జబ్బర్ధస్థ్ షో తో రష్మీ ప్రేక్షకులకు మరింత దగ్గర అయిన విషయం మనందరికీ తెలిసినదే. రష్మీ కొన్ని సినిమాలలో కీలకమైన పాత్రలు కూడా పోషించింది. గత ఏడాది ‘బొమ్మ బ్లాక్బస్టర్’ అనే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది కానీ ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో రష్మీ ఒక పాత్ర చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో తన అభిమానులకు ఒక కొత్త పిలుపును ఇచ్చింది. అదేమిటంటే… తోలు వస్తువుకు వాడకండి అని పిలుపును ఇచ్చింది.
మూగ జంతువులంటే రష్మీకి చాలా ఇష్టం. సోషల్ మీడియా లో ఆమె పోస్ట్ చేసే పోస్ట్స్, ట్వీట్స్ ఎక్కువగా మూగ జీవుల గురించి ఉంటాయి. అలాగే వాటిని హింసించే వారిని వ్యతిరేకిస్తూ ట్వీట్స్ పెడుతూ ఉంటుంది. ఇందులో కొందరు ఆమెను సప్పోర్ట్ చేస్తే, మరి కొందరు ఆమెను వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే రష్మీ తాజాగా ఒక వీడియోను షేర్ చేశారు. అది బుల్ ఫైట్… బుల్ఫైట్లో పాల్గొన్న ఎద్దు తలకు గాయం కావడంతో అది కాళ్లు కొట్టుకుంటూ అక్కడే చనిపోవడం వీడియోలో జరిగింది. ఇలాంటి క్రీడలను అస్సలు ప్రోత్సహించకూడదని ఆమె కామెంట్ చేసింది.
అసలు ఇలాంటి ఆటలు ఎంజాయ్ చేసే వారికి రాత్రుళ్ళు నిద్ర ఎలా పడుతుంది అని రష్మీ ప్రశ్నించింది. దీనికి ఒక నెటిజను స్పందిస్తూ… ఇండస్ట్రీ లో ఉన్న మీరు తోలు వస్తువులను ఎలా వాడుతున్నారు? ముందు మీరు మానేయండి, అప్పుడు మిగిలిన వారికి చెప్పండి అని కామెంట్ చేసాడు. నేను ఎప్పుడు తోలు వస్తువులను వాడలేదు, కొనలేదు అని రష్మీ సమాధానం చెప్పింది. మన దేశంలో తోలు వస్తువులను ఎక్కువగా ఆవుల నుంచే తీసుకుంటారు. కాబట్టి, ఒక హిందువుగా నేను ఇలాంటి క్రూరమైన పనుల్లో ఎప్పటికీ భాగం కాలేను, దయచేసి మీరు కూడా కాకండి అని రష్మీ వివరించారు. జబ్బర్ధస్థ్ రష్మీ చెప్పిన ఈ మాట వలన ప్రతి హిందువు గర్వపడతాడు అని అభిమానులు అనుకుంటున్నారు.