Keerthy Suresh : సినిమా ఇండస్ట్రీలో హీరోలు చాలా ఎక్కువకాలం కంటిన్యూస్గా ఉంటారు. హీరోయిన్స్ మాత్రం ఒక స్టేజ్ తర్వాత వాళ్ళ కుటుంబం కోసం సినిమాలకు దూరం అయిపోతారు.. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు గాని, వాళ్ళ తోబుట్టువులు గాని సినిమా రంగంలోకి మళ్లీ అడుగుపెడతారు. వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత మళ్లీ అదే ( Keerthy Suresh and Chiranjeevi ) హీరోలతో నటించే అవకాశం అయితే కొన్నిచోట్ల ఉంది. అలాగే కొంతమంది హీరోయిన్స్ తండ్రి తోని కొడుకుతోనూ కూడా హీరోయిన్గా నటించిన వాళ్లు ఉన్నారు. అలా వాళ్ళు ట్యాలంట్ ను బట్టి.. వాళ్ళు ఎంత కాలం సినిమా రంగంలో యంగ్ గా నిలబడగలిగితే అన్ని తరాలతో నటించే అవకాశం దొరకడం అనేది చాలా సహజం.
అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా బోళాశంకర్ 11 ఆగస్టున విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటించిన విషయం తెలుసు. మహానటిగా నటించి మనందరిని అలరించిన కీర్తి సురేష్ ఇప్పుడు చిరంజీవికి చెల్లిగా నటించి ఇంకా అలరించేందుకు అతి ( Keerthy Suresh and Chiranjeevi ) తొందరలోనే మన ముందుకు వస్తుంది. అయితే చిరంజీవికి కీర్తి సురేష్ చెల్లిగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే కానీ.. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం కీర్తి సురేష్ ఇస్తున్న ఇంటర్వ్యూలో.. మనలో చాలామందికి తెలియని ఒక విషయాన్ని ఆమె బయట పెట్టింది. చిరంజీవి గారితో కలిసి ఆయన చెల్లిగా స్క్రీన్ పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని కీర్తి సురేష్ చెప్పింది.
అంతేకాకుండా ఆయన గురించి నాకు ముందే బాగా తెలుసు. ఎందుకంటే.. ఆయనతో నా తల్లి 1980లో వచ్చిన పున్నమినాగు సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా నటించింది. ఇక ఇప్పుడు నేను భోళాశంకర్ సినిమాలో ఆయనకు చెల్లిగా నటిస్తున్నాను. ఆయన ఎనర్జీ, డేడికేషన్, ఇలాగే సెట్లో ఇచ్చిన సలహాలు, సూచనలు గురించి ( Keerthy Suresh and Chiranjeevi ) అమ్మ నాకు ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. చాలా కేరింగ్ గా చూసుకుంటారని కూడా అమ్మ నాకు చెప్పింది. అయితే నేను చిరంజీవి గారు షూటింగ్లో పాల్గొనేటప్పుడు.. ఖాళీ టైంలో చిరంజీవి గారికి.. మా అమ్మకి ఆయన ఏం చెప్పారో అవన్నీ నేను ఆయనతో ముచ్చటించాను. అప్పుడు ఆయన మీ అమ్మ ఇంతేనా చెప్పారు.
నేను తనతో ఇంకా చాలా చెప్పానని అన్నారు. అప్పట్లో మా అమ్మకు ఆయన చెప్పిన జాగ్రత్తలు, కెరీర్లో ఎలా కష్టపడాలి అనేక విషయాలని మంచి సలహాలను ఇచ్చారని చెప్పారు. అలాగే ఇప్పుడు నాకు మళ్ళీ ఆయన చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లోనే మా అమ్మతో ఆయన ఒక గురువులా, మంచి స్నేహితుడిలా ఎంతో చక్కగా బిహేవ్ చేశారని మా అమ్మ నాకు చెప్పేది. ఇప్పుడు కూడా ఆయనతో నేను మాట్లాడుతుంటే.. నాకు కూడా అలాగే చెప్తున్నారు అంటూ.. ఎన్నో తెలియని విషయాలను చక్కగా బయటికి రివ్యూ చేసింది కీర్తి సురేష్. ఇక బోలో శంకర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై మెగా అభిమానులందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ వరకు సినిమాపై సినీ అభిమానులు అందరికీ పాజిటివ్ టాక్ ఉంది. మరి సినిమా చూసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి..