Home Cinema Jr NTR – Koratala Siva : చిరంజీవి వలన ఎన్టీఆర్ కెరియర్ ని పాడు...

Jr NTR – Koratala Siva : చిరంజీవి వలన ఎన్టీఆర్ కెరియర్ ని పాడు చేస్తున్న కొరటాల!

jr-ntr-upcoming-movie-director-koratala-siva-big-twist-in-movie

Jr NTR – Koratala Siva : రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ముల్టీ స్టార్ సినిమా తరవాత.. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. ఈసినిమా కొరటాలశివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా రూపొందుతుంది. ఎప్పుడో స్టార్ట్ ( Jr NTR upcoming movie director koratala siva big twist in movie )  అవ్వాల్సిన ఈ సినిమా షూటింగ్.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్ లో ఎన్టీఆర్ చాలా బిజీ గా ఉండటం వలన కొంత లేటుగా ఇటీవల స్టార్ట్ చేసారు. ఈ సినిమా షూటింగ్ మొదటి క్లాప్ కొట్టడానికి రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతుంది. ఈ సినిమా పై ఎన్టీఆర్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.

See also  Rajamouli : మహేష్ రాజమౌళి మూవీ ఫస్ట్ లుక్ విడుదల తేదీ వచ్చేసింది..

jr-ntr-upcoming-movie-director-koratala-siva-big-twist-in-movie

ఎన్టీఆర్ కెరియర్ లో ఆర్ఆర్ఆర్ తో చాల పెద్ద అడుగు ముందుకు వేసాడు. ఇప్పుడు అతనికి అనేక టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ మంచి ఆఫర్ తో ముందుకు వస్తున్నాయి. ఈ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు.. మళ్ళి పెద్ద ఎత్తున ఎత్తుకు ఎదగడానికి ఉపయోగపడతాయి. కొరటాలశివ ( Jr NTR upcoming movie director koratala siva big twist in movie ) దర్శకత్వంలో సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా రావడం సినిమాకి మరొక ప్లస్ కూడా. ఎందుకంటే తెలుగులో జాన్వీ కి ఇది తొలి సినిమా కాబట్టి. అలాగే సినిమా పై రోజుకొక వార్త ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని నిజాలు ఉంటె.. కొన్ని రూమర్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా కొరటాల మరొక ట్విస్ట్ ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి.

See also  Prabhas : వయనాడ్‌కు ప్రభాస్ ఇచ్చిన విరాళం ఎంతో తెలిస్తే ఆ మాట ఖచ్చితంగా అంటారు..

jr-ntr-upcoming-movie-director-koratala-siva-big-twist-in-movie

ఎన్టీఆర్ 30 సినిమాలో ఇంతవరకు విలన్ ఎవరన్నది తెలియలేదు. ఎవరినైనా బాలీవుడ్ నుంచి మంచి విలన్ ని తీసుకునివస్తాడు కొరటాల అని అందరు భావిస్తుంటే.. ఇప్పుడు కొత్తగా ఒక వార్త ఎన్టీఆర్ అభిమానులకు షాక్ ఇచ్చింది. అదేమిటంటే.. ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ ఎవరో కాదు, ఎన్టీఆర్ అంట. ఇప్పటికే ఎన్టీఆర్ విలన్ గా నటించిన సినిమాలు పెద్దగా హిట్ అయినట్టు అనిపించలేదు. అలాగే.. ఎన్టీఆర్ ని విలన్ గా చూడాలనే మూడ్ లో కూడా అభిమానులు లేరు. ఎన్టీఆర్ కరెక్ట్ గా చాలా పెద్ద స్థాయికి వెళ్లే సమయంలో కొరటాలకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటున్నారు.

jr-ntr-upcoming-movie-director-koratala-siva-big-twist-in-movie

అసలు కొరటాల కెరియర్ లో మొన్నటి వరకు అట్టర్ ఫ్లాప్ సినిమాలు అనేవి లేవు. అలాంటిది చిరంజీవితో వచ్చిన సినిమా ఆచార్య సినిమాతో అట్టర్ ఫ్లాప్ రుచిని చూడక తప్పలేదు. అదికూడా ఈ సినిమాకి సగం ఇతను డైరెక్ట్ చేస్తే.. సగం బలవంతంగా చిరంజీవి డైరెక్ట్ చేయడం వలన సినిమా అంతలా పోయిందనే వార్తలు వచ్చాయి. ఒక్కసారిగా కొరటాలకు అంత ఫ్లాప్ చూడటంతో ఏమి ఆలోచిస్తున్నాడో ఏమిటో అని ఎన్టీఆర్ అభిమానులు భయపడుతున్నారు. చిరంజీవి తో వచ్చిన ఫ్లాప్ ప్రభావం ఎన్టీఆర్ సినిమా లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే.. మా హీరో మంచి ఫేమ్ లో ఉన్నప్పుడు.. సినిమా తేడా అయితే చాల లాస్ అని అంటున్నారు. ఇంతకీ ఆ వార్తలో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ, అభిమానులు మాత్రం భయపడతున్నారు.