Home Cinema Keerthy Suresh: అదిరిపోయే ట్వీట్ చేసిన కీర్తి సురేష్.. హహహ.! నా జీవితానికి మొగుడే లేడంటూ...

Keerthy Suresh: అదిరిపోయే ట్వీట్ చేసిన కీర్తి సురేష్.. హహహ.! నా జీవితానికి మొగుడే లేడంటూ షాకింగ్ కామెంట్స్..

Keerthy Suresh Shocking Comments: ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి పరిచయమైన ఈ మలయాళీ కుట్టి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు. తన అందంతో, తన నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటిగా మంచి ముద్ర అయితే వేసుకుంది. ఇక ఇటీవల విడుదలైన దసరా చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన బామ కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అంటూ కుప్పలు తెప్పలుగా ఇష్టం వచ్చిన వార్తలైతే ఇటు నెట్టింట అటు మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఆ మధ్యలో ఓ వ్యక్తితో కొన్ని ఫోటోలు షేర్ చేసుకున్న కీర్తి సురేష్ ఇక తనే ఆమె చేసుకోబోయే పెళ్ళి కొడుకంటూ ఫిలిం నగర్ లో కీర్తి సురేష్ పై రకరకాల వార్తలు జోరుగా షికారు కొట్టాయి.

See also  Nithya Menon: పెళ్ళైన హీరోతో మళ్ళీ పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యా..??

keerthy-suresh-made-shocking-comments-on-rumours

కీర్తి సురేష్ ఫర్హాన్ బిన్ లికాయత్ ఫోటోలు షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపింది. దాంతో ఇండస్ట్రీలో పలు గ్రాసిప్స్ కు చర్చనీయాంశంగా మారిపోయింది కీర్తి సురేష్. అయితే అంతకు ముందేమో తన చిన్ననాటి స్నేహితుడు కోటీశ్వరుడిని వివాహం చేసుకోబోతుంది అంటూ ఎన్నో రకాల వార్తలను పుకార్లను పుట్టించారు కొందరు ఆకతాయులు. ఇక ఆ తర్వాత.. ఇటీవల తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఫర్హాన్ ఎవరో కాదు అతడే ఆమె చిన్ననాటి స్నేహితుడు బిలియనీర్ అతడినే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందంటూ మరికొన్ని రకాల వార్తలు అయితే వైరల్ చేశారు. (Keerthy Suresh Shocking Comments)

keerthy-suresh-made-shocking-comments-on-rumours

ఇక వీటన్నిటిని ఓపిక పట్టిన కీర్తి సురేష్ తన ట్విట్టర్ వేదికగా తన లైఫ్ లో మిస్టరీ మాన్ ఉన్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి వస్తున్న వార్తలపై తాజాగా మహానటి కీర్తి సురేష్ స్పందించింది. మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి. ప్రస్తుతానికైతే అలాంటి వారెవరు నా జీవితంలో లేరని తెలిపింది కీర్తి సురేష్.. ఈ మేరకు సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్ ను ఈ వార్తల్లోకి లాగారా నిజమైన మిస్టరీ మ్యాన్ ను సమయం వచ్చినప్పుడు తప్పకుండా నేనే పరిచయం చేస్తాను. అప్పటి వరకు చిల్ గా ఉండండి.

See also  Balagam : అవతార్ తో అక్కడ పోటీ పడతున్న బలగం..

keerthy-suresh-made-shocking-comments-on-rumours

ఒక్కసారి కూడా సరైన వార్తలు రావడమే లేదు అంటూ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ బదులిచ్చింది. దాంతో మీమర్స్ రాయుళ్లకు గుణపం దింపినట్లయ్యింది.. ప్రస్తుతం కీర్తి సురేష్ కెరియర్ విషయానికి వస్తే బాక్సాఫీస్ వద్ద దసరా చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా తన గుర్తింపును పదిలం చేసుకుంది. ప్రస్తుతం దసరా హిట్ ను ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి సినిమా బోలా శంకర్ లో మెగాస్టార్ కు సోదరిగా నటిస్తోంది. ఇక ఇవే కాకుండా పలు ఇతర భాష చిత్రాలకు కూడా కీర్తి సురేష్ ఓకే చెప్పిందట. ఇంత బిజీ షెడ్యూల్లో కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ఎంత వరకు నిజం అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది..