Home Cinema Jr NTR: అలాంటి పనులు చేసిన ఎన్టీఆర్ కాలేజీ రోజుల్లోనే తన్నులు తిన్నాడా.? మహా చిలిపి..

Jr NTR: అలాంటి పనులు చేసిన ఎన్టీఆర్ కాలేజీ రోజుల్లోనే తన్నులు తిన్నాడా.? మహా చిలిపి..

NTR College Days: నందమూరి వారసునిగా సినీ జీవితంలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. ఆర్ ఆర్ ఆర్ చిత్రంతోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఒకప్పుడు కేవలం తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన ఈ నందమూరి తారక్ ప్రస్తుతం ఎల్లలు దాటి ఖండాలు దాటి ఆయన క్రేజీ ప్రపంచమంతా వ్యాపించి ఎన్టీఆర్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బాలీవుడ్, హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సైతం ఎన్టీఆర్ తో పని చేసేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇటీవలే హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ తన మనసులో ఉన్న ఎన్టీఆర్ పై తన అభిప్రాయాన్ని చెప్పిన విషయం మనమంతా విన్నాం..

jr-ntr-did-such-a-thing-during-his-college-days

జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందంటూ ఆయన మనసులో ఉన్న ఆ కోరికను బయటపెట్టాడు. ఇక ప్రస్తుతం తారక్ చేస్తున్న చిత్రాలన్నీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కివే.. మరి అదే విధంగా బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో ఒకటైన వార్ 2 లో జూనియర్ ఎన్టీఆర్ కు క్రేజీ ఆఫర్ వచ్చిందని.. ఆయన హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అన్న వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారమే చెలరేపుతున్నాయి. ఇంకా ఇదే నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు ఖచ్చితంగా పండగే అని చెప్పాలి. ఇక ఇదే కాకుండా ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30 చిత్రాన్ని చేస్తున్నాడు. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దివంగత తార అతిలోకసుందరి శ్రీదేవి గారి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

See also  Jabardasth : కుర్రాళ్లు ఎగబడి షో చూసేలా అదిరిపోయే నిర్ణయం తీసుకున్న జబ్బర్దస్థ్..

jr-ntr-did-such-a-thing-during-his-college-days

ఇక ఈ విషయాలన్నీ పక్కనపెట్టి మన టాపిక్ లోకి ఎంటర్ అయితే..ప్రస్తుతం ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. నిజానికి ఎన్టీఆర్ తన చిన్నతనం నుంచే మహా అల్లరి పిల్లవాడు. ఇక మనోడు ఎక్కడ ఉంటే అక్కడ సందడి సందడిగా ఉంటుందట. ఇక ఇదే కాకుండా ఎన్టీఆర్ చిన్నతనంలో కూడా ఎంతో అల్లరి వాడుగా చిలిపి చేష్టలు చేసే వాడట. మరి ముఖ్యంగా గుంటూరులో తను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఎన్నో చిలిపి వేషాలు వేశాడట. అసలు క్లాస్ రూమ్ లో పాటాలు వింటే కదా వినేవాడు అస్సలు కాదట.. చివరి బెంచ్ లో కూర్చుని బ్యాంక్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకుంటూ..

See also  Pushpa - 2: వెయ్యి కోట్లు ఇస్తాము పుష్ప 2 చిత్రం మాకు ఇచ్చేయ్యడంటూ అదిరిపొయ్యే ఆఫర్.. దానికి డైరెక్టర్ ఏమన్నాడంటే.

jr-ntr-did-such-a-thing-during-his-college-days

ఓ గ్యాంగ్ ని వేసుకొని కూర్చుని ఇతరులపై తెగ జోకులు వేస్తూ మహా అల్లరి చేసే వాడట. ఇక ఇదే కాకుండా దొంగ చాటుగా కాలేజ్ (NTR College Days) గోడ దూకి మరి సినిమాలకు వెళ్లడం.. అమ్మాయిలకు బీట్ కొట్టడం అంటే పనులు కూడా చేసేవాడట. ఇక ఎన్టీఆర్ అల్లరిని తట్టుకోలేక పోతున్నామని లెక్చరర్లు సైతం కాలేజీ హెడ్మాస్టర్ కి కంప్లైంట్ చేస్తే.. హెడ్మాస్టర్ చేతిలో పలుమార్లు ఎన్టీఆర్ దెబ్బలు కూడా తిన్నాడట. ఇలాంటి మధురమైన జ్ఞాపకాలు దాదాపు మనందరి జీవితాల్లో కూడా ఉండడం సహజం. అలాగే ఎన్టీఆర్ తన చిన్నతనంలో కూడా ఇలాంటి అల్లరి చేష్టలు ఆయన జీవితంలో కూడా ఉన్నాయి. ఇక ఈ విషయాలు ఆయనకు గుర్తుకువస్తే తెగ నవ్వుకుంటారట.