Jailer: ఆగస్టు 10వ తేదీ ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా జైలర్ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా రజనీకాంత్ కెరీర్ లో సక్సెస్ అయిన సినిమాలను లేవు. ఆ బాధతో సతమతమవుతున్న ( Jailer movie collections in three days ) ఆయన.. ఈ వయసులో ఇప్పుడు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నాడు. రజినీకాంత్ సినిమా రిలీజ్ కి ముందు పెద్ద అంచనాలు లేవుగాని.. రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ బయటకు వచ్చింది. ఒక్కసారిగా సినిమాపై మంచి టాక్ రావడంతో జనాలు సినిమాకి వెళ్తున్నారు.
ఇక పెద్ద పెద్ద కంపెనీలు అయితే రజనీకాంత్ సినిమాకి ఒక పూట స్టాఫ్ కి సెలవిచ్చి, టికెట్స్ కూడా ఇస్తున్నారు. ఈ సినిమాకి అంత నేమ్ రావడంతో పాటు రజనీకాంత్ మీద ఉన్న అభిమానాన్ని ఒక్క హిట్టుతో అందరూ దుమ్ము రేపుతున్నారు. చాలా ( Jailer movie collections in three days ) కాలంగా ఒక మంచి హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకోలేకపోతున్న దాహాన్ని.. ఇప్పుడు పూర్తిగా తీర్చేసుకుంటున్నాడు రజినీకాంత్. ఈ సినిమా ఇప్పటికి కేవలం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలను సొంతం చేసుకుంది. 200 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనాన్ని సృష్టించింది.
రజనీకాంత్ కి తెలుగులో అయితే చాలా కాలంగా మినిమం హిట్ సినిమా కూడా లేదు. అలాంటిది ఇప్పుడు జైలర్ సినిమా కేవలం మూడు రోజుల్లో తెలుగులో 12 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. 13 కోట్ల బ్రేక్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ( Jailer movie collections in three days ) ఇప్పుడు కేవలం మూడు రోజుల్లో 13 కోట్ల 13.81 కోట్లు షేర్ 23.65 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీ వసూళ్లను మూడు రోజుల్లో తీసుకురావడం అంటే అది మామూలు బ్లాక్ బస్టర్ హిట్ కాదు అని అందరికీ తెలుసు. ఇక తెలుగులో జైలర్ సినిమాకి కలెక్షన్ వివరాలు ఏరియా వారిగా తీసుకుంటే..
నైజాంలో మూడు రోజుల్లో 6.35 కోట్లు వసూలు చేయగా 1.78 కోట్లు ఉత్తరాంధ్రలో, సెడెడ్ లో 1. 71 కోట్లు, తూర్పులో 92 లక్షలు, పశ్చిమ లో 57 లక్షలు, గుంటూరులో 1.12 కోట్లు, కృష్ణ లో 93 లక్షలు, నెల్లూరులో 42 లక్షలు.. ఇలా వసూళ్లను విపరీతంగా తీసుకొస్తూ.. సినిమాని లాభాలు బాటలోకి తీసుకెళ్ళిపోయింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 164 కోట్ల టార్గెట్ తో ఈ సినిమా ముందుకు వస్తే.. ఈ మూడు రోజుల్లోనే 105.10 కోట్లు షేర్, 214.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ తీసుకొచ్చింది. మరో 18.90 కోట్లు వస్తే జైలర్ సూపర్ డూపర్ హిట్ అయినట్టే.. ఇలా జైలర్ సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలబడింది. ఈ సినిమాలో రజనీకాంత్ ఈ వయసులో కూడా అంత అద్భుతంగా నటించిన తీరు చూసి అందరూ ఇంకా ఇంకా చూడాలని ఆశగా రిపీట్ గా వెళ్తున్నారు.