తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఒక రేంజ్ కి తీసుకుని వెళ్లిన పెయిర్ ప్రభాస్ మరియు రాజమౌళి. వీళ్లిద్దరి (Is Rajamouli the reason for Prabhas bad condition ) కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో ప్రభాస్. అప్పటి నుంచి రాజమౌళి క్రేజ్ కూడా ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఆ సినిమా నాంది తోనే రాజమౌళి కి వచ్చిన గుడ్విల్ వల్లనే ఈరోజు రాజమౌళి సినిమా ఒక ఆస్కార్ అవార్డు ని గెలుచుకోగలిగింది. అప్పటి నుంచి రాజమౌళి ప్రభాస్..
సినిమాలు గురించి ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆలా అప్పటి సక్సెస్ వల్లనే ఈ రోజు, ఆర్ఆర్ఆర్ పాటకు ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ కి నామినేట్ అయ్యి, అవార్డు ను సంపాదించుకుంది. బాహుబలి సక్సెస్ రాజమౌళి కి లాభాన్ని ఇస్తే.. ప్రభాస్ కి మాత్రం చేదు జరిగిందని వార్తలు వస్తున్నాయి. అదెలా అంటే.. రాజమౌళి సినిమా తీసేటప్పుడు తనకి ఒక విజన్ ఉంటాది. దాని ప్రకారం అలా వెళ్లిపోతుంటాడు గాని, దాని వలన ఎవరికి ఎలాంటి నష్టం జరగచ్చు అనేది ఆలోచించడు అంటున్నారు. అందుకే రాజమౌళి ప్రభాస్ కి అంత ద్రోహం చేసాడట.
ఇంతకీ రాజమౌళిని ఇన్ని మాటలు ఎవరు అంటున్నారు అనుకుంటున్నారా? ఎవరో కాదు స్వయానా ప్రభాస్ అభిమానులు అనుకుంటున్నారు. అలా అని పాపాం వాళ్ళ తప్పు కూడా ఏమి లేదు. బాహుబలి సినిమా తరవాత ప్రభాస్ ఆరోగ్యం చాల పాడయిపోయిందని వార్తలు వస్తున్నాయి. దాదాపుగా నాలుగు పాన్ ఇండియా సినిమాలు ప్రభాస్ ( Is Rajamouli the reason for Prabhas bad condition ) చేతిలో ఉన్నాయి గాని, అందులో ఏది ఎప్పుడు రిలీజ్ అవుతాది అనే దానికి క్లారిటీ దొరకడం లేదు. దానికి కారణం ప్రభాస్ ఆరోగ్యానికి ఏదో ఒక సమస్య వచ్చి షూటింగ్ కి వెళ్లలేకపోవడమే అని తెలుస్తుంది.
ప్రభాస్ చికిత్స కోసం విదేశాలకు కూడా వెళ్లాడని అంటున్నారు. నిజానికి ప్రభాస్ ఆరోగ్యం బాహుబలి టైం లో రాజమౌళి చెప్పినట్టు వర్కౌట్ చెయ్యడం వలన ఆరోగ్యం నాశనం అయ్యిందని అంటున్నారు. రాజమౌళి తాను అనుకున్నది సాధించడం కోసం ఆర్టిస్ట్స్ కి మంచి మాటలు చెప్పి, వాళ్ళ ఆరోగ్యం గురించి అస్సలు ఆలోచించకుండా.. తన సక్సెస్ మాత్రమే చూసుకున్నాడని అంటున్నారు. అలాగే మంచి మాటలతో ప్రభాస్ తో అలా చేయించి ప్రభాస్ ఆరోగ్యం పాడయ్యేట్టు చేసి ద్రోహం చేసాడని ప్రభాస్ అభిమానులు వాపోతున్నారు.