Home Uncategorized Kalyan Dev: విడాకులపై క్లారిటీ ఇచ్చి ఎమోషనల్ అయిన కళ్యాణ్ దేవ్..!!

Kalyan Dev: విడాకులపై క్లారిటీ ఇచ్చి ఎమోషనల్ అయిన కళ్యాణ్ దేవ్..!!

Kalyan Dev: మెగాస్టార్ చిరంజీవి అల్లుడైన తర్వాత సినిమాలలో ప్రయత్నం చేసిన కళ్యాణ్ దేవ్ కు మెగా అభిమానులు అండగా నిలిచారు. కానీ ఎప్పుడైతే మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ నుంచి కళ్యాణ్ దేవ్ విడిపోతున్నారని వార్తలు వస్తున్నాయో అప్పటి నుంచి కళ్యాణ్ దేవ్ యొక్క సినీ జీవితం కూడా పతనం అయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే చాలా కాలంగా శ్రీజ కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకుంటుందంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున న్యూస్ లో వస్తున్నా… దానికి సంబంధించి మెగా ఫ్యామిలీ మాత్రం ఏ విధమైన స్పందన తెలపలేదు.

See also  Singer Mangli: అమాతం రెమ్యునరేషన్ పెంచేసిన మంగ్లీ ఇప్పుడు ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా.?

kalyan-dev-gets-emotional-after-giving-clarity-on-divorc

దీంతో డైవర్స్ నిజమే అని నెటిజెన్స్ నమ్ముతున్నారు. శ్రీజ, కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకుంటుందని అదేకాక మూడో పెళ్లి కూడా సిద్ధమయ్యిందంటూ సినీ పరిశ్రమలో జోరుగా వార్తలు వ్యాపించాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో శ్రీజ, కళ్యాణ్ పెడుతున్న పోస్టులు కూడా విడాకుల విషయాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఇదేకాక మొదట శ్రీజ తన సోషల్ మీడియా ఖాతా నుంచి కళ్యాణ్ దేవ్ పేరును తొలగించడంతో వీరు డైవర్స్ తీసుకుంటున్నారని రొమాన్స్ రూమర్స్ మరింత పెరిగాయి.

See also  Bro Movie: బ్రో చిత్రానికి తప్పని తిప్పలు. ఆందోళనలో ఫ్యాన్స్.

kalyan-dev-gets-emotional-after-giving-clarity-on-divorc

ఇదే కాక గత కొద్ది కాలంగా మెగా ఫ్యామిలీతో కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడం రూమర్స్ కి మరింత బలాన్ని ఇచ్చింది. శ్రీజ తో గొడవలు అని మ్యాటర్ బయటకు వచ్చిన ఆ తర్వాత కూడా కళ్యాణ్ దేవ్ రెండు సినిమాలు విడుదలయ్యాయి. అవే కిన్నెరసాని, సూపర్ మచ్చి అయితే ఈ రెండు సినిమాలకు మెగా ఫ్యామిలీ ఎలాంటి ప్రమోట్ చేయకపోవడం మరిన్ని అనుమానాలకు తెరలేపింది.

kalyan-dev-gets-emotional-after-giving-clarity-on-divorc

ఇదిలా ఉంటే కొన్ని పరిస్థితుల నడుమ కళ్యాణ్ దేవ్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు మరింత వైరల్ అవుతుంది. ఫిబ్రవరి 11వ తేదీన తన కూతురు నవిష్క పుట్టినరోజు కావడంతో ఓ ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశాడు. కళ్యాణ్ దేవ్ నవిష్కతో తన జ్ఞాపకాలు తలుచుకుంటూ మిస్సింగ్ యు అని కామెంట్ చేశారు. దీంతో కళ్యాణ్ దేవ్, శ్రీజా విడాకుల మేటర్ మళ్ళీ తెరపైకి వచ్చి ఇద్దరు విడిపోయారు కాబట్టి ఇలా కూతురు జ్ఞాపకాలతో ఎమోషనల్ అయ్యారంటూ కామెంట్ చేస్తున్నారు..