
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం మెగాస్టార్ అభిమానులు అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక కొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమన్నా, కీర్తి సురేష్ తో కలిసి స్క్రీన్ పంచుకున్న సినిమా భోళాశంకర్ రేపు రిలీజ్ కాబోతుంది. ఆగస్టు ( Keerthy Suresh and Tamannaah in Bhola Shankar ) 11వ తేదీ శుక్రవారం నాడు రిలీజ్ అవుతున్న ఈ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ చూసి అభిమానులు అందరూ ఉర్రూతలూగుతున్నారు. మరోపక్క ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమాపై ఇంకా భారీ అంచనాలు పెరిగాయి.
తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకి మీ రీమేక్ చేసి భోళాశంకర్ సినిమాగా తీశారు. ఈ సినిమాని మొదట పవన్ కళ్యాణ్ తో అనుకున్నారు కానీ.. పవన్ కళ్యాణ్ కి కొన్ని అనివార్య కారణాల వలన నటించడానికి అవ్వక.. ఈ సినిమాను చెయ్యలేదని.. ఆ తర్వాత కాటమరాయుడు సినిమా చేశాడని.. కాటమరాయుడు ( Keerthy Suresh and Tamannaah in Bhola Shankar ) కూడా రీమేక్ కనుక.. ఆ తర్వాత మళ్లీ రీమేక్ చేయడానికి ఇష్టపడకపోవడంతో.. ఈ సినిమాని చిరంజీవి దగ్గరికి తీసుకువచ్చి చేశారని అనేక వార్తలు వచ్చాయి. మరి వీటిలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఈ సినిమా కాటమరాయుడులా కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో కీర్తి సురేష్ చెల్లెల పాత్రలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కీర్తి సురేష్ ఎంత ఫేమ్లో ఉందో ఆమెకు ఎలాంటి అవార్డ్స్ వచ్చాయో మనందరికీ తెలుసు. మహానటి సినిమాతో విపరీతమైన ఫేమ్ సంపాదించుకున్న కీర్తి సురేష్.. ఏ సినిమాలో నటించిన కూడా ఆమెకు ఒక ప్రాముఖ్యత.. ఆ సినిమాకి ( Keerthy Suresh and Tamannaah in Bhola Shankar ) మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగని మహానటి తర్వాత ఆమె ఖాతాలో కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నప్పటికీ.. ఆమెపై క్రేజ్ మాత్రం ఎక్కడా ఎవరికీ తగ్గలేదు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ పాత్ర చాలా బాగుంటుందని.. చాలా మెయిన్ రోల్ తీసుకుంటుందని అంటున్నారు.
అయితే చెల్లెలు పాత్రగా చేస్తున్న కీర్తి సురేష్ ఈ సినిమా కి రెమ్యునిరేషన్ మాత్రం చాలా గట్టిగా తీసుకుందని.. 2.50 కోట్లు తీసుకుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న తమన్నా మూడు కోట్లు తీసుకుందని అంటున్నారు. చెల్లెలు పాత్రకి రెండున్నర కోట్లు ఇస్తే.. హీరోయిన్ పాత్రకి మూడు కోట్లు చాలా తక్కువ అని.. ఇది తమన్నను చాలా అవమానించినట్టు ఉందని.. ఆమె ఎందుకు ఇలా ఒప్పుకోవాలని అభిమానులు వాపోతున్నారు. పూర్వం చెల్లెల పాత్ర అంటే ఏదో ఒక చిన్న హీరోయిన్ ని పెట్టి.. ఆ పాత్రకి రెమ్యూనరేషన్ తక్కువ ఇచ్చి.. మెయిన్ హీరోయిన్ పాత్రలో మెయిన్ స్టార్ హీరోయిన్ ని పెట్టి.. వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చెల్లెలు పాత్రలో వేస్తున్న కీర్తి సురేష్ కూడా పెద్ద స్టార్ హీరోయిన్ కదా.. ఎందుకు ఆమెకు తక్కువ ఇస్తారు అని ఆమె అభిమానులు అంటున్నారు. ఇలా తమన్నా కీర్తి సురేష్ మధ్య బోళాశంకర్ చిచ్చు పెట్టిందని నెటిజనులు వాపోతున్నారు.