
Kalpana Rai: కల్పనా రాయ్.. ఈ పేరు వినగానే అందరికీ నవ్వు వచేస్తాది. ఆమె శరీరంతో గాని, ముఖంతో గాని దేనితోనే సంబంధం లేకుండా సినిమాల రంగంలో నటించి ఎందరినో నవ్వించింది. చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ.. అసలు ( Kalpana Rai helped so many people ) కల్పనా రాయ్ ఎన్ని సినిమాలు నటించింది కూడా తెలిస్తే ఆశ్చర్యపోతారు. 450 సినిమాలు దగ్గర దగ్గర నటించింది. జంబలకడిపంబ సినిమాతో ఆమెకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. కల్పనా రాయ్ అనగానే అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. పాత్రలు చిన్నవే, ఆమె సంపాదన కూడా తక్కువే అయినా కూడా.. ఎప్పుడూ కూడా డబ్బు కోసం వెంపరలాడే మనిషి కాదు.
కల్పనారాయ్ తనకంటూ ఒక కుటుంబం లేకుండా అలా ఒంటరిగా బ్రతుకుతూ వచ్చింది. ఆమె సంపాదించిన డబ్బుని ఆమె చుట్టూ ఉన్న నలుగురికి పంచుకుంటూ వచ్చింది. ఎవరికీ ఏ కష్టం అన్న తన దగ్గర ఉన్న కొంచెం నుంచే తీసి ( Kalpana Rai helped so many people ) ఇచ్చేది అంట. చిన్న చిన్న సంపాదనైనా.. పెద్ద మనసుతో ఎందరో చిన్న చిన్న వాళ్ళని ఆదుకునేదంట. అలాంటి మనస్తత్వం ఉన్న ఆమె చివరి రోజుల్లో డబ్బు కోసం చాలా కష్టాలు పడిందంట. అసలు ఈ మాట వింటేనే చాలా బాధగా అనిపిస్తుంది. 450 సినిమాలు నటించిన ఒక కమెడియన్ చివరి రోజుల్లో డబ్బు కోసం కష్టాలు పడిందంటే ఎవరికైనా బాధే కదా..
2008వ సంవత్సరంలో ఆమె కన్ను మూసింది. ఆమె మరణానికి ముందు ఆర్థిక ఇబ్బందులతో చాలా సతమతమైందట. ఎందరికి దానం చేసినా కూడా ఆ తీసుకున్న వాళ్లు కూడా కనీసం కొంచెం కొంచెం గా కూడా ఆమెకు తిరిగి సహాయం చేయలేదంట. చివరికి ( Kalpana Rai helped so many people ) నానా కష్టాలు పడి ఆమె చనిపోయిన తర్వాత ఆమె దహన సంస్కారాలకు కూడా డబ్బు లేకుండా పోయిందంట. అలాంటి టైంలో సినిమా ఇండస్ట్రీ 10,000 రూపాయలు ఆమె దహన సంస్కారాలకి ఖర్చుపెట్టి మరి పూర్తి చేసిందంట. ఆమె స్టోరీ వింటే.. ఆ నలుగురు సినిమాకి అచ్చం ఆపోజిట్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ నలుగురు సినిమాలో కుటుంబానికి ఎంత చేసినా కూడా వాళ్లకు విశ్వాసం ఉండదు.
బయట జనాలకు ఎవరు కష్టంలో ఉన్నా చేయగలిగినంత సాయం చేస్తాడు ఆ సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్. చిన్న చిన్న మొత్తమే ఆయన పెద్ద మనసుతో అందరిని ఆదుకునే మనస్తత్వం ఉన్నవాడిగా చూపిస్తారు. చివరికి కుటుంబంలో పిల్లలు పట్టించుకోకపోయినా చనిపోయిన తర్వాత ఆ నలుగురు అంటూ అతని ద్వారా ( Kalpana Rai helped so many people ) సహాయం అందుకున్న వాళ్ళందరూ మోసుకొని వెళ్తారు. అలాంటివి కల్పనా రాయ్ జీవితంలో అచ్చం దానికి ఆపోజిట్ లో.. కనీసం సాయం అందుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ దహన సంస్కారాలకు కూడా సాయం చేయకుండా తప్పించుకున్నారని ఆమె అభిమానులు ఎంతో బాధపడుతున్నారు..