంజీఆర్ ని తన ఆరాధ్య దైవంగా కోవై సరళ భావించిందట ఆయనలో ఆ దేవుని కొలుచుకునేదట. ఇక గత సంవత్సరం సెంబి అనే చిత్రంలో నటించి అందరిని ఎంతగానో అలరించిందని చెప్పాలి ఈ చిత్రం చాలా మంచి విజయాన్ని సాధించి కోవైసర్లకి మంచి పేరు తీసుకొచ్చింది.