Home Cinema Kajal Agarwal: అల్లు అర్జున్ అంటే ప్రాణం కానీ ఆ అదృష్టం లేదు.. కాజల్ అగర్వాల్...

Kajal Agarwal: అల్లు అర్జున్ అంటే ప్రాణం కానీ ఆ అదృష్టం లేదు.. కాజల్ అగర్వాల్ కామెంట్స్..

Kajal About Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి నడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే కోట్లాది మంది కుర్రాళ్ల మనసుల్ని దోచుకొని, స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి కాజల్ అగర్వాల్. ఈమె ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘లక్ష్మీ కళ్యాణం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయినా, కాజల్ అగర్వాల్ కి అవకాశాలు రాకుండా పోలేదు, వరుసగా కుర్ర హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ దక్కింది.

kajal-about-allu-arjun

అలా ‘చందమామ’ చిత్రం తో కెరీర్ లో తొలి సూపర్ హిట్ సినిమాని అందుకున్న కాజల్ అగర్వాల్ ఈ చిత్రం తర్వాత ఆమె రామ్ చరణ్ మరియు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘మగధీర’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడం తో కాజల్ కి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోలందరి సరసన నటించి సౌత్ లోనే నెంబర్ 1 హీరోయిన్ గా నిలిచిపోయింది. మరో విశేషం ఏమిటంటే, ఈమె ప్రస్తుత జనరేషన్ స్టార్ హీరోలతో పాటుగా నిన్నటి తరం హీరోలైన చిరంజీవి మరియు బాలకృష్ణ వంటి వారితో కూడా సినిమాలు చేస్తుంది.

See also  Rakul Preet Singh: ఎంత అవకాశాలు లేకపోతే మాత్రం.. రకుల్ గురించి వాళ్ళు అలా ఆలోచిస్తారా?

allu-arjun-kajal-agarwal

ఇక గౌతమ్ అనే అతనిని ప్రేమించి పెళ్లాడిన కాజల్ అగర్వాల్(Kajal About Allu Arjun), ఇప్పుడు ఒక మగబిడ్డకు జన్మని కూడా ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆమె సినిమాల్లో బిజీ అయ్యేందుకు ఒక రేంజ్ వర్కౌట్స్ చేసి సన్నగా ఫిట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉండగా చాలా కాలం తర్వాత కాజల్ అగర్వాల్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అభిమానులతో లైవ్ చార్ట్ సెషన్ ఏర్పాటు చేసింది. ఈ చాట్ లో ఆమెని ఒక అల్లు అర్జున్ అభిమాని ‘మా బన్నీ గురించి చెప్పండి’ అని అడగగా, అప్పుడు కాజల్ అగర్వాల్ దానికి సమాధానం చెప్తూ ‘అల్లు అర్జున్ నాకు ఎంతో ఇష్టమైన కో స్టార్, నా మనసుకు బాగా దగ్గరైన ఇద్దరు ముగ్గురు కో స్టార్స్ లో ఆయన కూడా ఒక్కడు.

See also  Brahmaji : బ్రహ్మాజీ కొడుక్కి కుక్కతో పెళ్లి చేస్తే.. కోర్టుకెళ్లిన బ్రహ్మాజీ!

kajal-agarwal

అల్లు అర్జున్ లో నాకు కష్టపడే తత్త్వం అంటే బాగా ఇష్టం’ అని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. అల్లు అర్జున్ గురించి ఆమె ఇంత అభిమానంగా మాట్లాడడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం భగవత్ కేసరి అనె సినిమాలో నటిస్తుంది. బాల కృష్ణ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. తల్లి అయిన తరువాత కాజల్ కి ఇది మొదటి సినిమా కావటం విశేషం. చూదాం మరి ఈ సినిమాతో హిట్ కొట్టి కాజల్ మల్లి రేసు లోకి వస్తుందేమో.