
Samyuktha Menon : మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ తెలుగు ప్రేక్షకుల ఆదరణను చాలా గట్టిగానే లాక్కుంది. భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన సంయుక్త మిలన్.. తర్వాత వరుస హిట్స్ తో తన సత్తాను చాటుకుంది. అదృష్టమో, ఆమె నటన ప్రతిభో తెలియదు గానీ ఆమె ( Samyuktha Menon relationship with ) నటించిన నాలుగు సినిమాలు హిట్ కొట్టడం అంటే మామూలు మాట కాదు. అందుకే ఇప్పుడు అందరి కళ్ళు సంయుక్త మీనన్ మీదే పడ్డాయి. ఇటీవల రిలీజ్ అయిన విరూపాక్ష సినిమాలో ఆమె నటన ఊహించని విధంగా ఉంది. సంయుక్త మీనన్ లో ఇంత నటనా ప్రతిభ అంటూ అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ఏ రంగంలోనైనా మనిషి తన ఎదుగుతున్న కొద్దీ.. చుట్టూ అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు.
అందులోనూ సినిమా రంగంలో క్రేజ్, ఇమేజ్ పెరిగే కొద్దీ వాళ్ళపై ఎన్నో రూమర్స్ వస్తూనే ఉంటాయి. అలాగే సంయుక్త మీనన్ మీద కూడా ప్రముఖ దర్శకుడు త్రిమిక్రమ్ శ్రీనివాస్ తో ఎఫైర్ ఉందంటూ అనేక వార్తలు హల్చల్ చేశాయి. వీరిద్దరి సంబంధం పై ఎన్నోసార్లు ఎన్నో ప్రచారాలు జరిగి వార్తలు వచ్చేసరికి.. వీళ్ళిద్దరూ ( Samyuktha Menon relationship with ) దాన్ని పట్టించుకోకుండా.. ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఆ వార్తలో నిజం లేదని అందరూ సద్దుమణిగారు. ఇలా సంయుక్త మీనన్ తన మీద ఎన్ని రూమర్స్ వస్తున్నప్పటికీ.. ఎవరు ఏం మాట్లాడుతున్నప్పటికీ.. ఆమె మాత్రం తన కెరీర్ మీదే గట్టిగా ధ్యాస పెట్టి సూపర్ హిట్స్ కొట్టుకుంటూ వెళ్తుంది. అయితే ఇప్పుడు మళ్లీ మరొక వార్త సంయుక్త మీద సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అదేంటంటే ఆ స్టార్ హీరోని పైగా పెళ్లయిన ఆ హీరో మీద సంయుక్త మీనన్ మనసు పడుతుందని.. తన ఇష్టాన్ని తెలుపుతూ ఇండైరెక్టుగా అతనిని గోకుతుందని అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో టాలీవుడ్ హీరో కాదు సుమీ.. కోలీవుడ్ స్టార్ హీరోని సంయుక్త మీనన్ ప్రేమిస్తుందని.. అతనికి ఆల్రెడీ పెళ్లయి భార్యకి డైవర్స్ ఇచ్చి ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. అతను ఒప్పుకుంటే పెళ్లికి సిద్ధమంటూ ( Samyuktha Menon relationship with ) సంయుక్త మీనన్ సిగ్నల్ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ ఈ విషయాన్ని కోడై కూస్తున్నప్పటికీ.. దానిమీద ఆ కోలీవుడ్ హీరో గాని, సంయుక్త మీనన్ గాని సమాధానం చెప్పడం లేదంట. అయితే ఆ హీరో కూడా సంయుక్త మీనన్ మీద ఇంట్రెస్ట్ చూపించడం మిగిలిన వారికి పెద్దగా నచ్చడం లేదంట.
ఆల్రెడీ పెళ్లి అయ్యి, భార్యను వదిలేసిన ఇతనికి సంయుక్త మీనన్ ను పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏమిటి అని కోలీవుడ్ జనాలు వాపోతున్నారంట. ఇదిలా ఉంటే బింబిసారా , సార్, విరూపాక్ష లాంటి సూపర్ హిట్ సినిమాల్లో తనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న తర్వాత, సంయుక్త మీనన్ మన ముందుకు నెక్స్ట్ ఏ సినిమాతో వస్తుంది. వచ్చే సినిమాలో ఆమె ప్రతిభని ఎలా చూపిస్తుంది అని నెటిజనులు అనుకుంటున్నారు. బహుశా విరూపాక్ష పార్ట్ 2 సినిమా తీస్తారని అంటున్నారు కాబట్టి.. మళ్ళీ అతి తొందరలో అందులోనే సంయుక్త మీనన్ తన గొప్ప ట్యాలెంట్ ని మళ్ళీ చూస్తామని అనుకుంటున్నారు. ఏది ఏమైనా సంయుక్త మీనన్ కెరియర్ మీద ద్యాస పెడితే బాగుణ్ణు అని అనుకుంటున్నారు.