Konidela Niharika: అవును.. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా అంతట తెగ చెక్కర్లు కొడుతుంది. ఎన్నో ఆశలతో ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్న ఈ జంట చివరి వరకు కలిసి ఉంటారని అనుకున్నాం.. టాలీవుడ్ లో మెగా బ్రదర్ గా పేరు సంపాదించుకున్న నాగబాబు కూతురు నిహరిక రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తుంది వార్త.. ఇక ఇదే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. జొన్నలగడ్డ చైతన్య ను వివాహమాడిన నిహారిక.. త్వరలో వీళ్లిద్దరు విడిపోతున్నారని సోషల్ మీడియాలో ఎన్నో రోజులుగా వస్తున్న వార్తలు మనం వింటూనే ఉన్నాం.. వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు ధృవీకరించలేదు కానీ వీళ్ళిద్దరి ప్రవర్తన చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా విడాకులు తీసుకోబోతున్నారు అన్నది మాత్రం నిజం అని అర్థమవుతుంది.
ఎందుకంటే వీళ్లిద్దరూ వాళ్ళ సోషల్ మీడియాలలో ఒకరికి ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. కేవలం అన్ ఫాలో మాత్రమే కాదు వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా మీరు సోషల్ మీడియాలలో తొలగించేసారు. పెళ్లికి సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో ఉంచలేదు. పైగా ప్రస్తుతం నిహారిక హైదరాబాద్ లోని తన తండ్రి నాగబాబు ఇంట్లోనే ఉంటుంది అంటూ వార్త వైరల్ గా మారింది. ఇక నెట్టింట వైరల్ అయిన ఎన్నో వార్తల నడుమ మెగా అభిమానులు కూడా వీళ్లిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని ఫిక్స్ అయ్యారు. ఇక ఇదే క్రమంలో నిహారిక రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యిందట.. ఆ యంగ్ హీరోని చేసుకోవడానికి రెడీ అయిందంటూ వార్త వైరల్ గా మారింది. మరి ఆ యంగ్ హీరో ఎవరో కాదు ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకొని దూసుకుపోతున్న విరూపాక్ష హీరో సాయి ధరమ్ తేజ్.
మనందరికీ తెలుసు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, నిహరికకు వరుసకు బావ అవుతాడు. నిజానికి అన్ని అనుకున్నట్లు ఉంటే నిహారికకు మొదటి హస్బెండ్ సాయి ధరమ్ తేజ్ అయ్యుండేవాడు. మొదట సాయి ధరమ్ తేజ్ కి నిహారికపై ఎలాంటి ఒపీనియన్ లేకపోవడంతోనే నిహారికను రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాతే నిహారిక, చైతన్యను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీళ్ళిద్దరూ విడాకులు తీసుకునే విడిపోనున్నారు. ఇక ఇంత జరిగిన తర్వాత నిహారికను వివాహం చేసుకోవడానికి ఎవరు వస్తారు అని ప్రశ్న తలెత్తింది. ఇదే క్రమంలో తన సిస్టర్ సన్ తో నిహారిక పెళ్లి చేస్తే బాగుంటుందని నాగబాబు ఆలోచించాడంట. (Konidela Niharika)
నిహారిక లైఫ్ కూడా బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాడట. పైగా తన కూతురు వేరే వాళ్ళ ఇంటికెళ్లి బాధపడాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నాడు నాగబాబు. కానీ ఈ విషయంపై నాగబాబు కానీ నిహారిక కానీ మరదే విధంగా మెగా ఫ్యామిలీ గాని ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. మెగా అభిమానులు మాత్రం ఈ వార్త నిజమైతే బాగుండు అని ఆశిస్తున్నారు. ఒకవేళ ఇది నిజంగా నిజమా లేదా మెగా హేటర్స్ కావాలని పని కట్టుకుని ఇలాంటి ఫేక్ వార్తలను పుట్టిస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయంపై నాగబాబు లేదా నిహారిక ఎంత త్వరగా స్పందిస్తే వీళ్ళపై ఇలాంటి వార్తలు రావడం అంత త్వరగా ఆగుతాయని భావిస్తున్నారు. మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి.