Home Cinema అత్యధిక పన్ను చెల్లించిన హీరోయిన్.. చేసింది ఒక్క సినిమానే కానీ కట్టిన పన్ను 20 కోట్లు..

అత్యధిక పన్ను చెల్లించిన హీరోయిన్.. చేసింది ఒక్క సినిమానే కానీ కట్టిన పన్ను 20 కోట్లు..

kareena-kapoor-makes-a-record-as-highest-tax-paying-actress-in-india-with-20-crore-tax-paid

మన టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ ఎలాగో, బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ అలా అన్నమాట. ఈ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి ఇండస్ట్రీ లోకి వచ్చిన ప్రతీ ఒక్కరు గ్రాండ్ సక్సెస్ అయ్యారు. వారిలో కరీనా కపూర్ కూడా ఒకరు. తన అద్భుతమైన నటన, కుర్రాళ్ళు చూపులు తిప్పుకోలేని అందం తో సినీ రాజ్యాన్ని ఆమె దాదాపుగా రెండు దశాబ్దాలు నెంబర్ 1 హీరోయిన్ గా ఏలింది. బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది(highest tax Paying Actress). అలాంటి స్టార్ ఇమేజి ఉన్న హీరోయిన్ సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు బాగా దూరమైంది.

See also  Niharika konidela: వరద బాధితులకు భారీ విరాళం అందించి ట్రోల్ కి గురవుతున్న నిహారిక..

కేవలం వ్యాపారాల మీదనే ఆమె ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అయితే పెళ్లి తర్వాత ఒక బిడ్డకి జన్మని ఇచ్చాక ఆమె మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ లో మిగిలిన హీరోయిన్స్ లాగ క్యారక్టర్ రోల్స్ చేయకుండా, మెయిన్ హీరోయిన్ పాత్రలు మాత్రమే చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. అయితే ఈ ఏడాది కేవలం ఆమె ఒకే ఒక్క సినిమా చేసింది(highest tax Paying Actress).

కానీ పన్ను మాత్రం ఏకంగా 20 కోట్ల రూపాయలకు పైగానే కట్టింది. దీనిని బట్టి ఆమె ఒక్క సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. కానీ అది కేవలం సినిమా రెమ్యూనరేషన్ ద్వారా కట్టిన పన్ను మాత్రమే కాదట, కమర్షియల్ యాడ్స్ తో పాటు, తనకి సంబంధించిన కొన్ని వ్యక్తిగత వ్యాపారాల నుండి వచ్చిన ఆదాయంతో కలిపి కట్టిన పన్నులట. దీంతో అత్యధిక పన్నులు చెల్లించే నెంబర్ 1 హీరోయిన్ గా కరీనా కపూర్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈమె తర్వాత కియారా అద్వానీ 12 కోట్ల రూపాయిల పన్ను చెల్లించి రెండవ స్థానంలో నిలిచింది.

See also  Chiranjeevi - Nagarjuna : చిరంజీవి నాగార్జునలు హీరోయిన్స్ తో ఎంత దారుణంగా ఎంజాయ్ చేస్తారో వైరల్ అయిన వీడియో..

ఈమె ఇప్పుడు ఇండియా వైడ్ మోస్ట్ బిజీ గా ఉండే హీరోయిన్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూనే తెలుగులో కూడా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆమె కలిసి నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఈమె తర్వాత ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ 11 కోట్ల రూపాయిల పన్ను చెల్లించి మూడవ స్థానం లో నిల్చింది. ఇక హీరోలలో షారుఖ్ ఖాన్ 95 కోట్ల రూపాయిల పన్ను కట్టగా, సల్మాన్ ఖాన్ 75 కోట్ల రూపాయిల పన్ను చెల్లించాడు. వీరందిరిలో కరీనా కపూర్ ఎక్కువగా హైలైట్ అయ్యింది.