Home Cinema Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి గురించి స్వయంగా తన తండ్రి పూర్తి క్లారిటీ.....

Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి గురించి స్వయంగా తన తండ్రి పూర్తి క్లారిటీ.. త్వరలో ఇది గుడ్ న్యూస్ కానుందా.?

Keerthy Suresh: తెలుగు చిత్ర పరిశ్రమలో నేను శైలజ అనే చిత్రంతో అడుగుపెట్టిన కీర్తి సురేష్ తర్వాత తనదైన శైలిలో నటన ప్రతిభను చాటుతూ వరుస అవకాశాలు పొందుతూ ఆ తర్వాత నాని సరసన నేను లోకల్ చిత్రంలో నటించిన కీర్తి సురేష్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ తనకు నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి చిత్రమే.. అంతకు ముందుకు నటించిన ఆ చిత్రాలతో మంచి హీరోయిన్ అనిపించుకున్నప్పటికీ మహానటి సినిమాలో నటించిన తర్వాతే ఇండియా లెవెల్ లో హీరోయిన్ గుర్తింపు తెచ్చుకుంది. ఇదే కాకుండా ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. (Keerthy suresh father reveals)

keerthy-suresh-father-reveals-when-is-her-daughter-marriage-happening

అలాంటి కీర్తి సురేష్ నాని సరసన దసరా చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో కూడా నటించింది. ఇక ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అయింది. అయితే ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి కీర్తి సురేష్ గురించి నెట్టింట ఓ వార్త అయితే తెగ చక్కర్లు కొడుతుంది. ఆ విషయం మరి ఏమిటో కాదు ఆమె పెళ్లి. ఆమె పెళ్లి పై ఇప్పటికే ఎన్నోసార్లు కీర్తి సురేష్ తల్లి వివరణ ఇచ్చినప్పటికీ.. నెటిజన్స్ మాత్రం ఆమె తల్లి మాటలను నమ్మడమే లేదు.. ఇంకా ఇటీవలే వైరల్ అయిన ఓ విషయం బిజినెస్ మాన్ ఫర్హాన్ బర్త్ డే రోజు కీర్తి సురేష్ అతడికి శుభాకాంక్షలు తెలపడంతో.. మరి అదే విధంగా అతనితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో..

See also  Rajamouli : రాజమౌళి ఆధ్యాత్మిక టూర్ వేయడానికి అసలు కారణం అదా.. ఇక సంచలనమే..

keerthy-suresh-father-reveals-when-is-her-daughter-marriage-happening

ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. ఇక మీమర్స్ రాయుళ్ళు ఇతడే కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ అని, అతడే ఆమె పెళ్లి చేసుకోబోయే బిజినెస్ మాన్ అని.. గతంలో వచ్చిన వార్తలలో కూడా వివాహం చేసుకోబోయేది ఈ బిజినెస్ మాన్ అని.. ఇలా ఎన్నో రకాల వార్తలు నెట్టింట సృష్టించి విపరీతంగా వైరల్ చేశారు. ఇంకా ఈ వార్తలన్నీ కూడా కీర్తి సురేష్ ఖండిస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా.. ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరనే విషయాన్ని నేనే మీకు స్వయంగా వెల్లడిస్తాను. కానీ మీరు ఒక్క సారైనా కరెక్ట్ గా గెస్ చేయడమే లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా కీర్తి సురేష్ తండ్రి కూడా కీర్తి సురేష్ వివాహం, ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి కొన్ని విషయాలు వివరంగా వెల్లడించాడు. (Keerthy suresh father reveals)

See also  Krithi Shetty: కృతి శెట్టి హీరోయిన్ కాకముందు డబ్బు కోసం ఇలాంటి పనులు చేసిందా?

keerthy-suresh-father-reveals-when-is-her-daughter-marriage-happening

అసలు మా అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకోవడమే లేదు అని.. ఇక ఇటీవల బర్త్ డే విషెస్ చెప్పి ఆ ఫోటోలో కీర్తి సురేష్ పక్కన ఉన్న అబ్బాయి ఫర్హాన్ అని ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్.. ఇదే కాకుండా వాళ్ళిద్దరి మధ్య అటువంటి ఎలాంటి సంబంధం లేదని.. ఒకవేళ మా అమ్మాయి పెళ్లి చేస్తే కనుక కచ్చితంగా మీడియాకి అలాగే తన అభిమానులకి ముందుగానే నేనే చెప్తాను అంటూ.. తన తండ్రి వెల్లడిస్తూ ఇలా లేనిపోని ప్రచారాలు వేస్తూ మా కుటుంబాన్ని వార్తలలోకి లాగకండి.. మాకు కాస్త ఇబ్బందిగా ఇబ్బందికరంగా అవుతుంది అంటూ కీర్తి సురేష్ పై వస్తున్న పెళ్లి వార్తలకు మరొకసారి పులిస్టాప్ పెట్టేసాడు ఆమె తండ్రి..