Nandamuri BalaKrishna: ప్రస్తుతం ఉన్న సినిమా ఇండస్ట్రీలో అయినా గతంలో ఉన్న సినిమా ఇండస్ట్రీలో అయినా అసలు ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా మనం చూసుకున్నట్లయితే వరుసగా ఒక హీరో ఒక హీరోయిన్ కలిసి మూడు, నాలుగు చిత్రాల్లో నటిస్తే మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ పలు రకాల ప్రచారాలు చేస్తూనే ఉంటారు. ఇప్పటికే అలాంటి ప్రచారాలు ఎందరో హీరో హీరోయిన్ల మధ్య న, హీరోయిన్ల డైరెక్టర్ల మధ్యన ఎన్నో వినిపించాయి కూడా.. అలానే తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి గారి క్రేజీ కాంబినేషన్ గురించి ప్రత్యేకించి ప్రత్యేకంగా తెలియాల్సిన పని లేదు. ఎందుకంటే వీళ్లిద్దరిది క్రేజీ కాంబినేషన్ వీళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎన్నో విజయాలను కైవసం చేసుకున్నాయి.
అలా వీళ్ళిద్దరి మధ్య గతంలో ఎఫైర్ నడిచింది అంటూ పలు రకాల వార్తలు తెగ వైరల్ అయ్యాయట. ఇక ఈ విషయం గురించి వీళ్లిద్దరిలో ఏ ఒక్కరు కూడా మాట్లాడకపోవడం తో ఈ వార్తలు తెగ వైరల్ అయ్యాయట. అయితే తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ ఈ ఇమంది రామారావు మాట్లాడుతూ.. ఇదే విషయంపై కొన్ని ఆసక్తి కరమైన కామెంట్స్ చేయ సాగారు. ఇమంది రామారావు మాట్లాడుతూ ఒక హీరో ఒక హీరోయిన్ వరుసగా కలిసి నటించినా పలు మీడియా సంస్థలు ఎన్నో రకాల కథనాలు వాళ్ళిద్దరి పై సృష్టించి క్షణాల్లో వైరల్ చేస్తాయని తెలిపారు.
విజయశాంతి భర్త తనకు చాలా మంచి స్నేహితుడని తెలిపాడు. ఇక నేను విజయశాంతి గారి ఆత్మకథ రాయడం కోసమే ప్రస్తుతం పని చేస్తున్నట్లు కూడా ఈ మంది తెలపడం జరిగింది. నందమూరి బాలకృష్ణ గారితో విజయశాంతికి కేవలం సస్ధంబంధాలి మాత్రమే ఉన్నాయి కానీ ఎలాంటి ఎఫైర్ అనేవి అసలు లేవని ఇమంది గారు తెలియజేయడం జరిగింది. ఇకపోతే వీళ్లిద్దరూ బోలా మనుషులని కూడా తెలియజేయడం జరిగింది. ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి ఒకరిపై ఒకరికి ఎలాంటి అభిమానం ఉంటుందో వీళ్ళిద్దరికీ అలాగే ఉంటుందంటూ తెలియజేశారు ఇమంది రామారావు.
ఇక ఇదే కాక సీనియర్ ఎన్టీఆర్ సైతం విజయశాంతిని ఇంతగానో గౌరవించేవారని ఆయన గుర్తు చేశారు. అయితే విజయశాంతి వివాహం చేసుకొని ఆ విషయాన్ని మాత్రం చాలా ఆలస్యంగా తెలియజేసిందని కూడా ఈ మంది రామారావు వెల్లడించాడు. ఇక విజయశాంతి వివాహ చేసుకుంది ఎవరినో కాదు సీనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి కూడా చాలా అత్యంత బంధువు అని ఇమంది రామారావు తెలియజేయడం జరిగింది. తెలంగాణ కోసం విజయశాంతి పడ్డ కష్టం మరెవ్వరు కూడా పడలేదని ఆయన తెలిపాడు. దీంతో విజయశాంతి బాలయ్య (Nandamuri BalaKrishna) మధ్యల ఎలాంటి ఎఫైర్ లేదని చాలా స్పష్టంగా తెలియజేశారు ఇమంది. మరి ఇక నైనా ఇలాంటి తరహాలో వార్తలు నిలిచిపోతాయో లేదో చూడాలి. ప్రస్తుతం వరుస చిత్రాలతో బాలయ్య చాలా బిజీ బిజీగా తన జీవితాన్ని షూటింగ్స్ తో కొనసాగిస్తున్నాడు.