
Jr NTR : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ వార్త ఎలా వైరల్ అవుతుందో ఎవరికీ తెలియడం లేదు. ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నా లేకపోయినా ఊహాగానాలు అయినప్పటికీ నిజంగా ఒక పాయింట్ను పట్టుకొని ( Jr NTR idea implemented Rajamouli ) అంత బాగా చిత్రీకరించి.. ఎప్పుడెప్పుడు విషయాలను చర్చించుకోవడం మాత్రం నిజంగా సోషల్ మీడియాని బాగా వాడుకుంటున్నట్టే కనిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ బాహుబలి సినిమాలో గమనించారా? అంటూ వార్తలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్కి బాహుబలి సినిమాకి సంబంధం ఏమిటి? అసలు జూనియర్ ఎన్టీఆర్ బాహుబలి సినిమాలో ఎక్కడా నటించలేదు, పనిచేయలేదు కదా అని అందరి సందేహం..
బాహుబలి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని బాహుబలి కి ముందు బాహుబలికి తర్వాత అని ప్రతిదీ లెక్కలు వేసుకునే విధానానికి తీసుకువెళ్లిన గొప్ప సినిమా. ఈ సినిమాతో సినిమా అనేది ముందుకు వచ్చి అక్కడి నుంచి ఎన్నో సినిమాలు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతూ.. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని తారాస్థాయికి ( Jr NTR idea implemented Rajamouli ) చేర్చుతున్నాయి. బాహుబలి సినిమాతో కొన్ని పాత్రలు ఎప్పటికీ మర్చిపోలేని పాత్రలుగా చిరస్థాయిగా నిలిచిపోయాయి. బాహుబలి, కట్టప్ప, శివగామిని, దేవసేన ఇలా మరిచిపోలేని పాత్రలు అలా గుండెల్లో నిలిచిపోయాయి. అటువంటి బాహుబలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాహుబలి 1, బాహుబలి 2 రెండు సినిమాలు కూడా సంచలనాన్ని క్రియేట్ చేశాయి.
ఇదిలా ఉంటే బాహుబలి సినిమాకి ఎన్టీఆర్ కి ఉన్న రిలేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిపి సింహాద్రి సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్లో.. ఎన్టీఆర్ ఎంతో జాగ్రత్తగా చూసుకునే భూమిక ఎన్టీఆర్ ని గొడ్డలితో పొడిచి చంపుతుంది. ఒక్కసారిగా భూమిక అలాంటి రియాక్షన్ ఎవరు కూడా ఊహించలేకపోయారు. అక్కడ నుంచి సెకండ్ హాఫ్ మీద విపరీతమైన ఆసక్తి పెరిగింది. అయితే అప్పట్లో ఈ ఐడియా ఎన్టీఆర్ స్టోరీ డిస్కషన్ లో రాజమౌళి కి ఇస్తే.. దాన్ని ఇంకా మన జక్కన్న మలచి సింహాద్రిని బ్లాక్ బస్టర్ హిట్ చేశాడంట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. నిజంగా ఎన్టీఆర్ చెప్పినా.. చెప్పి ఉండకపోయినా.. ఎన్టీఆర్ సినిమాలో అలాంటి లాజిక్కుని వాడి ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేసాడు రాజమౌళి.
అలాగే బాహుబలి సినిమా కూడా బాహుబలి 1 బాహుబలి 2 రెండు భాగాలుగా తీయాలని రాజమౌళి ముందుగానే ఫిక్స్ అయ్యాడు. ఆ మొదటి భాగం నుంచి రెండో భాగం మీద విపరీతమైన ఆసక్తి పెరగాలంటే బాహుబలికి ఎంతో సన్నిహితుడు నమ్మకస్తుడు అయిన కట్టప్ప పొడవుడమే.. ఆ సీన్ సెకండ్ బాహుబలికి ఉన్న పునాది. ఆ పునాదితోనే రెండవ బాహుబలి అంత పెద్ద అంతస్తుగా ఎదిగింది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR idea implemented Rajamouli ) ఐడియా లేదా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో పాయింట్ను పట్టుకొని.. రాజమౌళి బాహుబలి 1 నుంచి 2 కి అంత హైప్ క్రియేట్ చేశాడు. కనుక బాహుబలి సక్సెస్ లో ఎన్టీఆర్ ఉన్నాడు.. ఈ పాయింట్ ఎవరైనా గమనించారా అని సోషల్ మీడియాలో ఇప్పుడు వార్త తెగ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా రాజమౌళి సినిమా అంటేనే ఒక అద్భుతం.. అందులో ఇలాంటి పాయింట్ కనిపెట్టిన నెటిజనులు ఇంకా అద్భుతం..