Samanthas Fans: చాలా సినిమాలు బోల్తా కొట్టిన తర్వాత అందరూ సమంత పనైపోయింది అనుకున్నారు. కేవలం సమంత విషయంలోనే కాకుండా విజయ్ దేవరకొండ కూడా తన పని ముగించుకున్నారని అంత భావించారు. కానీ.. ఖుషి చిత్రంతో ఒక్క సారిగా రూపు రేఖలు మారిపోయాయి. ప్రస్తుతం ఇటు హీరో విజయ్ దేవరకొండ సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఖుషి చిత్రం యొక్క ఫలితంతో చాలా ఖుషి ఖుషిగా ఉన్నారు. ఎన్నో రోజుల గ్యాప్ తర్వాత మంచి హిట్ ను దక్కించుకున్నారు. అయితే సమంత విషయాని కొస్తే గుణ శేఖర్ శాకుంతలం చిత్రంలో సమంత గెటప్ కి చాలా నెగటివ్ మార్కులు అయితే పడ్డాయి. మనందరికీ తెలిసిందే.. సమంత గత కొద్ది కాలంగా మయో సైటిస్ అనే వ్యాధి బారిన పడి కోలుకుందని
ఆ అనారోగ్య సమస్యల కారణం చేతనే ఇప్పటి వరకు కూడా మునుపటిలా ఆమె ముఖంలో ఆకట్టుకునే చరిష్మా లేదని చాలా మారిపోయిందని ఒక రెండు సార్లు పబ్లిక్ లో కనిపించినప్పుడు కూడా ఆమె మరింత నెగిటివ్ వచ్చేలా కనిపించింది చాలా మంది ఇదే విషయం పై చర్చించసాగారు. ఐతే అందరూ అనుకున్నారు సమంత సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంటున్నానని చెప్పగానే ఇక చాలా మంది సమంత పని అయిపోయింది ఇక ఆమె కూడా రిటైర్డ్ తీసుకున్నట్టే అంటూ ఇటు సమంత అభిమానులే కాక తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతగానో ఫీల్ అయిపోయారు. నిజానికి ఆమె మయో సైటిస్ వ్యాధి చికిత్స నిమిత్తం అమెరికా వెళుతుంది.
ఆ కారణం చేతనే కొద్ది రోజులు షూటింగ్లకు దూరంగా ఉండనున్నట్లు భావించింది. దాంతో ప్రతి ఒక్కరూ భావించారు ఇక సమంత సినిమాలు అయితే ఎవరికి లేదు అనేలా భావించాలి. సరిగ్గా ఇదే సమయంలో ఖుషి చిత్రం వచ్చింది. ఇక ఈ చిత్రం సూపర్ గా హిట్ అవ్వడమే కాకుండా గ్లామర్ పరంగా సమంతకు మరిన్ని మార్కులు పడ్డమే కాగ మంచి పేరు తీసుకువచ్చింది. కుర్ర హీరోల సరసన కొత్త హీరోయిన్లను తీసుకువస్తూ ఉన్న సమయంలో ఆమె విజయ్ దేవరకొండ పక్కన నటించి ఓకే అనిపించింది తప్ప ఒక్క నెగిటివ్ కూడా ఆమె పై రాలేదు.. పైగా ఈ చిత్రంలో రొమాంటిక్ సీన్ల పంట పండిస్తూ చాలా ఆకట్టుకుంది ఎంతగానో అలరించింది సమంత.
ప్రస్తుతం తెలుగులో సీనియర్ హీరోల సరసన హీరోయిన్ల కొరత చాలా విపరీతంగా ఉందట. నటన విషయంలో అయితే సమంతకి ఎదురేలేదు ఇక మయో సైటీస్ వ్యాధి నుంచి పూర్తిగా కోల్కొని మరింత అందంగా కాస్తయంగా గ్లామర్ లుక్ తో మనకు కనిపిస్తే చాలు మళ్ళీ కొన్నేళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమనే కాక ఇతర సినిమా ఇండస్ట్రీలను దున్ని పడయోచ్చు. త్వరగా మాయో సైటీస్ వ్యాధి నుంచి కోరుకుంటే మళ్ళీ సమంత చేతిలో చాలా సినిమాలు ఉండే అవకాశం ఉంది. కుర్ర హీరోలని కాస్త పక్కన పెడితే సీనియర్ హీరోలు చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో వాళ్లకి ఎప్పుడు హీరోయిన్ల సమస్య కచ్చితంగా ఉంటుంది. అందువల్ల సమంత మళ్లీ చిత్రాలలో చేస్తా అంటే మాత్రం కచ్చితంగా టాలీవుడ్ లో ఎత్తుకు ఎదుగుతుందని చెప్పవచ్చు. చూడాలి మరి అమెరికా నుండి ఎప్పుడు తిరిగి వస్తుందో (Samanthas Fans) సమంత.