Keerthy Suresh propose her love with Akkineni hero: సినిమాల్లో నటీ నటుల వివరాలు, వాళ్ళ జీవితంలో జరిగే విశేషాలు గురించి సినీ అభిమానులు ఎంతో ఆత్రంగా తెలుగుకోవాలని అనుకుంటారు. అందులోను సోషల్ మీడియా వచ్చిన తరవాత ఉన్న వార్త లేని వార్త అన్ని హల్చల్ చేస్తూనే ఉంటున్నాయి. ఇటీవల అక్కినేని హీరోతో, కీర్తి సురేష్ పెళ్లి అంటూ ప్రచారం మొదలయింది. ఈ వార్త మొదట బయటకు రాగానే అందరూ షాక్ అయ్యారు. ఇన్ని రోజుల్లో ఎప్పుడూ ఇలాంటి వార్త సూచనలు కూడా లేవు కానీ, ఇప్పుడు సడన్ గా కీర్తి సురేష్ అక్కినేని హీరో ని ప్రేమించడం ఏమిటి? పెళ్లి చేసుకోవడం ఏమిటి? అసలు కీర్తి సురేష్ అంతగా ఇష్టపడే ఆ అక్కినేని హీరో ఎవరు అని అందరూ షాక్ అయ్యారు. ఆ తరవాత తెలిసినది అసలు విషయం ఏమిటంటే ఆ పెళ్లి నిజం కాదని..
మెగా స్టార్ చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా భోళా శంకర్. ఈ సినిమాలో కీర్తీ సురేష్ కూడా నటిస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికీ చెల్లిగా నటిస్తుంది. సినిమా మొత్తం సిస్టర్ సెంటిమెంట్ తో నడుస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్ కి అక్కినేని హీరో సుశాంత్ వరసకి బావా అవుతాడంట. వీళ్లిద్దరికీ ఈ సినిమాలో పెళ్లి అవుతుందని, అంతే కాదు ఈ సినిమాలో విలన్ కూడా సుశాంత్ ( Keerthy Suresh propose her love with Akkineni hero ) అని వార్తలు వస్తున్నాయి. అంతే అక్కడ నుంచి అక్కినేని హీరోతో కీర్తి సురేష్ కి పెళ్లి అంటూ ప్రచారం మొదలయ్యింది. ఈ ప్రచారం వలన సినిమాకి మాత్రం మంచి ప్రమోషన్ అవుతుంది. అయితే ఈ ప్రచారం మొదలయిన దగ్గర నుంచి ఈ సినిమా స్టోరీ ని కూడా జనాలు ఊహించేసుకుంటున్నారు.
ఇంతకీ సినిమా కథని ఎలా అల్లుకుంటున్నారంటే.. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలు అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి అన్నీ తానే అయ్యి పెంచుతాడు. కీర్తి సురేష్ మాత్రం అందంతో పాటు, అల్లరి అమాయకత్వం ఉన్న అమ్మాయి. అన్న చేతిలో అల్లారు ముద్దుగా పెరిగిన కీర్తి సురేష్ కి ఎలాంటి కష్టాలు, కల్మషాలు తెలీవు. ఆమె తన మేనత్త కొడుకు సుశాంత్ ని ప్రేమిస్తాది. సుశాంత్ చాల మంచి వాడిలా, ఆధునిక మనస్తత్వం ఉన్న వ్యక్తిగా కాలేజీ లో చదువుకుంటున్న కీర్తి సురేష్ దగ్గర బాగా నటిస్తాడు. కీర్తి సురేష్ కాలేజీ లో సుశాంత్ కి స్వయంగా వెళ్లి తన ప్రేమని ప్రపోజ్ చేస్తాది. దానైకి సుశాంత్ నో అంటాడు. నీకు తగ్గవాడిని కాదంటూ నో అంటాడు. దానితో కీర్తి సురేష్ తన ప్రేమని బ్రతికించమని అన్నని కోరుకుంటాది. అక్కడ నుంచి అసలు సినిమా మొదలవుతాది.
చెల్లెలని బాధపెట్టడం ఇష్టం లేక, కోరుకొగానే వరమిచ్చినా బోళా శంకరుడిలా ఆ కోరిక తీర్చడానికి, సుశాంత్ విలనిజం చెల్లికి తెలియనీయకుండా, కుటుంబ గొడవలు అన్నీ చిరునే పడి.. చివరికి చెల్లి ప్రేమను గెలిపిస్తాడంట. ఇలా ఎవరికి నచ్చిన సినిమా స్టోరీ వాళ్ళు అల్లేస్తున్నారు. ఇంతకీ సినిమా వచ్చాక అసలు స్టోరీ తెలుస్తాది మరి..