Jeevitha Rajasekhar: గతంలో 2011 వ సంవత్సరంలో అల్లు అరవింద్ గారు జీవిత రాజశేఖర్ లపై పరువు నష్టం దావా కేసు వేయడం జరిగింది. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మోసాలు జరుగుతున్నాయని అందులో చిరు ఫ్యాన్స్ కాకుండా ఇతర సామాన్య పౌరులు సైతం ఇచ్చే రక్తాన్ని అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నారని గతంలో జీవిత రాజశేఖర్ లు విమర్శనాత్మకమైన కామెంట్లు చేశారు. దాంతో నాడు అల్లు అరవింద్ గారు పరువు నష్టం దావా కేసు వేయడం జరిగింది. ఇక అప్పటినుంచి కొనసాగుతున్న ఆ కేసు తుది తీర్పు ఇవాళ విడుదల అయింది. సంవత్సరం కాలం పాటు జైలు శిక్ష పడగా బెయిల్ కి మంజూరు చేసుకోవచ్చని పిటిషన్ లో వెల్లడించడం జరిగింది. దాదాపు పన్నెండు ఏళ్ల తర్వాత ఈ శిక్షకు తీర్పు రావడం గమనార్ధం..
2011లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై అనుచితల వ్యాఖ్యలు చేసినందుకు గాను జీవిత రాజశేఖర్ లపై అల్లు అరవింద్ గారు పరువు నష్టం దావా కేసు వేయడం జరిగింది. పన్నెండు ఏళ్ల క్రితం వేసిన కేసుకి నేడు అనగా బుధవారం తుది తీర్పు వెలువడింది. అయితే వీళ్ళిద్దరికీ ఏడాది పాటు జైలు శిక్ష ఐదు లక్షల జరినామ విధించగా అవసరమైతే ఉన్నత న్యాయస్థానంలో అయినా మీరు పిటిషన్ వేసుకోవచ్చు అని తెలిపింది.
చిరంజీవి సొంతంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్న సమయంలో చిరంజీవిపై జీవిత రాజశేఖర్లు ఎన్నో అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిన విషయం మనందరికీ తెలిసిందే.. ఇక అప్పట్లో ఎన్నో గొడవలు కూడా జరిగాయి. ఆ మాటలను సహించలేని చిరు అభిమానులు వాళ్ళిద్దరిపై దాడులు కూడా చేయగా.. జీవిత రాజశేఖర్ ల ఇంటికి స్వయంగా చిరంజీవి వెళ్లి వాళ్ళ పై దాడులను ఖండిస్తూ క్షమించమని కూడా కోరాడు.
చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్ లో సాధారణ పౌరులే కాకుండా మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఇచ్చే రక్తాన్ని అమ్ముకుంటున్నారన్న విమర్శనాత్మకమైన వ్యాఖ్యలకు జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) లకు గాను నేడు కోర్టు తుది తీర్పు ఇచ్చింది ఐదు లక్షల జరిమానా విధిస్తూ ఏడాది కాలం పాటు జైలు శిక్ష ఖరారు చేసింది అవసరమైతే ఉన్నత న్యాయస్థానాన్ని సంపాదించవచ్చు అని తెలిపింది పైగా బెయిల్ కూడా మంజూరు చేసుకోవచ్చని వెల్లడించింది.