Home Cinema Junior NTR: ఆ బ్లాక్ బాస్టర్ హిట్ ను ఎన్టీఆర్ వదులుకోవడానికి కారణం డైరెక్టర్ హీరో...

Junior NTR: ఆ బ్లాక్ బాస్టర్ హిట్ ను ఎన్టీఆర్ వదులుకోవడానికి కారణం డైరెక్టర్ హీరో కాళ్ళు పట్టుకోమన్నాడనా.?

NTR Gave Up: నందమూరి వంశ నట వారసునిగా తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. తన తాత సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో జూనియర్ ఎన్టీఆర్ గా మారిపోయి ఇక నటనలో సైతం తాతకు ఏ మాత్రం తగ్గకుండా ఆయన నటనను పుచ్చుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతూ పాన్ ఇండియా స్థాయిలో తన సత్తాని ఏంటో చూపించాడు. ఏ పాత్ర చేసిన సరే అందుకు తగ్గట్టు ఆ పాత్రలో ఇమిడి పోయి పూర్తిగా న్యాయం చేయడమే ముఖ్యం గా భావిస్తుంటాడు. ఇక సినిమాలలో ఆయన నటనకు న్యాయం చేయడంతో అందరూ మెచ్చుకొని చూసిన అభిమానుల సైతం అదిరిపోయింది అని చెప్పాల్సిందే.. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంతో దేశ వ్యాప్తంగా ఆయనకు ఎలాంటి క్రేజ్ పెరిగిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కథలు ఎంపిక చేసుకునే విషయాల్లో కూడా అచి తూచి ఎంపిక చేసుకుంటూ అదిరిపోయే పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంటాడు.

See also  Samantha Dress: స‌మంత ధరించిన ఆ గ్రీన్ డ్రస్ ధర తెలిస్తే దిమాక్ కరాబే..

is-the-reason-why-ntr-gave-up-on-that-blockbuster-hit-was-because-the-director-grabbed-the-heros-legs

అయితే సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత హీరోలకు వద్దకు ఎన్నో కథలు వస్తుంటాయి. అవి అన్ని వాళ్ళు చేయాల్సిన పనిలేదు అలా ఎన్టీఆర్ కూడా తన సినీ కెరియర్లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.. వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని ప్లాప్ అయ్యాయి. అలాంటి కొన్ని కథలు ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన చిత్రాలలో ఒక సూపర్ డూపర్ హిట్ చిత్రం కూడా ఉంది. ఆ చిత్రమే ఊపిరి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పీవీపీ బ్యానర్ పై ప్రసాద్ వి పోట్లూరి నిర్మించారు. ఇందులో కింగ్ మన్మధుడు నాగార్జున మరియు కార్తీ మొదలైన వారు హీరోలుగా నటించారు.

See also  Manchu Lakshmi: మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు రావడానికి ఇదే కారణమని.. గుట్టు రట్టు విప్పిన మంచు లక్ష్మి..

Nagarjuna Karthi

ఇక ఈ చిత్రంలో హీరో కార్తీక్ జోడిగా తమన్నా భాటియా హీరోయిన్ గా నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా ఈ చిత్రం తమిళంలో కూడా ఒకేసారి విడుదల అయింది. కాగా ఈ చిత్రం 2016వ సంవత్సరం మార్చి 25 తారీఖున విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల సునామీ సృష్టించింది. కాగా ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున విక్రమాదిత్య అనే పాత్రలో ఓ బడా వ్యాపారవేత్తగా నటించాడు. ఇక హీరో కార్తీక్ నిరుపేద కుటుంబానికి చెందిన సీను అనే పాత్రను పోషించాడు. అయితే మొదట కార్తీ పోషించిన ఈ పాత్రకు డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ను ఎంపిక చేసుకున్నాడట..

Hero Karthi

ఆయన అనుకున్నట్లుగానే ముందుగా కథను ఎన్టీఆర్ (NTR Gave Up) కు వెళ్లి చెప్పగా తనకెంతో బాగా నచ్చిందట ఈ కథ. కానీ ఈ సినిమా నేను చేయనని చాలా సున్నితంగా చెప్పేశాడట. ఎందుకంటే నిజానికి ఊపిరి సినిమాలో హీరో నాగార్జున కు ఓ ప్రమాదం జరిగే ఆయన వీల్ చైర్ కే అంకితమైపోతాడు. ఆ కారణంగా ఆయనకు సేవలు చేస్తూ ఉండాలి. అతనికి కేర్ టేకర్ గా మొత్తం చూసుకోవడానికి కార్తి ఆ జాబ్ లో సెలెక్ట్ అవుతాడు. సినిమాలో కొన్ని సీన్లలో నాగార్జున కాలు సైతం పట్టుకుంటాడు కార్తి అలాంటి సీన్లలో నటించడం ఇష్టం లేకనే ఎన్టీఆర్ ఊపిరి చిత్రాన్ని రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. దాంతో డైరెక్టర్ వంశీ ఎన్టీఆర్ చేయనడంతో తర్వాత సెకండ్ ఛాయిస్ గా కార్తీని రంగంలోకి దింపారట. కాకపోతే కార్తీక్ కూడా ఈ పాత్ర అనుకున్న దానికంటే ఎక్కువగా న్యాయం చేయడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.