Beautiful Heroines: మన తెలుగు చిత్ర పరిశ్రమ లోకి రోజు రోజుకీ వచ్చే వాళ్ళ హీరోయిన్ల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది. మన తెలుగు వాళ్ళ కంటే ఇతర భాషలలో నుండి వచ్చే అందమైన హీరోయిన్లు ఎంతో మంది లేకపోలేదు.. కాకపోతే వాళ్లకి అందానికి అందం టాలెంట్ కు టాలెంట్ ఉన్నప్పుడు కూడా అవకాశాలు రాక కొట్టుమిట్టాడుతున్నారు ఎందుకంటే దానికి చిన్న ఉదాహరణ మన తెలుగులో ఒక సామెత ఉంది ఎంత అందం ఉంటే ఏం లాభం కనీసం ఆవగింజంత అదృష్టం అన్నా నికి తోడై కల్సి రావాలి కదా అదృష్టం లేకపోతే ఏది ఉన్నా ప్రయోజనం ఉండదు.
అదృష్టం అనేది లేకుంటే ఉన్నా బూడిదల పోసిన పన్నీరు అవుతుంది. ఇక ఇలాంటి సామెత మన తెలుగు హీరోయిన్లకు సైతం వర్తిస్తుందని చెప్పండి. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడైతే శ్రీ లీల అడుగుపెట్టిందో అప్పటి నుంచి రాయిలో ఉన్న హీరోయిన్లైనా పూజా హెగ్డే, రష్మిక, కృతి శెట్టి ల అవకాశాలకు గండి పడింది అనే చెప్పాలి. కాగా అంతకంటే ముందే ఇండస్ర్టీని ఓ ఊపు ఊపుతున్న రాశీ కన్నా సైతం ప్రస్తుతం ఫేడ్ అవుట్ జాబితాలోకి చేరిపోయింది. పక్కా కమర్షియల్, థాంక్యూ లాంటి చిత్రాలు డిజాస్టర్ అయ్యాక రాశీ కన్నా పరిస్థితి మరి దారుణంగా మరణమే కాకుండా మన పట్టించుకునే నాధుడే లేకపోయాడు. ఇక ఆ తర్వాత నభా నటేష్, నిధి అగర్వాల్ ఇండస్ట్రీలో మంచి హిట్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మంచి అవకాశాల విషయ అనుకుంటే ఆ సినిమాతోనే ఈ భామలను జనాలు మర్చిపోయారు.
నిధి అగర్వాల్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం కూడా లభించింది. ఇక ఆ చిత్రం మరేదో కాదు హర హర వీరమల్లు పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తుంది. కానీ ఇప్పటంతలో ఆ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు లేదు. ఇక నభా నాలుగు చిత్రాలు చేస్తే ఆ నాలుగు ఫట్ అయ్యాయి. ఇక మెహ్రీన్ కు, నివేద పేతురాజ్ లు అందం ఉన్నప్పటికీ స్టార్డమ్ దక్కించుకుని స్టార్ హీరోయిన్లుగా కొనసాగలేకపోతున్నారు. ఇక వరుస ఫ్లాఫ్స్ మీద జోరుగా ఉన్న అను ఇమాన్యుయల్, మేఘా ఆకాశ్ లు ఐతే అను కు అజ్ఞాతవాసిలో అవకాశం లభించినా ఆ చిత్రం ఫ్లాఫ్ అయ్యింది. ఇక మేఘా సైతం వరుసుగా నాలుగు ఫట్ లు ఫట్టుమనిపించింది.
ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ ను పెళ్ళి చేసుకుంటే ఖతం సినిమాలకు భై భై చెప్పినట్టే ఇక. రీతూ వర్మ పరిస్థితి ఇంతే అందం టాలెంట్ ఉన్నా అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ ఇంత అందం ఉండి ఎంతో టాలెంట్ ఉన్న ఈ హీరోయిన్లు (Beautiful Heroines) అందరూ హిట్లు కూడా లేక నానా తంటాలు పడుతూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకోలేక వాళ్ళతో నటించే అవకాశాలు లభించక ఇండస్ర్టీలో హిట్స్ పొందలేక అల్లాడిపోతున్నారు.