Home Cinema Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ అదిరింది.

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ అదిరింది.

jr-ntr-movie-adhurs-re-release-trailer-released

Jr NTR : ఏదైనా ఒక కొత్త సినిమా రిలీజ్ అంటే ఆ హీరో అభిమానులు అందరూ ఎంతో ఆనందంతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కోసం ఎదురు ( Jr NTR movie Adhurs re-release ) చూస్తున్నారు. ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? అయితే వీళ్ళు ఎదురు చూస్తున్న సినిమా కొత్తది కాదు. 2010లో రిలీజ్ అయిన సినిమా అదుర్స్. ప్రస్తుతం సినిమా ట్రెండ్ లో చూస్తే పాత సినిమాల మళ్లీ రీ రిలీజ్ చేసి.. అభిమానుల నుంచి కొత్తగా మళ్లీ బిజినెస్ జరుగుతుంది.

Jrntr-adhurs-movie.vinayak

అయితే కొంతమంది హీరోలు అయితే మాత్రం.. వాళ్ళ సినిమాలు చేస్తే ఆ సినిమాల వల్ల వచ్చిన డబ్బుల్ని కొన్ని చారిటీలకు ఇచ్చి ఖర్చు చేస్తున్నారు. ఇలా కొన్ని జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ( Jr NTR movie Adhurs re-release ) ఒకటి రీ రిలీజ్ అవుతుంది. 2010 సంక్రాంతి కానుక విడుదలైన అదుర్స్ సినిమా ఇప్పుడు మళ్లీ రిలీజ్ అవుతుంది.ఎన్టీఆర్ హీరోగా, నయనతార, షీలా హీరోయిన్స్ గా రూపొందిన అదుర్స్ సినిమా ఆ రోజుల్లో బ్లాక్బస్టర్ హీట్ అయింది. వి వి వినాయక్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు హిట్ అవ్వడంలో ఈ సినిమా హ్యాట్రిక్ గా నిలిచింది.

See also  Anasuya : అది తగ్గిందని అనసూయను వదిలించుకున్న స్టార్ హీరో!

Jrntr-movie-re-release

అదుర్స్ సినిమా కంటే ముందు వి వి వినాయక్ ఎన్టీఆర్ కాంబినేషన్లో.. ఆది, సాంబ రెండు సినిమాలు రిలీజ్ అయ్యి అవి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఆ తర్వాత మూడో సినిమాగా అదుర్స్ రిలీజ్ అయ్యి.. అది కూడా బ్లాక్ బస్టర్ హీట్ అయ్యి హ్యాట్రిక్ గా నిలిచింది. అయితే అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో ( Jr NTR movie Adhurs re-release ) కామెడీ చేయించి.. వినాయక్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ సినిమాలో ఒక పాత్ర పక్కా బ్రాహ్మణుడు కుటుంబంలో పెరిగిన ఎన్టీఆర్ ఆ పాత్రలో ఎన్టీఆర్ లీనమైపోయి నటించాడు.ఇక కామెడీ ఎంత బాగా పండిందంటే అంత బాగా పండింది. ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా ఒక హైలెట్.

See also  Mahesh Babu : మహేష్ బాబుతో మొదటిసారి ఆ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను అంటున్న హీరోయిన్!

Jrntr-adhurs-movie-adhurs-pre-release

బ్రహ్మానందానికి అసిస్టెంట్ గా బ్రాహ్మణ పనులు చేస్తూ పూజారిగా ఉంటాడు ఎన్టీఆర్. బ్రహ్మానందం ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ చూపిస్తే.. గురువుగారితో కలిసి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ అక్కడ వాళ్ళని చూసి.. గురువుగారు వీళ్ళు మిమ్మల్ని సాంతం నాకేస్తున్నారండి అనే డైలాగ్స్, నటించే నటన, కామెడీ అంతా కూడా సూపర్ గా ఉంటుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ మరొక పాత్ర ధైర్యంతో కూడిన పాత్ర. అది కూడా చాలా బాగుంటుంది. ఇక ఒక ఎన్టీఆర్ విపరీతమైన ధైర్యం, మరొక ఎన్టీఆర్ బ్రాహ్మణులు ఇంట్లో పెరిగి అమాయకత్వం.. ఈ రెండిటి సమ్మేళనంతో అదుర్స్ సినిమా అదరగొట్టాడు వినాయక్. ఇప్పుడు ఆ సినిమా నవంబర్ 18 వ తేదీన సినిమా హాల్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ చూసి అభిమానులు ఎప్పుడు 18 వ తారీకు వస్తుందా సినిమా చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. 4కే వెర్షన్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

See also  Skanda : స్కంద హిట్ కొట్టాలంటే రామ్ అంత పని చేయాలా?